కాలేజీ రోజుల్లో తన వన్ సైడ్ లవ్ గురించి వెల్లడించాడు యంగ్ హీరో శివకార్తికేయన్. రీసెంట్ గా జరిగిన ఓ కార్యక్రమంలో తన మనసులో మాటలను ఓపెన్‌గా మాట్లాడారు అమరన్ హీరో.
మిమిక్రీ ఆర్టిస్ట్ గా, విజయ్ టీవీ లో హోస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా మారాడు శివకార్తికేయన్. చాలామంది హీరోల మాదిరిాగా వన్ సైడ్ లవ్ ఫీల్ ను అనుభవించారట యంగ్ హీరో. తాము ప్రేమించిన అమ్మాయి నో చెపుతుందేమో, గొడవ పడతుందేమో, అాన్న భయంతో చాలామంది తమ ప్రేమను వెల్లడించకుండా ఉండిపోతారు. భవిష్యత్తులో సమస్యలు వస్తాయేమోనన్న భయంతో చాలామంది ప్రేమను చెప్పడానికి వెనుకాడతారు. ఇదే భయాన్ని శివకార్తికేయన్ కాలేజీలో అనుభవించారు.
25
రహస్యం వెల్లడించిన శివకార్తికేయన్
ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు శివకార్తికేయన్ కు ఓ ప్రశ్న ఎదురయ్యింది. ఓ అమ్మాయి శివకార్తికేయను ను ప్రశ్నిస్తూ.. ‘’ సార్, ఎవరికీ తెలియని రహస్యం చెప్పాలి. కాలేజీ రోజుల గురించి చెప్పండి'' అని ఓ అమ్మాయి అడిగింది. అప్పుడు ఆయన తన వన్ సైడ్ లవ్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా చెప్పారు. తొలిచూపులోనే కలిగిన ప్రేమ ఎంత త్వరగా ముగిసిందనే విషయాన్ని ఆయన వెల్లడించారు.
35
శివకార్తికేయన్ వన్ సైడ్ లవ్
'నాకు ఒక వన్ సైడ్ లవ్ ఉండేది. కానీ అది కొన్ని రోజుల్లోనే ముగిసింది. ఎందుకంటే, ఆమె వెంటనే మరో అబ్బాయితో కమిట్ అయింది. నా జీవితంలో ఎవరికీ చెప్పని రహస్యం ఇదే కావచ్చు. మా కాలేజీ స్నేహితులు కొందరికి మాత్రమే ఈ విషయం తెలుసు' అని శివకార్తికేయన్ చెప్పారు.
'మీ అబ్బాయి ఇలా చేశాడు' అని ఇంట్లో చెబితే సమస్య అవుతుందని భయపడి ఆమెకు నా ప్రేమ గురించి చెప్పలేదు. నేను అల్లరి చేసేవాడిని కాదు. టీవీ హోస్ట్‌గా ఉన్నప్పుడు, ఓ మాల్‌లో ఆ అమ్మాయిని దూరం నుంచి చూశాను. కానీ మాట్లాడలేదు' అని ఆయన అన్నారు.
55
మేనమామ కూతురితో హీరో పెళ్లి
‘’ఆమె వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందని తెలిసింది. నేను చూసినప్పుడు ఆమె ప్రేమించిన అబ్బాయి కూడా కనిపించలేదు.. చిత్రం ఏంటంటే.. ఆమె తాను ప్రేమించి అబ్బాయిని కూడా పెళ్ళి చేసుకోలేదు. ఆమె అతనికి కూడా దక్కలేదని సంతోషించాను'' అని శివకార్తికేయన్ చెప్పారు. మొదటి ప్రేమ విఫలమవడంతో, తన మేనమామ కూతురు ఆర్తిని పెళ్లి చేసుకున్నారు శివకార్తికేయన్. వీరికి ముగ్గురు పిల్లలు.