థియేటర్లో డిజాస్టర్, ఓటీటీలో దుమ్ములేపుతున్న ఎన్టీఆర్‌ సినిమా.. టాప్‌ 5 ఓటీటీ మూవీస్‌ ఇవే

Published : Oct 23, 2025, 12:21 PM IST

Top 5 OTT Movies: ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంటోంది. థియేటర్లలో ఆడని మూవీస్‌ కూడా ఓటీటీలో దుమ్ములేపుతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలో టాప్‌ 5 మూవీస్‌ ఏంటో చూద్దాం. 

PREV
15
టాప్‌ 5 ఓటీటీ మూవీస్‌

ఇప్పుడు ఆడియెన్స్ సినిమాలను థియేటర్లో కంటే ఓటీటీలోనే ఎక్కువగా చూస్తున్నారు. సినిమాలు థియేటర్లో విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలోకి వస్తున్న నేపథ్యంలో ఆడియెన్స్ థియేటర్‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. పెద్ద సినిమాలకు మాత్రమే థియేటర్‌కి వెళ్తున్నారు. కొన్ని మిడిల్‌ రేంజ్‌ మూవీస్‌ నుంచి, చిన్న సినిమాలను ఓటీటీల్లోనే చూసేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో ఓటీటీ చిత్రాలకు డిమాండ్‌ పెరిగింది. అయితే కొన్ని సినిమాలు థియేటర్లో ఆడటం లేదు, కానీ ఓటీటీలో మాత్రం బాగా చూస్తున్నారు. అక్కడ బ్లాక్‌ బస్టర్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టాప్‌ 5 ఓటీటీ మూవీస్ ఏంటో తెలుసుకుందాం.

25
ఓటీటీలో నెంబర్ 1గా `వార్‌ 2`

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన లిస్ట్ ప్రకారం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న చిత్రాల్లో ఎన్టీఆర్‌ మూవీ ఉంది. తారక్‌ చివరగా `వార్‌ 2` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో రూపొందింది. తెలుగులోనూ రిలీజ్‌ చేశారు. ఆగస్ట్ 14న విడుదలైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఈ చిత్రం నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది 5.3 మిలియన్‌ వ్యూస్‌తో నెంబర్ 1లో ఉండటం విశేషం. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. తెలుగులో ఈ మూవీని నాగవంశీ విడుదల చేశారు. ఆయన చాలా దారుణంగా నష్టపోయారు.

35
ఓటీటీలో నెంబర్‌ 2గా రజనీకాంత్‌ `కూలీ`

ఇక ఓటీటీలో టాప్‌ 2లో ఉన్న మూవీ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటించిన `కూలీ`. ఇందులో అక్కినేని నాగార్జున నెగటివ్‌ రోల్‌ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ టైమ్‌ ఆయన విలన్‌గా కనిపించారు. ఆయనతోపాటు అమీర్‌ ఖాన్‌ గెస్ట్ గా మెరిశారు. అలాగే ఊపేంద్ర కీలక పాత్రలో కనిపించారు. సత్య రాజ్‌, సౌబిన్‌ షాహిర్‌, శృతి హాసన్‌ నటించిన ఈ చిత్రానికి లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా ఆగస్ట్ 14నే విడుదలైన విషయం తెలిసిందే. ఇది థియేటర్లలో రూ.500కోట్లకుపైగా వసూలు చేసింది. కానీ ఫ్లాప్‌ జాబితాలోనే చేరిపోయింది. ఇప్పుడు ఓటీటీలో చాలా రోజులుగా ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ మూవీ 2.2 మిలియన్స్ కి పైగా వ్యూస్‌ సాధించి దూసుకుపోతుంది. 

45
టాప్‌ 3లో తేజ సజ్జా `మిరాయ్‌`

ఆ తర్వాత మూడో స్థానంలో తెలుగు మూవీ `మిరాయ్` ఉంది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్‌ ఘట్టమనేని దర్శకుడు. ఇందులో మంచు మనోజ్‌ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. శ్రియా, జగపతిబాబు, జయరాం కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ మూవీ థియేటర్లలో పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. రెండు మిలియన్‌ వ్యూస్‌తో టాప్‌ 3లో ఉంది. ఇది జీయో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

55
టాప్‌ 4, టాప్‌ 5 చిత్రాలివే

నాల్గో స్థానంలో హాలీవుడ్‌ మూవీ ఉంది. `ఫైనల్‌ డెస్టినేషన్‌ః బ్లడ్‌లైన్స్` ట్రెండ్‌ అవుతుంది. ఇది 1.4 మిలియన్స్ వ్యూస్‌ సాధించింది. ఇది కూడా జీయో హాట్‌ స్టార్‌లో ట్రెండ్‌ అవుతుంది. దీంతోపాటు ఐదో స్థానంలో 1.1 మిలియన్‌ వ్యూస్‌తో `మహావతార్‌ నరసింహ` ట్రెండ్‌ అవుతుంది. ఇది నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇలా ఓటీటీలో ఈ ఐదు సినిమాలు టాప్‌ వ్యూస్‌తో రన్‌ అవుతుండటం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories