జమున మీద పగబట్టిన ఎన్టీఆర్ ‌- ఏఎన్నార్, ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?

Published : Jul 16, 2024, 06:52 PM IST

ఎన్టీఆర్ - ఏఎన్నార్ అప్పట్లో ఇండస్ట్రీని శాసించారు..వారు కాదంటే ఇండస్ట్రీలో లేదు అన్నట్టే. అలా కొనసాగుతున్న టైమ్ లో హీరోయిన్ జమునపై వారు అనధికారికంగా బ్యాన్ విధించారట. ఇంతకీ జమున చేసిన నేరం ఏంటి..? వారు ఎందుకలా చేశారు...?   

PREV
18
జమున మీద పగబట్టిన ఎన్టీఆర్ ‌- ఏఎన్నార్,  ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?

ఫిల్మ్ ఇండస్ట్రీలోకోపాలు తాపాలు.. పట్టింపులు పగలు.. స్నేహాలు వైరాలు.. ఇవన్నీ కామన్.. మాటల పట్టింపుతో ఏళ్ల తరబడి మాట్లాడుకోకుండా ఉన్నవారు ఉన్నారు.. ఇప్పటికీ మాట్లాడుకోకుండా దూరంగా ఉంటున్నస్టార్లు ఉన్నారు. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి.. మరికొన్ని టైమ్ తీసుకుంటాయి. అలాంటి సమస్యే.. అలనాటి తారలు జమును ఎన్టీఆర్ ఏఎన్నార్ ల మధ్య వచ్చాయట. 
 

అంబాని పెళ్లిలో అరుదైన దృశ్యం.. అమితాబ్ వద్దంటే.. రజినీకాంత్ ఏం చేశాడో చూడండి..?

28
Actress Jamuna

ఈముగ్గురి మధ్య అంటే.. జమున ను ఎన్టీఆర్ ఎఎన్నార్ కలిసి అనఫిషియల్ గా బ్యాన్ చేశారట. అయినా సరే ఆమె ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. అసలు వీరిమధ్య వచ్చిన సమస్య ఏంటి..? ఎందుకు జమునను వీరు బ్యాన్ చేశారు..? మళ్లీ సమస్య ఎప్పుడు పరిష్కారం అయ్యింది. చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచిన ఈ విషయం ఇండస్ట్రీలో అప్పట్టో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ విషయంలో జమున కూడా తన వెర్షన్ వేరుగా కొన్ని సందర్భాల్లో వెల్లడించారు. ఇంతకీ విషయం ఏంటంటే..? 

నాగార్జున మోజుపడ్డ హీరోయిన్..? మన్మధుడికే షాక్ ఇచ్చిన బ్యూటీ ఎవరో తెలుసా..?

38
Actress Jamuna

భూకైలాస్ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుందట. ఈసినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు జమున కూడా నటించింది. అయితే షూటింగ్ అంటే గంట ముందే సెట్ లో ఉంటారు ఎన్టీఆర్ ఏఎన్నార్. కాని జమున మాత్రం కాస్త లేట్ గా వచ్చేవారట. అయితే ఆ రోజు ఏం జరిగిందో తెలియదు కాని.. జమున నాలుగ గంటలు లేట్ గా షూటింగ్ కు వచ్చిందట. ఉదయ 5 గంటలకు పెద్దలు షూటింగ్ కు వస్తే.. ఉదయం పది గంటలకు ఆమె వచ్చిందట. 

రజినీకాంత్ - కమల్ హాసన్ సంచలన నిర్ణయం, హీరో సిద్దార్ధ్ వల్ల బయటకు వచ్చిన నిజం..

48
Actress Jamuna

అయితే అప్పట్లో ఎన్టీఆర్- ఏఎన్నార్ ఇద్దరు సెట్ లో ఉంటే.. ఎంత పెద్ద నటులైనా.. కాస్త జాగ్రత్తగా ఉండేవారు. వారితో చాలా వినయంగా మాట్లాడేవారు.. ఏదైన చిన్న తప్పు జరిగినా వెంటే క్షమాపణ చెప్పేవారు. కాని జమున మాత్రం కాస్త ఆత్మాభిమానంతో ఉండేవారట. ఎంత పెద్దవారైనా లెక్క చేసేవారు కాదట. తన పనేంటో తాను చూసుకుని.. పక్కన కూర్చునేవారట. ఇక్కడ కూడా అదే జరిగింది. 
 

పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? పవర్ స్టార్ అంతలా ప్రేమించాడా..?

58
Actress Jamuna

నాలుగు గంటలు లేటుగా వచ్చిన జమున.. అప్పటి వరక ఎండలో ఇబ్బందిపడుతున్న ఎన్టీఆర్ ‌- ఏఎన్నార్ లకు కనీసం క్షమాపన కూడా చెప్పకుండా.. కారుది షాట్ రెడీనా అన్నారట. దాంతో ఇద్దరు స్టార్ హీరోలకు కోపం గట్టిగా వచ్చేసిందట. అప్పుడు ఇద్దరు హీరోలు మాట్లాడుకుని.. జమునతో సినిమాలు చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నారని అప్పుడు టాక్ వైరల్ అయ్యింది.

68
Actress Jamuna

అయితే కొన్ని సందర్భాల్లో జమున కూడా తనపై స్టార్ హీరోలు పగబట్టారంటూ చెప్పుకొచ్చారు. అయితే వారు తీసుకోకపోయినా.. మిడిల్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ.. తన పని తాను చేసుకుందట జమున. కాని సారి చెప్పి తనను తాను తగ్గించుకోలేదుట. ఈక్రమంలో నిర్మాత చక్రపాణి వల్ల ఈసమస్యకు తెరపడినట్టు తెలుస్తోంది. ఆయన నిర్మించి గుండమ్మ కథతో ఈ వివాదం తెరమరుగు అయ్యిందట. 
 

78
Actress Jamuna

ఈసినిమాలో జయ పాత్రకు జమున తప్పించి ఎవరూ సూట్ అవ్వరు.. ఆమే కావాలి అని చక్రపాణి పట్టుపట్టుకుని కూర్చున్నారట. ఈసినిమాలో కూడా ఏన్టీఆర్ ఏఎన్నార్ కలిసి మల్టీ స్టారర్ చేయడం.. చక్రపాణి లాంటివారు పట్టుపట్టడంతో ఇద్దరు స్టార్ హీరోలు పట్టు విడిచారట.

88

 ఇక గుండమ్మకథ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి మళ్లీ జమునకు అవకాశాలు ఇచ్చారట. ఇలా ఇండస్ట్రీలో ఇలాంటి ఎన్నో గొడవలు.. సర్ధుబాట్లు జరిగాయి. 

click me!

Recommended Stories