Anna Lezhneva Secret: పవన్ కల్యాణ్ కష్టకాలంలో అండగా నిలిచిన అన్నా లెజ్నెవా ఆయన నుంచి విడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, అన్నా లెజ్నెవా గురించి గతంలో నాగబాబు చేసిన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan Divorce: పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా సుమారు 13 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకోవడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏమిటి అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. పవన్ కష్టకాలంలో కూడా అండగా నిలిచిన అన్నా ఎందుకు దూరంగా ఉన్నారు అనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. దీంతో ఈ జంటకు సంబంధించిన పాత విషయాలన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
25
మరదలిపై నాగబాబు ప్రశంసలు
అదే సమయంలో నాగబాబు పాత ఇంటర్వ్యూ మళ్లీ వైరల్‌గా మారింది. అన్నా లెజినోవా స్వభావం, కుటుంబంతో ఆమె సంబంధం గురించి అందులో అతను ప్రశంసించారు. అన్నా రష్యాకు చెందినప్పటికీ, భారతీయ సంప్రదాయాల పట్ల ఆమెకు ఎంతో గౌరవం ఉంది. మా కుటుంబ ఆచారాలను గౌరవించడమే కాకుండా భక్తిశ్రద్ధలతో పాటించేవారు అని నాగబాబు చెప్పారు. మరదలిపై ఆయన ప్రశంసలు కురిపించారు.
35
అన్నా మాత్రమే మా ఫ్యామిలీతో కలిసిపోయింది
అంతే కాదు, పవన్ గతంలో ఇద్దరు భార్యలు తమ కుటుంబంతో ఎక్కువగా కలవలేదు. అయితే అన్నా మాత్రమే మా కుటుంబ సభ్యులతో చాలా అన్యోన్యంగా ఉండేది. మా కుటుంబంలో అందరికీ ఆమె అంటే ఇష్టం. మేము కొన్ని ఆచారాలను లాంఛనంగా పాటించినప్పటికీ, అన్నా వాటిని మనస్ఫూర్తిగా అనుసరించేవారు` అని నాగబాబు ప్రశంసించారు. ఈ మాటల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.
అన్నా లెజినోవా ఒక రష్యన్ మోడల్. జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించిన 'తీన్మార్' చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తున్నప్పుడు ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారింది. 2013లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కింద ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరికి వివాహం జరిగింది. ఈ దంపతులకు పోలెనా అంజనా పవనోవా అనే కుమార్తె, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నారు.
55
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బిజీ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాలు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న అన్నా నుంచి పవన్ ఎందుకు విడిపోయాడు అనే ప్రశ్న ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే పవన్ మళ్లీ మ్యారేజ్ చేసుకుంటాడా? ఒంటరిగానే ఉండిపోతాడా అనేది అతిపెద్ద సస్పెన్స్. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.