అల్లు అర్జున్ ను పట్టించుకోని టాలీవుడ్ స్టార్స్, చివరకు మహేష్ బాబు కూడా హ్యాండిచ్చాడుగా?

Published : Apr 10, 2025, 02:03 PM IST

రీసెంట్ గా అల్లు అర్జున్ 43వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.  ఫ్యామిలీకి మాత్రమే కాదు ఫ్యాన్స్ కు కూడా సంతోషం కలిగించేలా తన నెక్ట్స్ సినిమా అప్ డేట్ ను అందించి, దిల్ ఖుష్ చేశాడు. అయితే ఈసారి టాలీవుడ్ స్టార్స్ మాత్రం బన్నీకి పెద్ద షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ తప్పించి మిగతావారంతా అల్లు అర్జున్  విషయంలో చేసిన పని, ఫ్యాన్స్ కు ఆశ్చర్యం కలిగిస్తోంది. వారంతా ఎందుకు ఇలా చేశారు? 

PREV
17
అల్లు అర్జున్ ను పట్టించుకోని టాలీవుడ్ స్టార్స్, చివరకు మహేష్ బాబు కూడా హ్యాండిచ్చాడుగా?

పుష్ప రెండు సినిమాలతో టాలీవుడ్ ఇమేజ్ ను మరో మెట్టు ఎక్కించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పాన్ ఇండియా హీరోగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.  బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ చేసి.. టాప్ లోకి ఎక్కి కూర్చున్నాడు అల్లు అర్జున్. ఆయన నటించిన పుష్ప2 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను  వసూలు చేసింది. ఓన్లీ నార్త్ లోనే 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది సినిమా. ఇంత సాధించిన అల్లు అర్జున్ కు టాలీవుడ్ షాక్ ఇచ్చింది. 

Also Read:  దేవుళ్లను అవమానించిన సుడిగాలి సుధీర్, మండిపడుతున్న హిందూ సంఘాలు, నెటిజన్లు, అసలేం జరిగింది.

27
Atlee - Allu Arjun Movie

అసలు విషయం ఏంటంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే.  ఆయన ఈసారి 43వ పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకున్నాడు. తన నెక్ట్స్ మూవీ ఎవరితో  చేస్తున్నది క్లారిటీ ఇచ్చాడు బన్నీ. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో.. భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని ప్రకటించాడు ఐకాన్ స్టార్. దాంతో ఫ్యాన్స్ అంతా దిల్ ఖుష్ అయ్యారు. తమ అభిమాన హీరో మరో సారి రచ్చ చేయబోతున్నందుకు ఎంతో సంతోషించారు. అయితే ఈ సంతోషంతో పాటు ఫ్యాన్స్ లో ఓ బాధ కూడా కనిపిస్తోంది, అదేంటంటే..? 

Also Read: సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలు, మందు బాబులకు త్వరలో డబుల్ ధమాకా

37

ఈసారి అల్లు అర్జున్ బర్త్ డేను టాలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. టాలీవుడ్ స్టార్స్ ఎవరు అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక, విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ వంటి కొంత మంది  తప్పించి, మిగిలిన స్టార్స్ ఎవరు అల్లు అర్జున్  బర్త్ డే ను పట్టించుకోలేదు.  బన్నీకి చాలా క్లోజ్ గా ఉండే ప్రభాస్, రానా లాంటి స్టార్స్ కూడా అల్లు అర్జున్ ను విష్ చేయకపోవడం ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసింది. 

Also Read: సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలు, మందు బాబులకు త్వరలో డబుల్ ధమాకా

47

ముఖ్యంగా మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు రాలేదు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మెగాస్టార్ చిరంజీవి పక్కాగా బన్నీని విష్ చేసేవారు. కాని ఆయన కూడా ఈసారి విష్ చేయకపోవడం మెగా ఫ్యాన్స్ ను కూడా షాక్ కు గురిచేసింది. అయితే పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కు సింగపూర్ లో ప్రమాదం జరగడంతో, మెగా ఫ్యామిలీ అంతా ఆ హడావిడిలో లో ఉన్నారు. చిరు, పవన్ సింగపూర్ వెళ్ళారు. దాంతో మెగా కాపౌండ్ నుంచి బన్నీకి విషెష్  రాలేదు. 

Also Read: ఎన్టీఆర్ దెబ్బకు జ్వరం తో మంచం ఎక్కిన హీరోయిన్? 3రోజులు ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడ్డ నటి ఎవరు?

57

అయితే ప్రతీ చిన్న విషయంలో ట్వీట్టర్ వేదికగా  స్పందిస్తుంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎవరి బర్త్ డేలు, అవార్డ్ విన్నింగ్ మూమెంట్స్ ను వదలిపెట్టకుండా విష్ చేస్తుంటారు. కాని ఈసారి బన్నీ బర్త్ డేను ఆయన ఎలా మర్చిపోయారు అనేది అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈక్రమంలో అల్లు అర్జున్ ను కావాలని ఇండస్ట్రీ దూరం పెడుతుందా అన్న వాదన కూడా వినిపిస్తుంది. 

Also Read: థియేటర్ లో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? సినిమా మధ్యలో బ్రేక్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే?

67
Allu Arjun

సంధ్య థియేటర్ ఘటన తరువాత బన్నీ జైలుకు వెళ్ళడం.. స్టార్లు వచ్చి ఆయన్ను పరామర్శించడం, పరామర్శించిన స్టార్స్ పై ట్రోలింగ్ జరిగింది, ముఖ్యమంత్రి కూడా వారిని అసెంబ్లీ వేధికగా విమర్శించారు. ఇక బన్నీని విష్ చేయకపోవడానికి ఈ కోణంలో ఏదైనా కారణం ఉండి ఉంటుందా  అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. 

Also Read: అల్లు అర్జున్, అట్లీ మూవీ కోసం కళ్ళు తిరిగే బడ్జెట్, గ్రాఫిక్స్ కే 250 కోట్లు, అసలు ఎంతో తెలుసా?

77
pushpa 2 final box office collection allu arjun fahadh faasil sukumar

అంతే కాదు అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో టాలీవుడ్ పేరును నిలబెట్టాడు, పుష్ప సినిమాతో బాహుబలి రికార్డ్ బ్రేక్ చేశాడు,  ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో  ఎవరికి సాధ్యం కాని జాతీయ అవార్డ్ ను సాధించి పెట్టాడు. ఇంతచేసినా.. ఐకాన్ స్టార్ కు దక్కాల్సిన గౌరవం దక్కడంలేదు, కనీస స్పందన కూడా టాలీవుడ్ నుంచి కరువయ్యిందంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.   దేశం మొత్తం గర్వపడేలా చేసిన అల్లు అర్జున్ ని మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎందుకు పట్టించుకోవడం లేదు, అతని సక్సెస్ ని చూసి అసూయ పడుతున్నారా? అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories