Athadu Movie: మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'అతడు'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సాధించడమే కాదు.. కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ సాధించింది. మరి దీనిపై ఫస్ట్ ఛాయస్ ఎవరో తెలుసా.?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఒకటి 'అతడు'. అప్పట్లో ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2005లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్ద హిట్ అయింది. మహేష్ బాబు కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది.
25
20 సంవత్సరాల తర్వాత..
'అతడు' సినిమా విడుదలై 20 సంవత్సరాల సందర్భంగా ఆగష్టు 9, 2025న మహేష్ బాబు పుట్టినరోజున రీ-రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ మూవీ నిర్మాత మురళి మోహన్ ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు.
35
ఛాయస్
అతడు సినిమా కథ మొత్తం రెడీ అయ్యాక.. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు మొదటిగా నటుడు ఉదయ్ కిరణ్‌తో చేయాలని భావించాం. మొదటి నుంచి ఉదయ్ కిరణ్‌ను బాగా దగ్గరగా చూసిన వాడినని.. తరచుగా వచ్చి కలుస్తూ ఉండేవాడినని మురళి మోహన్ చెప్పాడు.
అతడు మూవీ చేయాలనుకున్న సమయంలో ఉదయ్ కిరణ్‌కి చిరంజీవి కుమార్తెతో పెళ్లి చర్చలు జరుగుతూ వచ్చాయి. అతడి సినిమా డేట్స్ అన్ని కూడా వేరే టీం చూడటం వల్ల బిజీ అయ్యారని.. దీంతో ఉదయ్ కిరణ్‌తో చేయాల్సింది.. మహేష్ బాబుతో సినిమా చేశామని మురళి మోహన్ అన్నారు.
55
రాజమౌళితో 'వారణాసి' మూవీ..
ప్రస్తుతం మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళితో కలిసి 'వారణాసి' సినిమా చేస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.