జూనియర్ ఎన్టీఆర్ ప్రభంజనం తట్టుకుని నిలబడ్డ వెంకటేష్ సినిమా ఏదో తెలుసా..?

First Published Jul 16, 2024, 8:45 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల మధ్య రిలీజ్ క్లాష్ కామన్. అయితే బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాలకు ఎదురెల్లి.. హిట్ గా నిలిచిన సినిమాలు చాలా తక్కువ. అందులో ఎన్టీఆర్ సినిమాకు పోటీ రిలీజ్ అయ్యి..హిట్ అయిన వెంకటేష్ మూవీ కూడా ఒకటి ఉంది. అదేంటంటే..? 
 

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా భారీ సినిమా రిలీజ్అవుతుంది అంటే.. పెద్ద హీరో చేస్తున్నా సరే.. చిన్న సినిమాలు ఆ దరిదాపుల్లో ఉండవు. వారి ప్రభంజనం అయిపోయిన తరువాత చిన్నగారిలీజ్అవుతుంటాయి. అలా రిలీజ్ అయ్యి.. హిట్ అయ్యి.. రికార్డ్ సృష్టించిన సినిమాలు కూడా లేకపోలేదు. ఈక్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకు ఎదురెళ్ళాడు విక్టరీ వెంకటేష్. విజయం కూడా సాధించాడు.  ఇంతకీ ఏ సినిమాతోనో తెలుసా..? 
 

జమున మీద పగబట్టిన ఎన్టీఆర్ ‌- ఏఎన్నార్, ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?

Venkatesh Daggubati

వరుస సక్సెస్ లతో దూసకుపోయిన స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. ఎన్నో హిట్ల ను అందించిన ఈ సీనియర్ హీరో తన కెరీరో లో ఒక మంచి హిట్ గా నిలిచిన సినిమా వసంతం. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు.. యూత్ ను కూడా అట్రాక్ట్ చేసిన ఈసినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈసినిమా ఇప్పటికీ  టీవీల్లో వస్తుంటే.. ఫ్యామిలీ అంతా కలిసి కట్టుగా కదలకుండా  చూస్తుంటారు. 

రజినీకాంత్ - కమల్ హాసన్ సంచలన నిర్ణయం, హీరో సిద్దార్ధ్ వల్ల బయటకు వచ్చిన నిజం..
 

Latest Videos


అంతలా ఆడియన్స్ ను మెప్పించిన  ఈ సినిమా విడుదలై రీసెంట్ గా 21 ఏళ్లు పూర్తిచేసుకుంది. వసంతం రిలీజ్ అయ్య 21 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. మూవీ టీమ్ గుర్తు చేసుకున్నారు. వరుస ప్లాప్ లులతో ఇబ్బందిపడిన వెంకీకి ఈ సినిమా కాస్త రిలాక్స్ ను ఇచ్చింది. వాసు, జెమిని సినిమాలు నిరాశపరచగా.. వసంతం హిట్ ఇచ్చింది.  ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే పట్టుదలతో వెంక‌టేష్ చాలా జాగ్రత్తగా ఈసినిమాను చేశారు. 
 

పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? పవర్ స్టార్ అంతలా ప్రేమించాడా..?

మంచి కథ కోసం చూస్తున్న టైమ్ లోనే తమిళ దర్శకుడు విక్రమన్ వ‌సంతం క‌థ‌ను వెంక‌టేష్ కు వినిపించాడు. స్టోరీ న‌చ్చ‌డంలో వెంకీ సినిమా చేసేందుకు అంగీకరించారు. 2002లో వ‌సంతం ప్రారంభ‌మైంది. హీరోయిన్లుగా ఆర్తి అగ‌ర్వాల్‌, క‌ల్యాణి న‌టించారు. ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల్లో ఆకాష్, సునీల్, చంద్ర మోహన్, తనికెళ్ల భరణి త‌దిత‌రులు న‌టించారు. ఎస్.ఎ రాజ్‌కుమార్ మ్యాజిక్ డైరెక్ట‌ర్ గా పని చేశాడు.2003 జులై 11న విడుద‌లైన వసంతం ముందు స్లోగా నడిచినా.. జనాలకు బాగా కనెక్ట్ అయని తరువాత వసూళ్ళతో రెచ్చిపోయింది. 

అంబాని పెళ్లిలో అరుదైన దృశ్యం.. అమితాబ్ వద్దంటే.. రజినీకాంత్ ఏం చేశాడో చూడండి..?
 

ఇక ఇక్కడే మరో విచిత్రం ఏంటంటే.. అన్ని ప్లాప్ లు పడినా.. వెంకటేష్.. ఈ సందర్భంలో ఓ సాహసం చేశాడు. అదేంటంటే. ఎన్టీఆర్ సినిమాకు ఎదురెళ్ళాడు. వసంతం సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందే తారక్ ‌, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా రిలీజ్ అయ్యింది. ఆసినిమా ఎంత ప్రభంజనం అయ్యిందో అందరికి తెలిసిందే. అంత పెద్ద వేవ్ లో కూడా వసంతం సినిమాను రిలీజ్ చేయాలి అనుకోవడం పెద్ద సాహసం. 

అందులోనే వరుసగా రెండు ప్లాప్ లుల తరువాత కూడా వెంకీ ఈ సాహసం చేయడం.. అది సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. సాధారణంగా ఇంత పెద్ద సినిమా మధ్యలో ఎంత మంచి సినిమా వచ్చినా.. నిలవడం కష్టం. కాని వసంతం సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరించారు. దాంతో సింహాద్రి ఊపులో కూడా వసంతానికి ఆదరణ దక్కింది. అలా ఎన్టీఆర్ కు ఎదురెళ్ళిన వెంకటేష్.. అద్భుతమైన విజయంతో బయటపడ్డాడు. 

 చిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. వెంక‌టేష్ యాక్టింగ్‌, క‌థ‌-క‌థ‌నం, సాంగ్స్ సినిమాకు ప్ర‌ధానం బ‌లంగా నిలిచాయి. ముఖ్యంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ర‌చించిన గాలి చిరుగాలి సాంగ్ అప్ప‌ట్లో ఒక సెన్సేష‌న్ అయింది. అలాగే టాక్ అనుకూలంగా ఉండ‌టం వ‌ల్ల వ‌సంతం మూవీ క్లీన్ హిట్ గా నిలిచింది.

అంతే కాదు వ‌సంతం సినిమా టీమ్ అనుకున్నదానికంటే ఎక్కువగానే.. మంచి వసూళ్లను కూడా సాధించింది.  .8.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈసినిమా టోటల్  ర‌న్ లో 14 కోట్ల వరకూ  షేర్ ను కలెక్ట్ చేసింది. మొత్తంగా 5 కోట్ల వరకూ  లాభాలను సొంతం చేసుకుందని తెలుస్తోంది. అంతే కాదు ఈషినిమాలో గాలి చిరుగాలి సాంగ్ అప్పట్లో ఎంత వైరల్ అయ్యిందో కూడా అందరికి తెలిసిందే. మోటివేషన్ కు సబంధించిన ప్రతీ సంద్భంలో ఈ పాట మారుమోగేది.  

click me!