Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు

Published : Dec 13, 2025, 07:56 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 13వ తేదీ)లో జ్యోత్స్నను అరెస్ట్ చేసినట్లు కలకన్న పారు. ఉలుకు పలుకులేకుండా పడిపోయిన సుమిత్ర. మమ్మీ చనిపోయిందన్న జ్యోత్స్న. సుమిత్రకు జ్యోత్స్న కూతురే కాదని నోరు జారిన పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

PREV
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో నిద్రలో ఉలిక్కిపడి లేచి నా మనుమరాలిని అరెస్ట్ చేయొద్దు. తను ఏ తప్పు చేయలేదు అంటుంది పారు. గ్రానీ ఏమైంది నీకు అంటూ లేస్తుంది జ్యోత్స్న. నువ్వు కారు ఆక్సిడెంట్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యావు కదా.. అది ఇప్పుడు నాకు కలలో వచ్చిందే అంటుంది పారు. 

ఎప్పుడో జరిగింది ఇప్పుడు కలొచ్చిందా.. సైలెంట్ గా పడుకో అంటుంది జ్యోత్స్న. అది కాదే.. ఇప్పుడు నువ్వు చేసిన తప్పులన్నీ బయటపడి మళ్లీ అరెస్ట్ అవుతావేమో అంటుంది పారు. నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేశావా అని అడుగుతుంది.

ఏం చేయలేదు పడుకో అంటుంది జ్యోత్స్న. నాకు కలలు ఊరికే రావే.. జరగబోయేది వచ్చినట్లు అనిపిస్తోంది. పైగా ఉదయం వచ్చిన కల కచ్చితంగా జరుగుతుంది అంటుంది పారు. పట్టించుకోకుండా పడుకుంటుంది జ్యోత్స్న. ఇది ఆఫీసులో ఏదైనా తప్పు చేస్తే.. శ్రీధర్ ఈజీగా బయటపెడతాడు. దీన్ని ఎలాగైనా కాపాడాలి అంటూ నిద్రపోతుంది పారు.

26
మమ్మీ చచ్చిపోయింది గ్రానీ

మరోవైపు తెల్లారిన నిద్రలేవదు సుమిత్ర. లేపడానికి ప్రయత్నిస్తాడు దశరథ. ఎంతకూ లేవకపోవడంతో కంగారు పడి శివన్నారాయణ దగ్గరకు వెళ్తాడు. సుమిత్ర లేవడం లేదు నాన్న అని చెప్తాడు. ఇద్దరూ కలిసి సుమిత్ర గదిలోకి వచ్చి లేపడానికి ప్రయత్నిస్తారు.

మరోవైపు దశరథ మాటలు విన్న జ్యోత్స్న.. పారు దగ్గరికి వెళ్లి.. మమ్మీ చచ్చిపోయింది గ్రానీ. డాడీ, తాతతో చెప్తుంటే విన్నాను అని కంగారు పడుతుంది. సుమిత్ర చచ్చిపోవడం ఏంటే.. రాత్రి కూడా బాగానే ఉంది కదా.. పదా వెళ్లి చూద్దాం అని ఇద్దరూ వెళ్తారు.

పారు సుమిత్రను లేపడానికి ప్రయత్నిస్తుంది. ఒకసారి గట్టిగా కుదిపి లేపగానే సుమిత్ర లేస్తుంది. మీరంతా ఇక్కడ ఎందుకు ఉన్నారు. ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది. నువ్వు లేకపోయేసరికి అని పారు చెప్తుండగా.. దశరథ వద్దు పిన్ని అంటాడు.

36
జ్యోత్స్న సుమిత్ర కూతురు కాదు

ఏమైందమ్మా నీకు ఎందుకు అలా పడుకున్నావు అంటాడు శివన్నారాయణ. నిద్రపట్టక స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాను అని చెప్తుంది సుమిత్ర. ఇంకెప్పుడు వేసుకోకు అంటాడు శివన్నారాయణ. అయినా అంత నిద్రపట్టని ఆలోచనలు ఏమున్నాయి సుమిత్ర నీకు అంటుంది పారు. 

పెళ్లికి ఎదిగిన కూతురు ఇంట్లో ఉంటే ఏ తల్లి అయినా ఇలాగే ఆలోచిస్తుంది అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది కదా అంటుంది పారు. సంబంధాలు కుదరడం లేదు అంటాడు శివన్నారాయణ. కూతురి పెళ్లి గురించే సుమిత్ర బెంగ అయితే తను అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు అంటుంది పారు.

ఎందుకు అంటాడు శివన్నారాయణ. ఎందుకంటే జ్యోత్స్న సుమిత్ర కూతురే కాదు అని నోరు జారుతుంది పారు. అదేంటి పిన్ని జ్యోత్స్న మా కూతురు కాకపోవడం ఏంటి అని అడుగుతాడు దశరథ. పెళ్లి చేస్తే వేరే ఇంటి కోడలు అవుతుంది కదా అని కవర్ చేస్తుంది పారు. ఇక వెళ్దాం పదా గ్రానీ అంటుంది జ్యోత్స్న. నాకు ఏమైందోనని మీరు కంగారు పడ్డారా అని ఎమోషనల్ అవుతుంది సుమిత్ర. అంత ఈజీగా నిన్ను ఎక్కడికి పోనిస్తాను అంటాడు దశరథ.

46
శ్రీధర్ ఇంటికి కార్తీక్, దీప

మరోవైపు కాంచన కోసం ఎదురుచూస్తుంటాడు శ్రీధర్. అక్క వస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటుంది కావేరి. వస్తే బాగుండని అనుకుంటున్నాను అంటాడు శ్రీధర్. ఇంతలో కార్తీక్, దీప వస్తారు. వారికి కావేరి, శ్రీధర్ వెల్ కమ్ చెప్తారు. అమ్మ రాలేదా అని అడుగుతాడు శ్రీధర్. ముందు లోపలికి రండి అని తీసుకెళ్తుంది కావేరి. 

అక్క రాదని తెలిసే అన్ని ఏర్పాట్లు చేశారు కదా.. అడిగి మరీ వాళ్లను బాధపెట్టడం ఎందుకు అంటుంది కావేరి. అందరూ టిఫిన్ చేయడానికి కూర్చొంటారు. కాశీని కూడా పిలువు అంటాడు కార్తీక్. తను ఆల్రెడీ తిన్నాడని కవర్ చేస్తుంది స్వప్న. దీపకు ప్రేమగా వడ్డిస్తుంది కావేరి.

56
త్వరగా వెళ్లిపోండి

అంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కార్తీక్ కి కాంచన ఫోన్ చేస్తుంది. అక్కడికి వెళ్లారా అని అడుగుతుంది. త్వరగా టిఫిన్ చేసి తాత ఇంటికి వెళ్లిపోండి అని చెప్తుంది. సరే అమ్మ అంటాడు కార్తీక్. నేను మాట్లాడుతాను ఇవ్వు అని ఫోన్ తీసుకొని బయటకు వెళ్తాడు శ్రీధర్.

66
నువ్వు ఉంటేనే నాకు సంతోషం

కార్తీక్ వాళ్లతో నువ్వు కూడా రావచ్చు కదా కాంచన అంటాడు శ్రీధర్. మీరు పిలిచిన వాళ్లు వచ్చారు కదా అంటుంది కాంచన. అందరిలో నువ్వు ఉంటే నాకు సంతోషం అంటాడు శ్రీధర్. నేను ఎప్పుడూ ఒంటరినే అంటుంది కాంచన. అన్ని మాటలు నువ్వే మాట్లాడుతావు కాంచన. కానీ అందరిలో కలవవు అంటాడు శ్రీధర్.

కొడుకు, కోడలి కోసం కావేరి నాలుగైదు రకాల టిఫిన్లు చేసింది. అందరూ హ్యాపీగా తింటున్నారు. నువ్వు మాత్రమే లేవు. నేను సంతోషంగా ఉండాలన్నా, తినాలన్నా నువ్వు కూడా ఉండాలి అంటాడు శ్రీధర్. ఇంతలో ఒక వ్యక్తి టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి కాంచనకు ఇస్తాడు. శ్రీధర్ గారు పంపించారని చెప్తాడు. నువ్వు ఎలాగు రావని తెలిసే క్యారెజ్ కట్టి పంపించాను అని శ్రీధర్ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories