ఎన్టీఆర్ ను భయపెట్టిన పాత్ర ఏంటో తెలుసా? తారక్ కు ఇష్టమైన సినిమా ఎందుకు చేయడంలేదు?

Published : Mar 06, 2026, 08:41 AM IST

ఇప్పుడున్న జనరేషన్ హీరోలలో పాత్ర కోసంప్రాణం పెట్టి పనిచేసే హీరోల లిస్ట్ లో మొదట గుర్తొచ్చేది ఎన్టీఆర్ పేరు. ఎలాంటి క్యారెక్టర్ అయినా.. అలవోకగా చేయగలిగే తారక్ ను భయపెట్టిన ఏకైక రోల్ ఏదో తెలుసా? అదే తారక్ డ్రీమ్ రోల్ అవుతుందా? 

PREV
14
నటనలో ఎన్టీఆర్ స్థాయి వేరు..

ఫిల్మ్ ఇండస్ట్రీ లో చాలా మంది నటీనటులు ఉన్నారు. కానీ పాత్ర కోసం ప్రాణం పెట్టి పనిచేసేవారు కొందరే ఉన్నారు. వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరు ఉన్నారు. ఎంత పెద్ద నటుడికి అయినా.. అన్ని పాత్రలు చాలా ఈజీగా అయిపోవు.. దానికోసం చాలా కష్టపడతారు.. ఎంతో శ్రమపడతారు. 

కొన్ని పాత్రల కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా రిస్క్ చేస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే తన కెరీర్ లో ఇటువంటి సాహసాలు ఎన్నో చేశారు. ఏ క్యారెక్టర్ అయినా.. అలవోకగా చేసేశారు. కానీ యంగ్ టైగర్ చేయడానికి భయపడే పాత్ర ఏంటో తెలుసా?

24
పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిన హీరో..

టాలీవుడ్​ నుంచి హాలీవుడ్ ​ ఇండస్ట్రీ రేంజ్ లో.. ఎదిగిన హీరో ఎన్టీఆర్.. ఈ మధ్య కాలం వరకూ.. టాలీవుడ్ కే పరిమితం అయిన తారక్.. ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ రేంజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం ఆయన భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్నారు. 

ఆ సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని గ్లోబర్​ స్టార్​గా పేరు తెచ్చకున్నాడు ఎన్టీఆర్. ఆయన ఎన్ని సినిమాలు చేసినా.. తనకు సంతృప్తి నిచ్చే పాత్ర మాత్రం ఇంకా చేయాల్సి ఉందట. ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నరు. కానీ తెలియని భయం తారక్ ను వెంటాడుతుందట.

34
జూనియర్ ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటి?

టాలీవుడ్​ నుంచి హాలీవుడ్ ​ ఇండస్ట్రీ రేంజ్ లో.. ఎదిగి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని గ్లోబర్​ స్టార్​ ఎన్టీఆర్. ఆయన ఎన్ని సినిమాలు చేసినా.. తనకు సంతృప్తి నిచ్చే పాత్ర మాత్రం ఇంకా చేయాల్సి ఉందట. ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నరు. కానీ అలాంటి రోల్ చేసే అవకాశం ఇంత వరకూ రాలేదు. అంతే కాదు తనకు ఇష్టమైన ఆ డ్రీమ్ రోల్ చేయడానికి భయపడుతున్నాడట కూడా.

44
తాతకు చెడ్డపేరు రాకూడదని..

తారక్ అలా వెనకడుగు వేయడానికి కూడా ఓ కారణం ఉంది. టాలీవుడ్​లో శ్రీ కృష్టుడు, రాముడు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్​. అలానే జూనియర్ ఎన్టీఆర్​ కూడా వాళ్ల తాత మాదిరిగా కృష్ణుడి పాత్రలో ఒక్కసారైనా నటించాలని ఆశపడ్డారట. 

కాని అలాంటి పాత్ర.. ఆయన మనవడిగా తాను చేస్తున్నాను అంటే ఎక్స్ పెక్టేషన్స్ భారీలలెవల్లో ఉంటాయి. అవి నేను ఆ పాత్ర సరిగ్గా చేయకపోతే.. పరిస్థితి వేరేలా ఉంటుంది. తాత పేరు కూడా చెడగొట్టినట్టు అవుతుంది అని తారక్ భావిస్తున్నారట. 

అందుకే తనకు అదే డ్రీమ్ రోల్ గా ఉన్నా..ఇంత వరకూ ట్రై చేయలేదు అంటున్నాడు తారక్ కానీ, ఇంత వ‌ర‌కు అటువంటి పాత్ర‌లో న‌టించే అవ‌కాశం యంగ్ టైగర్​కు రాలేదట. వస్తే మటుకు టైమ్ తీసుకుని అయినా.. పర్ఫెక్ట్ గా చేయాలని చూస్తున్నాడట ఎన్టీఆర్. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కానీ.. బయట వైరల్ అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories