నివాస్ అనే దర్శకుడు ఆర్జీవీ శిష్యుడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కి స్నేహితుడు. సల్మాన్ ఖాన్ కోరిక మేరకు కథ రెడీ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం పంకజ్ పరాశర్ చేతుల్లోకి వెళ్ళింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, అతడి స్నేహితుడు షార్ప్ షూటర్లు గా ఉంటారు. సింపతీ కోసం ఒక మినిష్టర్ తనపై ఫేక్ ఎన్కౌంటర్ చేయమని చెబుతాడు. కానీ బుల్లెట్ నిజంగానే తగలడం వల్ల అతడు చనిపోతాడు. దీనితో పోలీసులు సల్మాన్ ఖాన్ వెంటపడతాడు. తప్పించుకునే క్రమంలో సల్మాన్ ఖాన్ గాయపడి గతం మరచిపోతారు. ఆ తర్వాత కథ ఒక పల్లెటూరికి వెళుతుంది.