మోదీ, అమిత్ షా కు విజయ్ - రష్మిక ఆహ్వానం... రిసెప్షన్ కు ప్రధాని వస్తారా?

Published : Feb 27, 2026, 04:32 PM IST

రష్మిక-విజయ్ జంట తమ పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఏమంటున్నారో  తెలుసా?

PREV
18
ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో 'రాయల్' వెడ్డింగ్

ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గురించే చర్చ. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఈ జంట సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు సంగీత్, క్రికెట్, వాలీబాల్ వంటి చాలా కార్యక్రమాలు జరిగాయి.

28
ప్రధాని నరేంద్ర మోదీ-అమిత్ షా తో భేటి

తమ పెళ్లి రిసెప్షన్‌కు ఆహ్వానించేందుకు రష్మిక-విజయ్ జంట.. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిశారు. వారికి పెళ్లి పత్రిక అందించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

38
విజಯ್-రష్మిక ఇప్పుడు అధికారికంగా దంపతులు

ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో విజయ్, రష్మిక దండలు మార్చుకుని, సప్తపది అడుగులతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుక కేవలం సంప్రదాయబద్ధంగానే కాదు, ఓ పండగలా జరిగింది.

48
కేవలం సంగీత్, మెహెందీ మాత్రమే కాదు..

ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ముందు చాలా కార్యక్రమాలు జరిగాయి. కేవలం సంగీత్, మెహెందీ మాత్రమే కాదు, పెళ్లికి వచ్చిన అతిథుల కోసం క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లు కూడా నిర్వహించారు!

58
పెళ్లికి ముందే ఢిల్లీ వెళ్లిన జంట..

వధూవరుల టీమ్‌ల మధ్య జరిగిన ఈ క్రీడా పోటీలు పెళ్లిలో మరింత జోష్ నింపాయి. సినీ తారలంతా బ్యాట్, బాల్ పట్టుకుని గ్రౌండ్‌లో సందడి చేశారు. అయితే ఈ పెళ్లిలో అసలైన హైలైట్ ఏంటంటే.. పెళ్లికి కొద్ది రోజుల ముందు విజయ్, రష్మిక ఢిల్లీ వెళ్లడమే.

68
ఫోటోలకు ఫోజులిచ్చిన స్టార్ కపుల్..

ఢిల్లీలో ఈ జంట ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిశారు. తమ పెళ్లి పత్రికను అందించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రధానితో విజయ్, రష్మిక నవ్వుతూ దిగిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తున్నాయి.

78
చరిత్రలో నిలిచిపోయే గ్రాండ్ వెడ్డింగ్

గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో ఈ జంట కెమిస్ట్రీకి ఫిదా అయిన అభిమానులు, ఇప్పుడు నిజ జీవితంలో ఒక్కటవ్వడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో #ViRoshWedding హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ దశాబ్దంలోనే ఇది ఒక గ్రాండ్ వెడ్డింగ్‌గా నిలిచిపోతుంది.

88
రాయల్ జోడికి మోదీ ఆశీస్సులు..

కొత్త జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టకేలకు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి జరిగింది. ప్రధాని నరేంద్ర మోది వీరికి ఆశీస్సులు అందించారు. చాలా సేపు వారితో ముచ్చటించారు. రిసెప్షన్ కు ప్రధాని వస్తు బాగుండు అని విరోష్ అభిమానులు కోరుకుంటునర్నారు.

Read more Photos on
click me!

Recommended Stories