పంకజ్ త్రిపాఠి తన బహుముఖ ప్రజ్ఞ, సహజ నటన, నేలవిడిచి సాము చేయని వ్యక్తిత్వంతో భారతీయ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ, బాలీవుడ్‌లో అత్యంత గౌరవనీయ నటులలో ఒకరిగా ఎదిగారు. ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఆయన స్థిరమైన నటన ఆయనకు కీర్తిని మాత్రమే కాకుండా, ఆర్థికంగా స్థిరత్వాన్ని కూడా తెచ్చిపెట్టింది. పంకజ్ త్రిపాఠి నికర సంపద, ఆదాయం, ఆస్తుల గురించి తెలుసుకుందాం.