OTT Release: బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్, ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి కార్తీక్ ఆర్యన్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?

Published : Feb 19, 2026, 09:56 PM IST

థియేటర్లలో అనుకున్నంతగా ఆడని కార్తీక్ ఆర్యన్, అనన్య పాండేల సినిమా 'తూ మేరీ మే తేరా మే తేరా తూ మేరీ' సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ దగ్గర 49.5 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ రొమాంటిక్ కామెడీ, ఓటీటీలోనైనా ప్రేక్షకులను మెప్పిస్తుందా?

PREV
15
TMMTMTTM OTT Release

'తూ మేరీ మే తేరా మే తేరా తూ మేరీ' సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటిస్తూ, "పాప్‌కార్న్ రెడీ, మీకోసమే వెయిటింగ్. ఇప్పుడే చూడండి" అని ప్రైమ్ వీడియో పోస్ట్ చేసింది. ఈ ప్రకటనపై అభిమానులు రకరకాలుగా స్పందించారు.

25
డైరెక్టర్ సమీర్ విద్వాన్స్

డైరెక్టర్ సమీర్ విద్వాన్స్ తీసిన ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే హీరోహీరోయిన్లు. కథేంటంటే.. రే అనే వెడ్డింగ్ ప్లానర్ (కార్తీక్) క్రొయేషియా ట్రిప్‌లో రూమీ (అనన్య) అనే రచయిత్రితో ప్రేమలో పడతాడు. కానీ, వయసు పైబడిన తన తండ్రి (జాకీ ష్రాఫ్)ని వదిలి అమెరికా వెళ్లేందుకు రూమీ ఒప్పుకోదు. కుటుంబ బాధ్యత, వ్యక్తిగత ఆశయాల మధ్య నడిచే ఈ సంఘర్షణే సినిమాకు కీలకం.

35
నెగెటివ్ రివ్యూలు

థియేటర్లలో రిలీజైనప్పుడు ఈ సినిమాకు మిక్స్‌డ్ నుంచి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 49.5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. కథ రొటీన్‌గా, ఊహకందేలా ఉందని ప్రేక్షకులు పెదవి విరిచారు. నటన విషయంలో అనన్య పాండే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది.

45
ఓటీటీ రిలీజ్

ఈ సినిమాలో క్లాసిక్ సాంగ్ "సాత్ సముందర్ పార్" రీక్రియేషన్‌పై కూడా విమర్శలు వచ్చాయి. చాలా మంది ప్రేక్షకులకు ఈ ప్రయోగం నచ్చలేదు. కానీ, ఓటీటీ రిలీజ్ పట్ల మాత్రం జనం ఆసక్తిగా ఉన్నారు. "ఫైనల్‌గా వచ్చేసింది" అని ఒకరు, "మళ్లీ మళ్లీ చూస్తా!!" అని ఇంకొకరు కామెంట్ చేశారు.

55
ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..

'పతి పత్నీ ఔర్ వో' తర్వాత కార్తీక్, అనన్య జోడీపై చాలా అంచనాలు ఉండేవి. కానీ ఈసారి వాళ్ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories