సమంతతో నటించిన చివరి సినిమా, మజిలీ తర్వాత నాలో మార్పు మొదలైంది.. 16 ఏళ్ళ కెరీర్ పై నాగ చైతన్య వ్యాఖ్యలు

Published : Sep 05, 2025, 01:46 PM IST

నాగ చైతన్య టాలీవుడ్ లోకి అడుగుపెట్టి 16 ఏళ్ళు పూర్తి అయింది. తన కెరీర్ లో మార్పు తీసుకువచ్చిన మజిలీ చిత్రం గురించి చైతు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

PREV
15

అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో 16 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్నారు. జోష్ చిత్రంతో నాగ చైతన్య 2009లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి చిత్రంతో నాగ చైతన్యకి నిరాశ తప్పలేదు. ఆ తర్వాత సమంతతో కలసి నటించిన ఏ మాయ చేశావే చిత్రంతో చైతూకి హిట్ దక్కింది. నెమ్మదిగా తన కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ ఎదిగిన చైతు ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోగా రాణిస్తున్నారు.

25

నాగ చైతన్య తన కెరీర్ లో ఏ మాయ చేశావే, తడాఖా, 100 పర్సెంట్ లవ్, మనం, మజిలీ, లవ్ స్టోరీ, తండేల్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య తన కెరీర్ గురించి మాట్లాడారు. నా కెరీర్ పట్ల సంతృప్తిగానే ఉన్నాను. సినిమా ఫలితం గురించి పట్టించుకోకూడదని, ఆ చిత్రం ద్వారా వచ్చిన అనుభవాలతో ముందుకు వెళ్లాలని నాన్నగారు చెప్పిన మాటలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

35

అక్కినేని ఫ్యామిలీ అంటేనే ప్రేమకథా చిత్రాలకు పెట్టింది పేరు. తాతగారు ప్రేమ కథా చిత్రాలు మొదలు పెట్టారు. నాన్న కూడా ఎన్నో మెమొరబుల్ లవ్ స్టోరీస్ చేశారు. మజిలీ, లవ్ స్టోరీ చిత్రాల్లో నటించిన తర్వాత నాలో మార్పు మొదలైంది అని చైతు అన్నారు. సమంత, చైతు కలిసి నటించిన చివరి చిత్రం మజిలీ ఇటీవల ప్రేమ కథా చిత్రాలని మిస్ అవుతున్నా. అయితే హడావిడిగా ఎక్కువ సినిమాలు చేయాలనే ఆలోచన లేదు. ఏడాదికి ఒక్క సినిమా చేసినా ఆడియన్స్ కి మంచి క్వాలిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు నాగ చైతన్య తెలిపారు.

45

సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ విషయంలో కూడా తన దృక్పథం మారింది అని చైతు అన్నారు. సోషల్ మీడియాలో విమర్శించేవారితో పాటు మనల్ని అభిమానించే వారు కూడా ఉంటారు. కాబట్టి విమర్శలని, ప్రశంసలను సమానంగా తీసుకుంటానని చైతు తెలిపారు.

55

ప్రస్తుతం నాగ చైతన్య విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో మైథలాజికల్ టచ్ ఉన్న అడ్వెంచర్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ఈ మూవీ చైతు కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ లో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories