Karthika Deepam 2 Today Episode:జ్యోకు స్ట్రాంగ్ కౌంటర్-కాంచన ఏడుపు-దీపను జీవితంలో క్షమించనన్న కాంచన

Published : Mar 06, 2026, 08:17 AM IST

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 6వ తేదీ)లో ప్రెగ్నెంట్స్ బోన్ మ్యారో డొనేట్ చేయచ్చా అని డాక్టర్ ని అడిగిన జ్యో. కౌంటర్ ఇచ్చిన డాక్టర్. దీపను నానామాటలు అన్న కాంచన. దీపకు అండగా నిలబడ్డ దశరథ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

PREV
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో డాక్టర్ హారిక దగ్గరికి వెళ్తుంది జ్యోత్స్న. ఎందుకు వచ్చారు అని అడుగుతుంది డాక్టర్. బోన్ మ్యారో ట్రాన్స్ ఫ్లాంటేషన్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా.. మీరు ఎందుకు ఇంకా ప్రొసిజర్ స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు చేస్తారు అని అడగడానికి వచ్చాను అంటుంది జ్యోత్స్న. మీరు మీ అమ్మను కాపాడగలరని కాన్పిడెంట్ గా ఉన్నారా అంటుంది డాక్టర్. నేనే కదా కన్నకూతురిని అంటుంది జ్యోత్స్న. అవును మీరే కన్నకూతురు. మీకు ఆ నమ్మకం ఉంటే చాలు అంటుంది డాక్టర్.

కొందరు తెలివైన వాళ్లు ఏమనుకుంటారో తెలుసా డాక్టర్.. మనం ఏం చెప్పినా ఎదుటి వాళ్లు నమ్ముతారని అనుకుంటారు కానీ.. నమ్మరు వింటారు అంతే అంటుంది జ్యోత్స్న. నువ్వు కరెక్ట్ జ్యోత్స్న. మనం పర్ఫెక్ట్ గా ఫేక్ ని క్రియేట్ చేసినా అది ఒరిజనల్ కాదు. ఒరిజనల్ ఎప్పుడు ఒరిజనలే అంటుంది డాక్టర్. కొంతమందికి అది ఫేక్ అని తెలిసిన కూడా నమ్మినట్లు ఉంటున్నారంటే వాళ్లు కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నట్లు అంటుంది డాక్టర్. 

ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది నా రిపోర్ట్స్ మ్యాచ్ కావడం వెనుక ఏదో పెద్ద డ్రామానే జరుగుతోంది అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కన్న కూతురే కాకుండా బ్యోన్ మ్యారో ఎవరైనా డొనేట్ చేయచ్చా అని అడుగుతుంది జ్యోత్స్న. బ్లెడ్ రిలేషన్ చేయచ్చు అని చెప్తుంది డాక్టర్. డోనర్ కి ఏదైనా వ్యాధి ఉంటే ఓకేనా అని అడుగుతుంది జ్యోత్స్న, నో అంటుంది డాక్టర్. ఏజ్ లిమిట్ ఉందా అంటుంది జ్యోత్స్న. లేదు అని చెప్తుంది డాక్టర్. ప్రెగ్నెంట్ లేడి డోనర్ గా ఉండొచ్చా అని అడుగుతుంది జ్యోత్స్న. కంగారు పడుతుంది డాక్టర్. ఏం చెప్పకుండా అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది.

27
కాంచన ఏడుపు

మరోవైపు తల్లి, బిడ్డల్లో ఒకరిని వదులుకోవాలంటే ఎవరిని వదులుకుంటావో చెప్పు అమ్మ అంటాడు కార్తీక్. ఎందుకు వదులుకోవాలి. నేను ఎవ్వరినీ వదులుకోను అంటుంది కాంచన. బిడ్డ వల్ల తల్లికి ఓ సమస్య ఉంది. తల్లి బిడ్డలకు ఇద్దరికీ సమస్య ఉంది. ఎవరో ఒకరినే కాపాడే పరిస్థితి. ఇద్దరిలో ఎవరో ఒకరే క్షేమంగా ఉంటారు అని చెప్తాడు కార్తీక్. ఏంట్రా నువ్వు మాట్లాడేది. ఏం జరిగింది. ఇది నీకు ఎప్పుడు తెలుసు. అయినా దీని అంతటికీ కారణం నువ్వే దీప. నేను వద్దన్నా కూడా నా పుట్టింటికి పనికి వెళ్లావు. నా కొడుకుకు పిల్లలు పుడుతున్నారనే ఆనందాన్ని నాకు లేకుండా చేశావు అని దీపను నానామాటలు అంటుంది కాంచన.

కాంచనను ఓదార్చుతాడు శివన్నారాయణ. నువ్వు బాధపడకు బిడ్డను కాపాడడానికి ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను. దశరథ డాక్టర్ తో మాట్లాడు అని చెప్తాడు శివన్నారాయణ. నేను హాస్పిటల్ కి వస్తాను అంటుంది కాంచన. నీది ఏం రాత దీప. అన్నీ దగ్గరకు వచ్చినట్లే వచ్చి దూరం అవుతాయి. ఇన్ని రోజులు నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియాలని కోరుకున్నాను. కానీ, ఇప్పుడు కోరుకోను. వాళ్లు నీ దగ్గరికి వచ్చినా ఉండరు. దేవుడు ఏదో ఒక రూపంలో తీసుకెళ్లిపోతాడు. నీ జాతకమే అంతా అంటుంది అనసూయ. ఇదంతా అది చేతులార చేసుకుందే అక్క అంటుంది కాంచన.

37
దీపకు అండగా తండ్రి

దశరథ వాళ్ల మాటలకు అడ్డుపడతాడు. అందరూ దీపను అనే వాళ్లే కానీ తనని అర్థం చేసుకోరా.. ఏ తల్లి అయినా తన బిడ్డని కావాలని దూరం చేసుకుంటుందా.. నువ్వు తల్లివే కదా బిడ్డ పోతే పోని అనుకుంటావా అని కాంచనను అడుగుతాడు దశరథ.

47
నువ్వు ప్రెగ్నెంట్ వా..

మరోవైపు డాక్టర్ వెనకాలే వెళ్తుంది జ్యోత్స్న. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు డాక్టర్ అంటుంది. మీరు ప్రెగ్నెంటా అని జ్యోత్స్నను అడుగుతుంది డాక్టర్. నాకు ఇంకా పెళ్లి కాలేదు అంటుంది జ్యోత్స్న. మరి నీకు ఎందుకు ఆ డౌట్ వచ్చింది, పిచ్చి ప్రశ్నలు అడిగి నా టైం వేస్ట్ చేయకండి అంటుంది డాక్టర్. సమాధానం త్వరగా చెప్తే టైం వేస్ట్ కాదు కదా డాక్టర్ అని అంటుంది జ్యోత్స్న. ఒక్క నిమిషం ఆగు అని.. మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వ్యక్తికి కాల్ చేస్తాను అంటుంది డాక్టర్. ఎవరికి అని అడుగుతుంది జ్యోత్స్న. దశరథ గారెకి. మీరు ఎప్పుడు హాస్పిటల్‌కు వచ్చి.. ఏం అడిగినా కాల్ చేయమని చెప్పారు అంటుంది డాక్టర్. వద్దు డాక్టర్ అని చెప్పి వెళ్లిపోతుంది జ్యోత్స్న.

57
మా అమ్మ చనిపోయినట్లే..

పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బిడ్డ లేదంటే మరోసారి మా అమ్మ చనిపోయినట్లే బాధపడతాను అని ఏడుస్తుంది కాంచన. తెలిసి తెలియని వయసులో మా అమ్మ చనిపోయింది. అప్పుడు ఆ బాధ ఎలాగో తట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఈ బాధ తట్టుకోలేను అని బోరున ఏడుస్తుంది కాంచన. భార్యను ఓదార్చుతాడు శ్రీధర్.

67
దశరథ చేతిలో దీప చేయి..

దీపను ఈ రోజే హాస్పిటల్‌లో జాయిన్ చేయాలి అమ్మా అని చెప్తాడు కార్తీక్. మీకు నచ్చింది చేయండి. కానీ బిడ్డకు ఇలా అవడానికి కారణమైన దీపను నేను ఎప్పటికీ క్షమించను అంటుంది కాంచన. అత్త కాళ్ల దగ్గర కూర్చొని నన్ను ఆశీర్వదించు అత్తయ్య అని ఏడుస్తూ అడుగుతుంది దీప. బిడ్డ జాగ్రత్తా.. నువ్వు కూడా జాగ్రత్త అని చెప్తుంది కాంచన. తర్వాత దశరథ చేతిలో దీప చేయి పెట్టి, నా మనుమరాలి బాధ్యత నీదే అన్నయ్య. ఎలాగైనా కాపాడు అని చెప్తుంది కాంచన. అంతా ఎమోషనల్ అవుతారు. దీప, కార్తీక్, దశరథ హాస్పిటల్‌కు బయల్దేరుతారు. నలుగురు వెళ్తున్నారు. ఎంతమంది తిరిగి వస్తారో అని ఏడుస్తుంది కాంచన.

77
వాళ్లకు నిజం తెలియదు కాబట్టే..

కారు దగ్గరికి వెళ్లి చెల్లి మాటలను గుర్తుచేసుకుంటూ బాధపడతాడు దశరథ. మామయ్యకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. నేను దీప మెడలో తాళి కట్టినప్పుడు నువ్వు నాపై కోపం తెచ్చుకున్నావు కదా మామయ్య అని అడుగుతాడు కార్తీక్. అవును అంటాడు దశరథ. కానీ దీప నీ కూతురే అని తెలిశాక నీకు న్యాయమే జరిగింది అనిపించింది కదా.. ఇప్పుడు కూడా అంతే.. 

వాళ్లకు నిజం తెలియదు కాబట్టి అలా బాధపడుతున్నారు. దీపే మీ కూతురు అని తెలిసిన రోజు ఇది దేవుడి రాతే అని సరిపెట్టుకుంటారు. రేపు ఎప్పుడో జనాభా లెక్కల వాడు వచ్చి మా అమ్మను అడిగితే నా కొడుక్కి ఒక్కతే కూతురు, పేరు శౌర్య అని చెప్తుంది అంటాడు కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories