సీనియర్ నటుడు గిరిబాబు మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఫ్యామిలీ గురించి, కొడుకు రఘుబాబు గురించి కమెడియన్ అలీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు.
ప్రముఖ నటుడు గిరిబాబు నవంబర్ 14న శనివారం రోజు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గిరిబాబు టాలీవుడ్ లో వందల చిత్రాల్లో నటించారు. గిరిబాబు 1973లో ఇండస్ట్రీలోకి వచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించారు. అంతే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించారు. గిరిబాబుకి ఇద్దరు కుమారులు. ఒక కొడుకు రఘుబాబు టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా రాణిస్తున్నారు. మరో తనయుడు బోస్ బాబు గతంలో హీరోగా నటించారు.
25
గిరిబాబు ఫ్యామిలీ
గిరిబాబు మరణించడంతో ఆయన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ అలీ మాట్లాడుతూ.. గిరిబాబు గారితండ్రి పేరు ఎర్రా నాగయ్య. ఆయన 107 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికారు. గిరిబాబు సతీమణి పేరు శ్రీదేవి. ఆమె అనారోగ్యంతో మరణించారు. గిరిబాబు గారికి, శ్రీదేవి గారికి రఘుబాబు లాంటి కొడుకు ఉండడం అదృష్టం.
35
తల్లి కోసం రఘుబాబు ఎంత ఖర్చు చేశారో తెలుసా
ఎందుకంటే.. గిరిబాబు గారి సతీమణి శ్రీదేవి అనారోగ్యానికి గురైనప్పుడు.. ఆమెని బతికించడానికి గిరిబాబు ఎంత ప్రయత్నించారు.. అంతకంటే ఎక్కువగా తల్లిని కాపాడుకోవడం కోసం రఘుబాబు కష్టపడ్డారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే.. రఘుబాబు తన తల్లి వైద్యం కోసం ఏకంగా ఒకటిన్నర కోటి ఖర్చు చేశారు. అందుకే అలాంటి కొడుకు ఉండడం అదృష్టం అని అన్నాను.
గిరిబాబు కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ కమెడియన్ గా రఘుబాబు తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. విక్రమార్కుడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, యమదొంగ లాంటి సినిమాలు రఘుబాబుకి మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.
55
గిరిబాబుకి కృష్ణ, మోహన్ బాబుతో అనుబంధం
గిరిబాబు విషయానికి వస్తే నెగిటివ్ రోల్స్ లో అద్భుతంగా నటించారు. ఎక్కువగా ఆయన మహిళల్ని వేధించే పాత్రల్లో నటించారు. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో గిరిబాబు, మోహన్ బాబు రూమ్ మేట్స్ గా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో గిరిబాబు 150కి పైగా సినిమాల్లో నటించారు.