సినిమాల్లో హీరో,హీరోయిన్లు వాడిన దుస్తుల‌ను త‌ర్వాత ఏం చేస్తారో తెలుసా.?

Published : Nov 15, 2026, 06:50 PM IST

Tollywood: సినిమాల్లో నటీనటులు ధరించే కాస్ట్యూమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఫ్యాషన్ ట్రెండ్‌లుగా మారుతుంటాయి. అయితే సినిమాల కోసం లక్షలు ఖర్చు చేసి తయారు చేసే ఈ దుస్తులను షూటింగ్ పూర్తయ్యాక ఏం చేస్తారో తెలుసా?

PREV
15
నటీనటులకు నచ్చితే తమతోనే తీసుకెళ్తారు

సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన దుస్తుల్లో కొన్ని నటీనటులకు బాగా నచ్చుతాయి. వాటిని మళ్లీ ఇతర సందర్భాల్లోనూ ఉపయోగించుకోవాలనుకుంటే తమ దగ్గరే ఉంచుకుంటారు. ముఖ్యంగా ప్రత్యేకమైన డిజైన్లు, ఖరీదైన దుస్తులు, తమ వ్యక్తిగత అభిరుచికి సరిపోయే కాస్ట్యూమ్స్‌ను ఇంటికి తీసుకెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఆ దుస్తులను ఫొటోషూట్లు, ప్రత్యేక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. అయితే ప్రతి నటీనటికి ఇదే విధానం ఉంటుందని చెప్పలేం. సినిమా నిర్మాణ సంస్థ ఒప్పందాలు, కాస్ట్యూమ్ విభాగం నిబంధనలను బట్టి ఈ నిర్ణయం మారుతుంది.

25
ప్రత్యేక సందర్భాల్లో వేలం నిర్వహణ

కొన్ని సినిమాల్లో నటీనటులు ఉపయోగించిన దుస్తులకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి కాస్ట్యూమ్స్‌ను వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దూకుడు సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని దుస్తులను సినిమా తర్వాత వేలం వేసినట్లు ఆప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని సమంత స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఉపయోగించినట్లు సమాచారం. అలాగే పవన్ కల్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' సినిమాలో ఆయన ధరించిన పోలీస్ యూనిఫామ్‌ను కూడా స్వచ్ఛంద సంస్థకు నిధులు సమకూర్చే ఉద్దేశంతో వేలం వేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలా అభిమానులకు గుర్తుగా నిలిచిన కాస్ట్యూమ్స్ మంచి పనులకు ఉపయోగపడుతుంటాయి.

35
డిజైనర్లు తిరిగి తమ బొటిక్‌లకు తీసుకెళ్తారు

ప్రస్తుతం టాలీవుడ్‌లో కాస్ట్యూమ్ డిజైనింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం పెరిగింది. హీరోహీరోయిన్ల కోసం ప్రత్యేకంగా స్టైలిస్టులు, డిజైనర్లు పనిచేస్తున్నారు. సినిమా కథ, పాత్ర స్వభావం, నటీనటుల శరీరాకృతి, వారి సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దుస్తులను రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ కాస్ట్యూమ్స్‌లో కొన్నింటిని డిజైనర్లు తిరిగి తమ వద్దకు తీసుకెళ్తారు. వాటిని అవసరాన్ని బట్టి మార్పులు చేసి తమ బొటిక్‌లలో విక్రయిస్తుంటారు. కొన్ని దుస్తులను ఫ్యాషన్ షోలు, ఫొటోషూట్లు, ఇతర ప్రాజెక్టుల కోసం కూడా ఉపయోగిస్తారు.

45
ఇతర సినిమాలు, షూటింగ్‌లకు మళ్లీ వినియోగం

ప్రతి సినిమా కోసం ఉపయోగించే దుస్తులన్నింటినీ కొత్తగా తయారు చేయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా సాధారణ దుస్తులు, బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టులు ధరించే కాస్ట్యూమ్స్, ప్రత్యేకంగా గుర్తించలేని దుస్తులను కాస్ట్యూమ్ విభాగాలు భద్రపరుస్తుంటాయి. అవసరాన్ని బట్టి వాటిని మరో సినిమా లేదా టీవీ ప్రాజెక్టులో తిరిగి ఉపయోగిస్తారు. కొన్ని దుస్తులకు చిన్నపాటి మార్పులు చేసి కొత్త రూపాన్ని తీసుకొస్తారు. దీనివల్ల నిర్మాణ ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. అయితే ప్రముఖ నటీనటుల ప్రత్యేక కాస్ట్యూమ్స్ విషయంలో మాత్రం వాటి డిజైన్, ఒప్పందాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు.

55
ప్రత్యేక కాస్ట్యూమ్స్‌ను జ్ఞాపకాలుగా భద్రపరుస్తారు

కొన్ని సినిమాలు నటీనటుల కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తాయి. అలాంటి చిత్రాల్లో ధరించిన దుస్తులను సాధారణ వస్తువులుగా చూడరు. ముఖ్యంగా చారిత్రక చిత్రాలు, పీరియాడిక్ సినిమాలు, భారీ బడ్జెట్ మూవీల్లో ఉపయోగించిన ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్‌ను భద్రపరచడానికి ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని నిర్మాణ సంస్థలు వాటిని తమ స్టోర్ రూమ్‌లలో ఉంచుతాయి. మరికొన్ని సందర్భాల్లో సినిమా ప్రమోషన్లు, ప్రత్యేక ప్రదర్శనలు, సినిమా సంబంధిత ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తారు. ఇలా ఒక సినిమాలో భాగంగా తయారైన దుస్తులు భవిష్యత్తులోనూ ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తుచేస్తుంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories