తమ్ముడు" మూవీలో ఝాన్సీ కిరణ్మయి అనే క్యారెక్టర్ లో నటించాను. తనొక ఆఫీసర్. స్ట్రిక్ట్ గా ఉంటుంది. కుటుంబాన్ని చూసుకుంటూనే, ఆఫీసర్ గా నా బాధ్యతలు నిర్వర్తిస్తుంటాను. హీరో నితిన్ కు సోదరి పాత్ర నాది. ఈ చిత్రం కోసం అడవిలో షూటింగ్ చేశాం. రోజూ యూనిట్ లో ఎవరో ఒకరికి గాయాలు అయ్యేవి. నితిన్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. తను స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడిలా మా అందరితో కలిసిపోయారు.
నటన పరంగా చూస్తే ఈ సినిమాలో నితిన్ చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తాడు. చాలా కష్టమైన సీన్స్ కూడా ఈజీగా చేశాడు. సీన్స్ కోసం చేసిన ప్రిపరేషన్ వల్లే అంత సులువుగా నటించగలిగారు. తమ్ముడు అనే టైటిల్ ఈ సినిమాకు యాప్ట్. మీరు సినిమా చూశాక చెబుతారు. పవన్ కల్యాణ్ గారి తమ్ముడు మూవీకి ఈ చిత్రానికి పోలిక లేదు.