Gunde Ninda Gudi Gantalu: గుణ కుట్రకు శివ బలి అయ్యాడు. పరీక్షలు కూడా రాయనివ్వరు. అయితే, గుణ పని పట్టడానికి బాలు తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం...
శ్రుతి కోసం పార్శిల్ వస్తుంది. అది ప్రభావతి తీసుకొని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో హెడ్ సెట్ వస్తుంది. మీనా ఓపెన్ చేయవద్దని, శ్రుతి ఫీల్ అవుతుందని చెప్పినా కూడా ప్రభావతి వినదు. ఓపెన్ చేసి చెవులకు పెట్టుకుంటుంది. అప్పుడే.. శ్రుతి వస్తుంది. తనకు వచ్చిన పార్శిల్ ఓపెన్ చేసినందుకు శ్రుతికి చాలా కోపం వస్తుంది. అత్తగారు అని కూడా చూడకుండా చెడామడా తిట్టేస్తుంది. రవి శ్రుతికి సర్దిచెప్పినా కూడా వినదు. తన వస్తువులు ఎవరైనా పట్టుకుంటే నచ్చదు అని కోపంగా చెప్పేసి వెళ్లిపోతుంది.
శ్రుతి కి కోపం వచ్చినా..దానికి కారణం మీనా అంటూ.. ప్రభావతి మీనాని తిడుతుంది. తర్వాత.. రవిని పక్కకు పిలిచి.. నీ భార్యకు బుద్ధి చెప్పమని అంటుంది. ఇప్పటికే.. మీనా.. ఆ బాలు గాడిని కొంగుకు ముడి వేసుకుంది.. ఇప్పుడు నీ పెళ్లాం కూడా అలానే చేస్తుంది. అని అంటుంది. ఆ మాటలు దూరం నుంచి మీనా వింటుంది. ప్రభావతి వెళ్లగానే.. రవి.. మీనా దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెబుతాడు. మా వాళ్ల నువ్వు మాటలు పడాల్సి వచ్చింది వదిన.. అమ్మ మాటలు పట్టించుకోకు అని చెబుతాడు. తనకు.. అది అలవాటు అయిపోయిందని.. శ్రుతిని మాత్రం బాధ పెట్టొద్దు అని మీనా చెబుతుంది.
23
శివ కోసం కాలేజీకి బాలు, మీనా
సీన్ కట్ చేస్తే.. గుణ దొరకడం లేదని.. కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్ తో మాట్లాడదాం రమ్మని.. మీనాకి బాలు ఫోన్ చేస్తాడు. ఇద్దరూ కలిసి కాలేజీకి వెళతారు. తనకు చదువు లేకపోవడం వల్ల చాలా సార్లు అవమాన పడ్డాను అని మీనా బాధపడుతుంది.తర్వాత ఇద్దరూ కలిసి ప్రిన్సిపల్ సర్ ని కలవడానికి వెళతారు. అపాయింట్‌మెంట్ లేకుండా.. లోపలికి అనుమతించరు అని ప్యూన్ చెబుతాడు. అయితే.. శివ విషయం మొత్తం మీనా చెబుతుంది. అయినా.. ప్రిన్సిపల్ అనుమతించరు. దీంతో ఇద్దరూ ఏం చేయాలా అని ఆలోచనలో పడిపోతారు. ప్యూన్ ని కాకపట్టి.. ప్రిన్సిపల్ గురించి మొత్తం తెలుసుకుంటారు. తర్వాత.. ప్రిన్సిపల్ ఇంటి అడ్రస్ కూడా తెలుసుకుంటారు.
33
బాలుని అరెస్టు చేసిన పోలీసులు..
ఇక.. శివను పరీక్ష రాయించడానికి బాలు ఓ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మందు సీసా పట్టుకొని ఇంటికి వస్తాడు. దానితో.. ప్రిన్సిపల్ ముందు నాటకం ఆడాలని.. మీనాతో చెబుతాడు. ప్లాన్ కి తగినట్లే.. ప్రిన్సిపల్ ఇంటి ముందు దుకాణం పెడతాడు. ప్రిన్సిపల్ ఇంటి ముందు.. మీనాని కొడుతున్నట్లు నాటకం ఆడతాడు. అదంతా ప్రిన్సిపల్ చూస్తూనే ఉంటాడు. వీరిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. వీరి ప్లాన్ లో భాగంగా శివ తప్పు చేయలేదని అర్థమయ్యేలా బాలు చేస్తాడు. ఆ మాటలు విని.. ప్రిన్సిపల్ పశ్చాత్తాపపడతాడు. సరిగ్గా అదే సమయానికి శివ అక్కడికి వస్తాడు. శివ ముందే.. ఆ మందు బాటిల్ బాలు పెట్టాడు అని చెబుతారు. ఇక.. మీనా నాటకానికి ప్రిన్సిపల్ కరిగిపోతాడు. బాలుని తిట్టేసి.. శివను పరీక్ష రాయడానికి ఒప్పుకుంటాడు. శివ సంతోషిస్తాడు. కానీ, అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి.. బాలుని అరెస్టు చేయడానికి చూస్తారు. మీనా నిజం చెప్పాలని చూస్తే.. బాలు ఆపుతాడు. కానీ.. పోలీసులు మాత్రం.. డొమెస్టిక్ కేసు పెట్టి... ఏడేళ్ల జైలు శిక్ష వేస్తాం అంటారు. మీనా చెప్పేది వినకుండా.. బాలుని అరెస్టు చేస్తారు. బాలు అరెస్టు అయి వెళ్లిపోయిన తర్వాత.. శివకి జరిగిన నిజం మొత్తం మీనా వివరిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.