Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి

Published : Dec 13, 2025, 08:59 AM IST

Illu Illalu Pillalu Today : పార్క్ లో అమూల్య విశ్వతో కలిసి ఉండటం చూసి చందు షాక్ అవుతాడు.  ఇంట్లో చెబుతాడేమో అని ఓ వైపు వల్లి భయపడుతూ ఉంటుంది. మరోవైపు చందూ రాత్రి అవుతున్నా ఇంటికి రాడు. మరి, ఈ రోజు చందుని వల్లి ఎలా మాయ చేసిందో చూద్దాం.. 

PREV
15
Illu Illau Pillalu

కోడళ్లు తమ భర్తలతో కలిసి పార్క్ కి వెళ్లినందుకు వేదవతి బాధపడుతుంది. అదేవిషయం తన కోడళ్లకు చెబితే నర్మద మరికాస్త ఉడికిస్తుంది. కావాలంటే మీరు కూడా మీ భర్తతో బయటకు వెళ్లండి అని రెచ్చగొడుతుంది. ఆ మాటలు సీరియస్ గా తీసుకున్న వేదవతి భర్త రామరాజుతో కలిసి సినిమాకు వెళ్లడానికి ఒప్పిస్తుంది. రామరాజు కూడా ఒప్పుకోవడంతో హగ్ చేసుకొని ఆనందపడుతుంది. అత్త పడుతున్న సంతోషాన్ని చూసి నర్మద, ప్రేమ కూడా చాలా సంతోషపడతారు.

మరోవైపు చందు ఇంకా ఇంటికి రాలేదని వల్లి కంగారు పడుతూ ఉంటుంది. వల్లి టెన్షన్ ని నర్మద, ప్రేమ చూస్తారు. ఏమైందో అడుగుదామని ప్రేమ అంటే... నర్మద ఆపి.. తను అసలు ఏం చేస్తుందో చూద్దాం అని ఆపేస్తుంది. ఈ లోగా చందు ఇంటికి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో చందు ముఖం చాలా సీరియస్ గా ఉంటుంది. ‘ అమ్మ బాబోయ్ ఈయన ఇంత సీరియస్ గా ఉన్నాడు అంటే.. అమూల్య, విశ్వల ప్రేమ విషయం మామయ్య గారెకి చెప్పడానికి గట్టిగా రెడీ అయిపోయినట్లున్నాడు’ అని మనసులోనే అనుకుంటుంది.

25
ప్రేమ, నర్మదకు అనుమానం...

ఈ లోగా చందు రాగానే వల్లి ఆపేసి... ‘ బావ నీతో మాట్లాడాలి, అర్జెంట్ అని అడుగుతుంది’. కానీ, చందు మాత్రం తాను నాన్నతో మాట్లాడాలి అంటాడు. వల్లి వినిపించుకోకుండా మధ్యలోనే ఆపేస్తూ ఉంటుంది. వల్లి టెన్షన్ పడటం చూసిన ప్రేమకు ఏదో జరిగింది అనే అనుమానం కలుగుతుంది.

35
రామ రాజు ముందు నోరు విప్పిన చందు

మరోవైపు రామరాజు, వేదవతి కలిసి సినిమాకి వెళ్లడానికి రెడీ అవుతారు. వీళ్లతో తిరుపతి మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో వల్లి చెప్పేది వినిపించుకోకుండా నాన్నతో మాట్లాడాలని చందు లోపలికి వచ్చేస్తాడు. లోపలికి రావడం రావడమే.. ‘నాన్న నేను మీతో మాట్లాడాలి’ అని అంటాడు. ఏంట్రా అని రామరాజు అడగడంతో... ‘ ఇది మన పరువుకు సంబంధించిన విషయం’ అని చెబుతాడు. అందరూ షాక్ అయ్యి వింటూ ఉంటారు. బయట వల్లి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. తీరా చందు నిజం చెప్పే సమయానికి వల్లి కింద పడిపోయినట్లు నటిస్తుంది. ఆ విషయం చెప్పడం ఆపేసి అందరూ వల్లి దగ్గరకు పరుగులు తీస్తారు. నొప్పితో బాధపడుతున్నట్లు తెగ నటించేస్తుంది. వల్లి చేసింది అంతా డ్రామా అని నర్మద, ప్రేమ పసిగట్టేస్తారు.( కానీ, వీళ్లు ఆ విషయాన్ని బయటకు చెప్పరు) కానీ నర్మద తెలివిగా... ‘ బావగారు వల్లి అక్కను చూసుకోవడానికి మేం ఉన్నాం కదా... మీరు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు కదా.. మాట్లాడుకోండి’ అని చెబుతుంది. చందు సరే అని... చెప్పడానికి రెడీ అవుతుంది. వల్లి మళ్లీ మాష్టర్ ప్లాన్ వేసి భర్తను వదిలి ఉండనట్లు చేస్తుంది. ఇక తప్పక.. చందు... శ్రీవల్లిని లోపలికి తీసుకొని వెళతారు. తమ ప్లాన్ రివర్స్ అయినందుకు ప్రేమ, నర్మద డిసప్పాయింట్ అవుతారు.

45
భర్తతో షికారుకు వేదవతి...

మరోవైపు... వల్లికి బాలేదు కదా అని రామరాజు అంటే... అయినా సరే... సినిమాకు వెళ్లాల్సిందే అని వేదవతి పట్టుపడుతుంది. నర్మద ఆపడానికి ప్రయత్నించినా... వినిపించుకోదు. వాళ్లు.. బయటకు వెళ్లిపోతారు. చందు... వల్లిని లోపలికి తీసుకొచ్చి పడుకోపెడతాడు. ‘ అప్పటికి అయితే... ఈ విషయాన్ని మామయ్య గారితో చెప్పకుండా ఆపేశాను. ఇక ముందు కూడా చెప్పకుండా చేయాలి ’ అని మనసులోనే అనుకున్న వల్లి.. మరో మాష్టర్ ప్లాన్ వేస్తుంది.

అయితే.. వల్లి ప్రవర్తన గురించి నర్మద, ప్రేమ లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో ప్లాన్ చేసిందని వారికి అర్థమౌతుంది కానీ... అది ఏ విషయం గురించో అర్థంకాక ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు తిరుపతి.. తన స్వప్న సుందరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఎవరో ఒక అమ్మాయి ముఖానికి ముసుగు వేసుకొని అతనికి ఫోన్ చేస్తుంది. తిరుపతి పొంగిపోతూ ఉంటాడు.

55
భర్తను బకారా చేసిన వల్లి...

సీన్ కట్ చేస్తే...చందు... మళ్లీ అమూల్య విషయం తండ్రికి చెప్పడానికి వెళ్తుంటే.. వల్లి ఆపి.. తాను ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలని చెబుతుంది. దీంతో చందు ఆగిపోతాడు. ‘ ఏ విషయం గురించి మామయ్య గారితో చెప్పాలని అనుకుంటున్నావు? భర్త ఏ విషయం అయినా ముందు భార్యతోనే కదా చెబుతాడు... ఆ తర్వాతే కదా ఎవరితో అయినా చెబుతాడు.. మరి నువ్వెందుకు నాకు చెప్పడానికి ఆలోచిస్తున్నావ్? అంటే నువ్వు నన్ను పరాయి దానిలా చూస్తున్నావా? నీ మనసులో విషయాలను చెప్పుకోవడానికి కూడా పనికిరానా నేను’ అని సెంటిమెంట్ డైలాగ్ కొడుతుంది. దానికి చందు కరిగిపోతాడు. ‘ ఎలా చెప్పాలో అర్థం కాక ఆగిపోయాను’ అని ఏదో చెప్పబోయి ఆగిపోతాడు. ఇక.. వల్లి తన నటన మొత్తం బయటపెడుతుంది. సెంటిమెంట్ డైలాగులు కొడుతుంది. ఏం జరిగిందో చెప్పమని బలవంత పెడుతుంది.

దీంతో.. చందు.. ‘ పార్క్ లో అమూల్య, విశ్వ కలిసి తిరగడం చూశాను. అమూల్య.. ఆ విశ్వక్ గాడితో ప్రేమలో ఉంది అనుకుంట ’ అని చెబుతాడు. అది విన్న వల్లి ఏమీ తెలియని దానిలా.. షాక్ అయినట్లు నటిస్తుంది. ‘ నేను నమ్మలేకపోతున్నాను బావ.. షాక్ తో నోటి వెంట మాట రావడం లేదు. నువ్వు చెప్పేది నిజమా? అమూల్యను ఆ బండోడుతో పార్క్ లో చూశావా?’ అని అడుగుతుంది. అవును అని చందు అనగానే.. ‘ ఎంత ఘోరం... రెండు కుటుంబాలు పాతికేళ్లుగా కొట్టుకు చస్తున్నారని తెలిసి కూడా మన అమూల్య పోయి పోయి.. ఆ దున్నపోతు గాడిని ప్రేమించడం ఏంటి? బుర్ర లేకుండా ఇలాంటి పనులు చేయడం ఏంటి?’ అని రెచ్చ గొడుతుంది. అందుకే నాన్నకు చెబుతాను అని వెళ్తున్న చందుని మళ్లీ ఆపేస్తుంది.

‘ అంటే ఏంటి బావ...మీ చెల్లిని, నాన్న గారిని చంపేసుకుంటావా?’ అని అడుగుతుంది. చందు షాక్ అయ్యి ఆగిపోతాడు. ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే.. అమూల్యను తనను తాను ఏదో ఒకటి చేసేసుకుంటుంది అని చెప్పి చందుని భయపెడుతుంది. లేదంటే అమూల్య లేచిపోయి పెళ్లి చేసుకోవచ్చు. ఇది చూసి మామయ్య గారు తట్టుకోలేరు అని, గుండె పగిలి చస్తారని చెబుతుంది. వల్లి మాటలకు చందు ఆగిపోతాడు. కానీ.. అమూల్యను ఎలా దారిలోకి తేవాలని అని చందు అంటే... ఆ పని తాను చేస్తాను అని వల్లి నమ్మిస్తుంది. చందుని ఆపేసి.... గండం తప్పిందని వల్లి ఆనందంగా డ్యాన్సులు వేస్తూ బయటకు వెళ్తుంది. అది కాస్త నర్మద, ప్రేమ కంట పడుతుంది. ఈ వల్లి ఏదో చేస్తోందని.. అది ఏంటో తేల్చాలని ఈ తోడి కోడళ్లు అనుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories