Jack Movie Review: `జాక్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌..

Published : Apr 10, 2025, 12:29 PM IST

Jack Movie Review: సిద్దు జొన్నలగడ్డ తెలుగు ఆడియెన్స్ కి టిల్లుగానే గుర్తిండిపోయాడు. `డీజే టిల్లు`, `టిల్లు స్వ్కేర్‌`తో ఆయన చేసిన రచ్చ ఆ రేంజ్‌లో ఉంది మరి. సిద్దు పేరుని కాస్త టిల్లుగానే గుర్తుంచుకున్నారంటే ఆయన పాత్ర ప్రభావం ఆడియెన్స్ పై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సిద్దుని ఇంకా టిల్లుగానే చూస్తున్నారు. ఈ క్రమంలో రూట్‌ మార్చాడు సిద్దు. యాక్షన్‌ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన `జాక్‌` మూవీలో నటించింది. ఇందులో వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్‌ రూపొందించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూసి తెలుసుకోండి.   

PREV
17
Jack Movie Review: `జాక్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌..
jack movie review

Jack Movie Review: సిద్దు జొన్నలగడ్డ `టిల్లు స్వ్కేర్‌`గా పాపులర్‌ అయ్యాడు. వెంట వెంటనే రెండు టిల్లు మూవీస్‌తో వచ్చి ఆడియెన్స్ ని అలరించారు. కడుపుబ్బ నవ్వించాడు. దీంతో సిద్దుని టిల్లుగానే గుర్తు పెట్టుకున్నారు ఆడియెన్స్. ఇక ఇప్పుడు దాన్నుంచి బయటకు వచ్చి `జాక్‌` అనే చిత్రంలో నటించాడు సిద్దు జొన్నలగడ్డ.

ఇందులో `బేబీ` ఫేమ్‌ వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఈ మూవీ నేడు గురువారం(ఏప్రిల్‌ 10)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? జాక్‌గా టిల్లు అలరించారా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

27
jack movie review

కథః 
పాబ్లో నెరుడా అలియాస్‌ జాక్‌(సిద్దు జొన్నలగడ్డ) ఒక డిఫరెంట్‌ ఎనర్జీ ఉన్న అబ్బాయి. లైఫ్‌లో ఏం కావాలనేది క్లారిటీ లేదు. అనేక గేమ్స్ ట్రై చేసి ఎక్కడా ఫిట్‌ కాడు. దీంతో చివరికి రా ఏజెంట్‌ కావాలనుకుంటాడు. అందుకోసం సొంతంగా పలు క్రైమ్‌ కేసులను స్టడీ చేస్తాడు. `రా` సెలక్షన్‌కి సంబంధించిన ఇంటర్వ్యూలో తాను స్టడీ చేసిన కేసులను చూపించి ఇంప్రెస్‌ చేస్తాడు. జాబ్‌ కన్ఫర్మేషన్‌ కి ఇంకా టైమ్‌ ఉన్నా, తాను దేశం కోసం పనిచేయాలని నిర్ణయించుకుంటారు.

మరో ఐపీఎస్‌ అధికారి(సుబ్బరాజు)తో కలిసి టెర్రరిస్ట్ ఎటాక్‌ని ఆపాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ ఉగ్రవాదిని పట్టుకుంటాడు. అదే సమయంలో రా అధికారి మనోజ్‌ కుమార్‌(ప్రకాష్‌ రాజ్‌)ని సైతం కిడ్నాప్‌ చేసి బంధిస్తాడు. మనోజ్‌ కుమార్‌ రా అధికారి అని తెలియక అతన్ని కూడా ఉగ్రవాదిగా భావిస్తాడు.

అయితే జాక్‌ ఏం చేస్తున్నాడో తనకు తెలియాలని అతని తండ్రి (నరేష్‌) లోకల్‌ ప్రైవేట్‌ డిటెక్టీవ్‌ సంస్థకి డీల్‌ ఇస్తాడు. దీంతో భానుమతి(వైష్ణవీ చైతన్య) రంగంలోకి దిగుతుంది. జాక్‌ని ఫాలో అవుతుంది. జాక్‌ కిడ్నాప్‌ చేసి దాచిన ఉగ్రవాదులు ఉన్న చోటుకి వచ్చి మనోజ్‌ కుమార్‌ని కాకుండా టెర్రరిస్ట్ కట్లు విప్పేస్తుంది. ఈ లోపు జాక్‌ వచ్చి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినా తప్పించుకుంటాడు. దీంతో జాక్‌ రా ఏజెంట్‌గా సెట్‌ కాడని చెప్పి అధికారులు పంపిస్తారు.

అయినా తానేంటో నిరూపించుకోవాలని నిర్ణయించుకుంటాడు. తప్పించుకున్న టెర్రరిస్ట్ నేపాల్‌లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. జాక్‌ గురించి తెలుసుకునేందుకు భానుమతి కూడా వెళ్తుంది. అలాగే రా టీమ్‌ కూడా టెర్రరిస్ట్ కోసం వెళ్తుంది. మరి అక్కడ ఏం జరిగింది? టెర్రరిస్ట్ లను పట్టుకున్నారా? టెర్రరిస్ట్ ఛీఫ్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ గురించి తెలిసిన నిజం ఏంటి? జాక్‌ అక్కడ కూడా రా ఏజెంట్‌కి తలనొప్పిగా మారాడా? వారికి హెల్ప్ చేశాడా? చివర్లో ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయనేది మిగిలిన కథ. 

37
jack movie review

విశ్లేషణః 
సిద్దు జొన్నలగడ్డ అంటే `టిల్లు` సినిమాలే గుర్తుకు వస్తాయి. తనదైన డైలాగ్‌ డెలివరీతో అలరించారు. ఆడియెన్స్ కి గుర్తుండిపోయేలా ఎంటర్‌టైన్‌ చేశాడు. దీంతో సిద్దు నుంచి వస్తోన్న సినిమా అంటే ఆయన మార్క్ ఫన్‌ ఉంటుందని ఆడియెన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ సిద్దు మాత్రం జోనర్‌ మార్చాడు. దాన్నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ యాక్షన్‌ కామెడీ మూవీ చేశాడు.

జోనర్‌ మార్చినా తన మార్క్ ఫన్‌ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కానీ అది సినిమాలో వర్కౌట్‌ కాలేదని చెప్పొచ్చు. అక్కడక్కడ తన డైలాగ్‌ డెలివరీలోనే టిల్లు ఛాయలున్నాయి. కానీ కథ మొత్తం వేరేలా సాగుతుంది. రా టీమ్‌, టెర్రరిస్ట్ లు, దేశాన్ని కాపాడటమనే కాన్సెప్ట్ తో సాగుతుంది. సీరియస్‌ సబ్జెక్ట్ లో సిద్దు ఫన్‌ కొంత వరకు పరిమితమయ్యింది. కొన్ని చోట్ల కథని డైవర్ట్ చేసేలా ఉంది.

ఇదే ఇందులో పెద్ద మైనస్‌. సినిమా కథ పరంగానూ చాలా రొటీన్‌ స్టోరీ. టెర్రరిస్ట్ ఎటాక్‌, దాన్ని మన ఇండియన్‌ ఆర్మీ, రా టీమ్‌ లు అడ్డుకోవడం, వాటి ఆటకట్టించడమనేది ఇప్పటికే చాలా సినిమాలు చూశాం. ఇందులోనూ అదే ఎలిమెంట్లని జోడించారు. ఆ విషయంలో ఎలాంటి కొత్తదనం లేదు. సినిమాకి ఇది పెద్ద మైనస్‌. ఈ స్టోరీకి సిద్దు పాత్రని లింక్‌ చేయడం కూడా కన్విన్సింగ్‌గా అనిపించలేదు. 
 

47
jack movie review

సినిమా ద్వారా సిద్దు క్యారెక్టరైజేషన్‌లోని ఫన్‌ని చూపించాలనుకున్నారా? లేక సీరియస్‌ టెర్రరిస్ట్ ఎటాక్‌ స్టోరీని చూపించాలనుకున్నారా? అనే క్లారిటీ మిస్‌ అయ్యింది. మిషన్‌ మిస్‌ లీడ్‌ అయినట్టు, ఇక్కడ కూడా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ చేసిన ప్రయత్నం మిస్‌ ఫైర్‌ అయ్యిందనే చెప్పాలి. మూవీ చాలా లాజిక్‌ లెస్‌గానూ ఉంది. ప్రారంభం నుంచి ఏమాత్రం కొత్తదనం లేదు.

అడపాదడపా హీరోయిన్‌తో సిద్దు చేసే రొమాన్స్, వారి మధ్య కన్వర్జేషన్‌ ఒక్కటే ఇందులో కామెడీని పండించే అంశం. వారిద్దరు కలిసినప్పుడే ఆ కొంత ఫన్‌ జనరేట్‌ అయ్యింది. యూత్‌కి ఆకట్టుకునేలా ఉంది. ముద్దు సీన్‌, దాని మీద జరిగే కన్వర్జేషన్‌ అలరించేలా ఉంటుంది. మిగిలిన సినిమా మొత్తం గమ్యం లేని నావాలాగా సాగిపోయాయి.

టెర్రరిస్ట్ లు దొరకడం, పారిపోవడం వంటి సీన్లు చాలా సిల్లీగా ఉన్నాయి. ఏమాత్రం పసలేదు. ఏమాత్రం దమ్ములేదు. ఇక నేపాల్‌కి వెళ్లడం, అక్కడ టెర్రరిస్ట్ ని పట్టుకోవడమనేది కూడా కన్విన్సింగ్‌గా అనిపించలేదు. చార్మినార్‌ ఎపిసోడ్‌ కూడా ఏమాత్రం రక్తికట్టేలా లేదు. పూర్తిగా సినిమాని సిద్దు స్టయిల్‌లో తీసుకెళ్లినా కామెడీ వర్కౌట్‌ అయ్యేది. లేదంటే పూర్తిగా టెర్రరిస్ట్ నేపథ్యంలో బలమైన కథ రాసుకుని వెళ్లినా బాగుండేది.

కానీ ఇది రెంటికి చెడ్డ రేగడిలా మారిపోయింది. సినిమాలో కనీసం ట్విస్ట్ లు కూడా లేవు. దీంతో మూవీ అంతా ఫ్లాట్‌గా సాగుతుంది. ఏమాత్రం కిక్‌ ఇచ్చేలా లేదు. ఇప్పుడు ప్రతి పది, ఇరవై నిమిషాలకు ఏదైనా క్రేజీగా జరిగితేనే ఆడియెన్స్‌ ఎంగేజ్‌ అవుతారు. అలా లేకపోతే ఇంట్రెస్ట్ చూపించడం లేదు. `జాక్‌` పరిస్థితి కూడా అదే అని చెప్పొచ్చు. 
 

57
jack movie review

నటీనటులుః
జాక్‌ పాత్రలో సిద్దు జొన్నలగడ్డ అదరగొట్టాడు. తన టిల్లు స్టయిల్‌ డైలాగ్‌ డెలివరీ, పాత్ర బిహేవ్‌తో ఆకట్టుకున్నారు. టిల్లు ఛాయలను కంటిన్యూ చేస్తూనే యాక్షన్‌తో అదరగొట్టాడు. కానీ ఆయన పాత్రలోని సీరియస్‌ నెస్‌ అంతగా కన్విన్సింగ్‌గాలేదు. కానీ ఇందుల సిద్దు మార్క్ మిస్‌ అయ్యింది. ఇక వైష్ణవీ చైతన్య  డిటెక్టీవ్‌గా ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. ఆమె పాత్రలో బేబీ ఛాయలు కనిపిస్తాయి.

డైలాగ్‌ డెలివరీతోనూ ఆకట్టుకుంది. ఆమెని ఇంకా సరిగా వాడుకోలేదనిపిస్తుంది. ఇక ప్రకాష్‌ రాజ్‌ రా చీఫ్‌గా తనదైన నటనతో మెప్పించారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నరేష్‌ పాత్ర ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. కానీ పాత్రలో ఫన్‌ వర్కౌట్‌ కాలేదు. బ్రహ్మాజీని సరిగ్గా వాడుకోలేదు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. 

67
jack movie review

టెక్నీషియన్లుః 
`జాక్‌` మూవీ టెక్నీకల్‌గా బాగానే ఉంది. విజయ్‌ కే చక్రవర్తి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. రిచ్‌గా ఉన్నాయి. సురేష్‌ బొబ్బిలి, అచ్చు రాజమణి మ్యూజిక్‌ బాగుంది. ఉన్న రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. కానీ గుర్తిండిపోవు. ఇక సామ్‌ సీఎస్‌ బీజీఎం ఫర్వాలేదు. డీసెంట్‌గా ఉంది. తన మార్క్ ని చూపించారు. ఎడిటర్‌ నవీన్‌ నూలి ఇంకా షార్ట్ గా కట్‌ చేయాల్సింది. అనవసరమైన సీన్లు కూడా తీసేయొచ్చు.

దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ రాసుకున్న కథలో దమ్ములేదు. రొటీన్‌ స్టోరీని రాసుకున్నారని చెప్పొచ్చు. అదే సమయంలో సినిమాని నడిపించిన తీరు కూడా ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఏం జరుగుతుందో ఊహించేలా ఉంది. ఆయన తన మార్క్ ని సెన్సిబులిటీస్‌ని మిస్‌ అయ్యారు. కొన్ని సీన్లు చూస్తుంటే దీనికి డైరెక్టర్‌ భాస్కరేనా అనిపించేలా ఉన్నాయి. ఇక సిద్దు పాత్ర డిజైన్‌ విషయంలో మాత్రం పూర్తిగా సిద్దుకే వదిలేసినట్టు ఉంటుంది. ఆ విషయంలో దర్శకుడి ఏం చేయలేని స్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ మూవీని రొటీన్‌, బోరింగ్‌ మూవీగా మార్చేశారు.
 

77
Jack Movie

ఫైనల్‌గాః  కొన్ని సిద్దు డైలాగ్స్, ఆయన పాత్రలోని కామెడీ తప్ప ఏమాత్రం ఆకట్టుకోలేని `జాక్‌`. 
రేటింగ్‌ః 2

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories