Samantha Baby Bump: సమంత ఇటీవల `మా ఇంటి బంగారం` మూవీతో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు గర్భంతో ఉన్న ఆమె బేబీ బంప్ ఫోటోలతో అలరిస్తోంది. లేటెస్ట్ లుక్స్ వైరల్ అవుతున్నాయి.
సమంత ఇటీవల `మా ఇంటి బంగారం` మూవీతో విజయాన్ని అందుకున్నారు. ఆమె కమ్ బ్యాక్ ఇస్తూ నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపింది. సుమారు వంద కోట్ల కలెక్షన్లు సాధించింది. మూడేళ్ల గ్యాప్‌తో వచ్చిన ఆమెకిది అదిరిపోయే కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు. దీంతో మళ్లీ వరుసగా సినిమాలు చేస్తుందని, ఆమెని తెరపై చూడొచ్చని అభిమానులు ఎంతో ఆశపడ్డారు. కానీ తన ప్రెగ్నెన్సీని ప్రకటించి వారి ఆశలపై నీళ్లు చల్లింది. కాకపోతే ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూ అలరిస్తోంది. బేబీ బంప్ ఫోటోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది సామ్.
25
లేటెస్ట్ బేబీ బంప్ ఫోటోలు
అందులో భాగంగా తాజాగా ఆమె నయా బేబీ ఫోటోలను షేర్ చేసింది. బేబీ బంప్‌తో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను పంచుకుంది. అలాగే ఇంట్లో సరదా టైమ్‌లో ఆమె బేబీ బంప్ సెల్ఫీ ఫోటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడివి వైరల్ అవుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి. ఈ సందర్భంగా చాలా మంది అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఆమెకి విషెస్ చెబుతున్నారు. అయితే కొందరు మరో అడుగు ముందుకేసి రాబోయే బేబీకి పేర్లు సజెస్ట్ చేస్తున్నారు.
35
సమంత బిడ్డకి పేర్లు పెట్టిన అభిమాని
సమంతకి పుట్టబోయే బిడ్డకి అదిరిపోయే పేర్లు సజెస్ట్ చేశారు ఒక అభిమాని. అమ్మాయి పుడితే `సమైరా` అని, కొడుకు పుడితే `సామ్‌రాజ్` పెట్టుకోవాలని తెలిపారు. ఇన్ స్టాగ్రామ్‌లో ఆమెకి పోస్ట్ లు పెట్టారు. దీనికి సమంత రియాక్ట్ అయ్యింది. సామ్‌రాజ్.. పేరు విషయంలో మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం, అది మా పని, మీరు తలబద్దలు కొట్టుకోకండి` అని చెబుతూ రిప్లై ఇచ్చింది. సమంత రియాక్షన్ ఇప్పుడు రచ్చ చేస్తుంది.
బేసిక్‌గా సమంతకి పిల్లలంటే ఇష్టం. ఆమె పలు మార్లు ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ పిల్లల కోసమే ఆమె ఇన్నాళ్లు వెయిట్ చేసింది. గత మ్యారేజ్ లైఫ్‌లో కూడా ఈ విషయంలోనే గొడవలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఎట్టకేలకు సమంత ఇప్పుడు తల్లి కాబోతుంది. ప్రస్తుతం ఆమె బేబీ బంప్ ని ఎంజాయ్ చేస్తుంది. మాతృత్వానికి సంబంధించిన ముందస్తు సంతోషాన్ని పొందుతుంది. ఈ క్రమంలో ఆమె వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది.
55
హీరోయిన్‌గా తిరుగులేని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సమంత
సమంత `ఏం మాయ చేసావె` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయిన విషయం తెలిసిందే. నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రంతో తొలి విజయాన్ని అందుకుంది. ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది. ఆ తర్వాత వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ ని సొంతం చేసుకుంది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్‌గా ఎదిగింది. నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్లకే వీళ్లు విడిపోయారు. ఆ తర్వాత అనారోగ్యానికి గురయ్యింది. సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఇంకోవైపు ఆ మధ్య తన తండ్రిని కోల్పోయింది. అనేక స్ట్రగుల్స్ తర్వాత కోలుకొని `మా ఇంటి బంగారం` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ అందుకుంది.