Mana Shankara Vara Prasad Garu 3 Days Collections: బాలయ్య లైఫ్‌ టైమ్‌ వసూళ్లని మూడు రోజుల్లోనే లేపేసిన చిరు

Published : Jan 15, 2026, 12:04 PM IST

MSG 3 Days Collections: చిరంజీవి నటించిన `మన శంకర వరప్రసాద్‌ గారు` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే బాలయ్య లైఫ్‌ టైమ్‌ కలెక్షన్లని లేపేయడం విశేషం. 

PREV
15
బ్లాక్‌ బస్టర్‌ దిశగా మన శంకర వరప్రసాద్‌ గారు మూవీ

మెగాస్టార్‌ చిరంజీవి ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. వెంకటేష్‌ ఇందులో స్పెషల్‌ రోల్‌ చేయగా, లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటించింది. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ జనవరి 12న విడుదలై ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తుంది. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు బ్లాక్‌ బస్టర్‌గా దూసుకుపోతుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబడుతుంది.

25
మన శంకర వరప్రసాద్‌ గారు మూడు రోజుల కలెక్షన్లు

`మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ లేటెస్ట్ కలెక్షన్ల రిపోర్ట్ వచ్చింది. చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ మూడు రోజుల్లో భారీ వసూళ్లని రాబట్టింది. అంతేకాదు థియేటర్లో హోల్డ్ అయ్యింది. సాధారణంగా మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు తగ్గిపోతాయి. మూడో రోజు మరింత తగ్గుతాయి. కానీ మూవీ మూడో రోజు కూడా స్టడీగా ఉన్నాయి. ఇదే మూవీ విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.152 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది.

35
60శాతం వసూళ్లని రాబట్టిన మన శంకర వర ప్రసాద్‌ గారు

మొదటి రోజుఈ చిత్రానికి రూ.84కోట్లు వచ్చాయి. రెండో రోజు రూ.36కోట్లు రాగా, మూడో రోజు రూ.32 కోట్లు వచ్చాయి. దీంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రూ.152కోట్లు కావడం విశేషం. ఈ మూవీకి సుమారు రూ.140 కోట్ల వ్యాపారం జరిగింది.  దాదాపు రూ.250 కోట్లు వస్తే ఇది బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. ఇప్పటికే ఇది అరవై శాతం వసూళ్లని రాబట్టింది. ఇంకా నాలుగు రోజులు ఈ చిత్రానికి తిరుగులేదు. దీంతో ఈ ఆదివారం వరకు బ్రేక్‌ ఈవెన్‌కి చేరుకుంటుందని చెప్పొచ్చు. ఈ మూవీ లాంగ్‌ రన్‌లో మూడు వందల కోట్లు దాటుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

45
చిరంజీవి దెబ్బకి బాలయ్య లైఫ్‌ టైమ్‌ కలెక్షన్లు ఔట్‌

ఇదిలా ఉంటే చిరంజీవి నటించిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ సరికొత్త సంచలనంగా మారింది. బాలయ్య మూవీస్‌ లైఫ్‌ టైమ్‌ వసూళ్లని బ్రేక్‌ చేసింది. బాలకృష్ణ నటించిన ఏ మూవీ కూడా రూ.150కోట్లు దాటలేదు. `అఖండ`, `అఖండ 2`, `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి`, `డాకుమహారాజ్‌` ఇలా అన్ని సినిమాలు వంద కోట్లు దాటాయి. కానీ ఏది రూ.150 దాటలేదు. ఈ క్రమంలో ఇప్పుడు బాలయ్య సినిమాల లైఫ్‌ టైమ్‌ వసూళ్లని మూడు రోజుల్లోనే `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ బ్రేక్‌ చేయడం విశేషం. ఇదిప్పుడు మెగా అభిమానులను ఫుల్‌ ఖుషీ చేస్తే, నందమూరి అభిమానులను జీర్ణించుకోనివ్వడం లేదు.

55
అత్యధిక వసూళ్లని రాబట్టిన బాలయ్య టాప్‌ 5 మూవీస్‌

బాలయ్య నటించిన టాప్ 5 మూవీస్‌ కలెక్షన్లు చూస్తే `డాకు మహారాజ్‌` రూ.133కోట్లు, `అఖండ` రూ.125కోట్లు, `వీరసింహారెడ్డి` రూ.122 కోట్లు, `భగవంత్‌ కేసరి` 113కోట్లు రాబట్టగా, ఇటీవల వచ్చిన `అఖండ 2` రూ.128కోట్లు వసూళు చేసింది. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఎన్బీకే 111 పేరుతో ఇది తెరకెక్కనుంది. కానీ బడ్జెట్‌ కారణంగా ఆగిపోయింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories