ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ప్రధానంగా నిలవనున్నాయి. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఇప్పటికే ట్యాక్సీవాలా, శ్యామ్ సింగ రాయ్ సినిమాలతో వైవిధ్యమైన సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం కూడా ప్రత్యేకమైన స్క్రీన్‌ప్లే సిద్ధం చేసినట్టు సమాచారం. ఇక విజయ్, రష్మిక కాంబినేషన్ గురించి మాట్లాడితే, 2018లో వచ్చిన గీత గోవిందం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ జంట తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా చేసింది. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయింది. అయినప్పటికీ, విజయ్–రష్మిక మధ్య ఉన్న కెమిస్ట్రీకి అప్పట్లో మంచి మార్కులు పడ్డాయి.