విజయనిర్మలని సూపర్ స్టార్ కృష్ణ రెండో వివాహం చేసుకున్నప్పుడు తమ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే విషయాన్ని ఆదిశేషగిరి రావు ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు.
సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన లెజెండ్. సినిమా మేకింగ్ లో కృష్ణ తీసుకున్న ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాల గురించి ఇప్పటికీ అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. సినిమాల్లోకి వచ్చిన తక్కువ టైంలోనే కృష్ణ.. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్ర హీరోలకు పోటీనిచ్చే స్థాయికి ఎదిగారు. కృష్ణ సినిమాల్లో ఎంత సంచలనం సృష్టించారో అదే స్థాయిలో ఆయన వ్యక్తిగత జీవితం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది.
25
కృష్ణ రెండో వివాహం
కృష్ణ, ఇందిరా దేవిలా వివాహం 1961లో జరిగింది. వీరి పెళ్లి జరిగిన 8 ఏళ్లకు మొదటి భార్య ఉండగానే కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. లెజెండ్రీ నటి, దర్శకురాలు విజయనిర్మలని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయింది. రెండో పెళ్లి వివాహం అయినప్పటికీ ఆ తర్వాత కృష్ణ రెండు కుటుంబాలని సక్సెస్ ఫుల్ గా లీడ్ చేశారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
35
అంతా మా అమ్మే చూసుకుంది
కృష్ణ రెండో వివాహం చేసుకున్నప్పుడు ఇంట్లో గొడవలు జరగలేదా అని ప్రశ్నించగా.. అప్పుడు నేను చాలా యంగ్. 17 ఏళ్ళ కుర్రవాడిని. అంతా మా అమ్మే చూసుకుంది. అమ్మ జోక్యం చేసుకుని గొడవలు పెద్దవి కాకుండా చూసుకుంది. సర్దుబాటు చేసింది.
అన్నయ్యకి ఆమె ఒక మాట చెప్పింది. రెండో పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు.. మొదటి భార్య పిల్లలని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకు అని చెప్పింది. ఆ విధంగా అంతా సాఫీగా సాగింది అని ఆదిశేషగిరి రావు అన్నారు. విజయనిర్మలతో పెళ్లి తర్వాత కూడా కృష్ణకి ఇందిరా దేవితో మహేష్ బాబు, ఇతర పిల్లలు సంతానం కలిగారు అని ఆదిశేషగిరి రావు అన్నారు.
55
కృష్ణ గారు ఎంతో కుమిలిపోయారు
ఇందిరా దేవి చనిపోయే ముందు, ఆమె చివరి రోజుల్లో కృష్ణ గారు ఎంతో కుమిలిపోయారు అని ఆదిశేషగిరి రావు అన్నారు. ఇందిరా దేవి మరణించిన కొన్ని నెలలకే కృష్ణ కూడా 2022లో తుదిశ్వాస విడిచారు.