SreeLeela remuneration: తెలుగులో సూపర్ హీరోయిన్ శ్రీలీల. ఆమె వరుసపెట్టి సినిమాల్లో నటిస్తోంది. తాజాగా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అజిత్ కుమార్ 'ఏకే 64' సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
శ్రీలీల పెళ్లిసందడి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే అంతకుముందే కన్నడ సినిమాలలో నటించింది కానీ మంచి గుర్తింపు రాలేదు. తెలుగులో తొలి సినిమాలోనే తన డ్యాన్స్, అందం, నటనతో అందరికీ నచ్చేసింది. దీంతో ఎన్నో సినిమా అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది శ్రీలీల. అమెరికాలో 2001లో పుట్టిన శ్రీలీల పక్కా తెలుగమ్మాయి. తెలుగు ఎంతో బాగా మాట్లాడుతుంది. తెలుగులో సక్సెస్ అయ్యాక సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన పరాశక్తి సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది.
24
నటనకే మార్కులు
శ్రీలీల డ్యాన్స్‌కు అభిమానులు ఎక్కువ. అయితే పరాశక్తి సినిమాతో ఆమె అద్భుతమైన నటి అనే పేరునుకూడా తెచ్చుకుంది. 1960ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఆమె నటన ఆకట్టుకుంది. ఇప్పుడు తమిళంలో కూడా ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఆమె అజిత్ పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తమిళంలో మొదటి సినిమా శివకార్తికేయన్, రెండో సినిమా అజిత్ తో చేయడమంటే మామూలు విషయం కాదు.
34
రెమ్యురేషన్ ఎంత
ఇండస్ట్రీలో శ్రీలీల రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గానే ఉంది. తెలుగులో సినిమాలకు మొదట్లో కోటిన్నర రూపాయలు తీసుకునే శ్రీలీల స్టార్ హీరోయిన్ అయ్యాక రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. సినిమాను బట్టి నాలుగు కోట్ల రూపాయల నుంచి 6 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక తమిళంలో తొలిసినిమా పరాశక్తి. ఈ సినిమా అవకాశం వదులుకోవడం ఇష్టంలేక తన రెమ్యునరేషన్ చాలా తగ్గించుకుంది. కేవలం ఈ సినిమా కోటి రూపాయలు మాత్రమే పారితోషికంగా తీసుకున్నట్టు సమాచారం.
పరాశక్తి సినిమా సక్సెస్ అవ్వడంతో తమిళంలో శ్రీలీలకు క్రేజ్ పెరిగింది. ఆమె బిజీ అవ్వడం ప్రారంభించింది. ముఖ్యంగా అజిత్ కుమార్ తో ఏకే 64 సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఎంపికైంది. ఈ సినిమా హిట్ అయితే తమిళంలో టాప్ హీరోయిన్ గా మారిపోతుంది శ్రీలీల. ఈమె తల్లి డాక్టర్. ఇక శ్రీలీల కూడా వైద్య విద్యను అభ్యసిస్తూ మరో వైపు సినిమాలు చేస్తోంది.