దీంతో, 300 కోట్ల క్లబ్‌లో చేరడానికి ఈ సినిమాకు ఇంకా సుమారు 15 కోట్లు మాత్రమే కావాలి. ఈ రోజు లేదా రేపటిలోగా ఈ మూవీ 300 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తున్నారు. 'టాక్సిక్' సినిమాలో భారీ తారాగణం ఉంది. రాకింగ్ స్టార్ యశ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండగా, నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి చాలా మంది పాపులర్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషించారు. గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా, ఆగస్టు 26న కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో రిలీజైంది.