3. తుంబాద్
ఒక పాత గ్రామం. ఎప్పుడూ కురుస్తూ ఉండే వర్షం. తరతరాలుగా దాచిపెట్టిన ఒక రహస్యం. ఈ సినిమా కథ మొత్తం హస్తర్ అనే ఒక పౌరాణిక జీవికి సంబంధించిన నిధి చుట్టూ తిరుగుతుంది. ఆ నిధి గురించి తెలుసుకున్న వినాయక్, దాన్ని దక్కించుకోవడానికి ప్రమాదకరమైన ప్రదేశంలోకి మళ్లీ మళ్లీ వెళ్తాడు. కానీ అతని దురాశ పెరిగేకొద్దీ, ఆ నిధి వెనకున్న భయంకర శక్తి కూడా అతనికి దగ్గరవుతుంది. పురాణం, దురాశ, అతీత శక్తులు, హారర్ కలగలిపిన ఈ మరాఠి సినిమా ఒక కొత్త అనుభూతినిస్తుంది. ఇది తెలుగు డబ్బింగ్‌లో కూడా అందుబాటులో ఉంది.