Vijay - Rashmika Wedding : విజయ్, రష్మిక పెళ్లి.. హల్దీ, వెన్యూ, రిసెప్షన్ వివరాలు ఇవే

Published : Feb 20, 2026, 07:30 AM IST

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్తలు జోరందుకున్నాయి. ఫిబ్రవరి 26 న పెళ్లి జరగబోతున్నట్టు సమాచారం. అంతే కాదు అంతకు ముందు జరగాల్సిన హల్దీ, సంగీత్ వేడుకలు ఎప్పుడో తెలుసా?   వీరి పెళ్లి వేడుకలు ఎప్పుడు మొదలవుతాయి.

PREV
14
విజయ్, రష్మిక పెళ్లి వేడుకల వివరాలు..?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఫిబ్రవరి 24న హల్దీ, 25న సంగీత్‌తో పెళ్లి వేడుకలు మొదలవుతాయని సమాచారం. ఫిబ్రవరి 26న అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఈ వేడుకకు ఉదయ్‌పూర్ శివార్లలోని ఓ హిల్ రిసార్ట్‌ను వేదికగా ఎంచుకున్నారట. ముఖ్యంగా 'ది మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్'లోనే పెళ్లి జరగవచ్చని గట్టిగా ప్రచారం జరుగుతోంది. 

24
కేవలం కొద్దిమంది మాత్రమే..

ఆడంబరాలకు పోకుండా, కేవలం దగ్గరి కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యే ఈ వేడుకను ప్రైవేట్‌గా నిర్వహించాలని ఈ జంట భావిస్తున్నట్లు సమాచారం.పెళ్లిని ప్రైవేట్‌గా చేసుకుంటున్నా, రిసెప్షన్‌ను మాత్రం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట. 2026, మార్చి 4న హైదరాబాద్‌లో భారీ విందు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు నగరంలోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటైన 'తాజ్ కృష్ణ'ను వేదికగా ఎంచుకున్నారని సమాచారం. 

34
రిసెప్షన్‌కు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు

ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే,  ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద సెలబ్రిటీ వేడుక కావచ్చు. ఈ జంట ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. పెళ్లి వేడుకల ఫొటోలు, వీడియోలు బయటకు లీక్ కాకుండా ఉండేందుకు కఠినమైన 'నో-ఫోన్' పాలసీని అమలు చేయనున్నారని సమాచారం. 

44
ఓటీటీ నుంచి భారీ ఆఫర్..

విజయ్ రష్మిక  పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చిందట. అయితే, విజయ్ దేవరకొండ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తన జీవితంలోని ఈ ముఖ్యమైన ఘట్టాన్ని వ్యాపారం చేయకూడదని, పూర్తిగా వ్యక్తిగతంగానే ఉంచుకోవాలని విజయ్ భావిస్తున్నాడట. అభిమానుల్లో ఎంత ఆసక్తి ఉన్నా, ఈ వేడుకను ప్రైవేట్‌గా ఉంచాలనే వారి నిర్ణయం స్పష్టంగా కనిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories