Biggboss 9 Telugu: దొంగల బెండు తీసేందుకు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఆ ఇద్దరు మాజీ కంటెస్టెంట్లు, ఇక రచ్చ రచ్చే

Published : Oct 23, 2025, 11:56 AM IST

బిగ్ బాస్ హౌస్ (Biggboss 9 Telugu) లో ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్‌ల ఆట సాగుతోంది. ఇప్పుడు ఈ దొంగల ఆటను మరింత రసవత్తరంగా మార్చేందుకు మాజీ కంటెస్టెంట్లు రాబోతున్నారు. వారెవరో కాదు... అమర్ దీప్, అర్జున అంబటి. వీరొస్తే ఇక ఎపిసోడ్ రచ్చ రచ్చే. 

PREV
14
బిగ్ బాస్ 9 తెలుగు

బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు వాంటెడ్ పేట పేరుతో దొంగల ఆట నడుస్తోంది. హౌస్ లో ఉన్నవారు రెండు టీములుగా విడిపోయారు. అందులో కొంతమంది మాస్ మాధురి టీంలో ఉంటే.. మరి కొందరు సంజన సైలెన్సర్ టీం లో ఉన్నారు. వీరు తమ దొంగల గ్యాంగ్ తో కలిపి హౌస్ లో అరాచకం సృష్టిస్తున్నారు. మధ్యలో సంజన టీం డబ్బును తనూజ, సుమన్ శెట్టి కలిపి కొట్టేశారు. దీతతో సంజన టీమ్ ఎంతో చాలా ఫీలైపోయింది.

24
మేము ఆడం

తమ డబ్బు పోవడంతో సంజన టీం ఇక ఆడమని చెప్పి కూర్చుండిపోయారు. అలా డబ్బు కొట్టేయడం మాధురికి కూడా నచ్చలేదు. కొట్టేసిన డబ్బును తనూజ, సుమన్, దివ్య కలిపి పంచుకున్నారు. తనూజ.. మాధురి ఎంత అడిగినా కూడా తను డబ్బు కొట్టేసిన సంగతి ఒప్పుకోలేదు. ఇదే విషయంపై తనూజకు, రీతూకు మధ్య గొడవ అయింది. సంజనా, దివ్య కూడా ఇదే విషయంపై వాదించుకున్నారు.

34
పోలీసులు వచ్చేస్తున్నారు

ఇలా దొంగల గేమ్ ఆసక్తికరంగా సాగుతున్నప్పుడు ఇంట్రెస్టింగ్ లీక్ ఒకటి వచ్చింది. ఈ దొంగల ఆట కట్టించేందుకు ఇద్దరు పోలీసులు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వారు ఇంకెవరో కాదు.. బిగ్ బాస్ సీజన్ 7లో అల్లాడించిన అమర్ దీప్, అర్జున్ అంబటి. వీళ్లిద్దరికీ అభిమానులు కూడా ఎక్కువే. కాబట్టి ఈ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఈ బిగ్ బాస్ లీక్ ఎవరు ఇచ్చారా అని ఆలోచిస్తున్నారా? అది కూడా ఇచ్చింది మరొక బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నుంచే.

44
టేస్టీ తేజ చెప్పేశాడుగా

టేస్టీ తేజ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ బిగ్ బాస్ లీక్ ను అందించాడు. దొంగల ఆట కట్టించేందుకు ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నారని... కచ్చితంగా ఈ ఎపిసోడ్ ను మీరు చూడాలని చెప్పాడు. అంతేకాదు ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరో చెప్పేందుకు ‘అమరేంద్ర బాహుబలి’ అని హింట్ కూడా ఇచ్చాడు. అప్పటికే నెటిజన్లకు అమర్ దీప్, అర్జున్ అంబటి పేర్లు గుర్తొచ్చేసాయి. అమర్ దీప్, అర్జున్ అంబటికి ఉన్న అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ కోసం ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకి వీరిద్దరి రాక గురించి తెలియదు. కాబట్టి వారు కచ్చితంగా షాక్ తింటారు.

Read more Photos on
click me!

Recommended Stories