అరుదైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ యంగ్ హీరో, ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలుసా?

Published : Jul 10, 2025, 01:34 PM ISTUpdated : Jul 10, 2025, 08:30 PM IST

డబ్బు, స్టార్ డమ్, సెలబ్రిటీ స్టేటస్, లగ్జరీ లైఫ్ ఏది ఉన్నా.. ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయి. ప్రతీక్షణం ఇబ్బందిపెట్టే ఆరోగ్య సమస్యలు ఉంటే సెలబ్రిటీలు అయిన ప్రశాంతంగా జీవించలేరు. ప్రస్తుతం ఓ యంగ్ హీరో పరిస్థితి అదే. ఇంతకీ  ఎవరాహీరో ? 

PREV
15

టాలీవుడ్ లో సక్సెస్ రేటు చాలా తక్కువ ఉన్న యంగ్ హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో కొంత మంది ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలబడాలని పోరాడుతున్నారు. గెలుపు ఓటములు చూడకుండా సినిమాలు చేస్తున్నారు. అలాంటి హీరోలలో ఒకరైన యంగ్ స్టార్ ఇటు తెలుగులో, అటు తమిళంలో కూడా తన లక్కును పరీక్షించుకుంటూనే ఉన్నాడు. ఈక్రమంలోనే ఆ హీరో తనకు ఉన్న ఓ అనారోగ్య సమస్యను గురించి వెల్లడించి అందరికి షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఎవరా యంగ్ స్టార్

25

టాలీవుడ్‌లో యంగ్ స్టార్ల్స్ లో  సందీప్ కిషన్ ఒకరు. తెలుగు, తమిళ సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో గా తనను తాను నిరూపించుకునేందుకు  గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. కాని సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఈక్రమంలోనే సందీప్ కిషన్ తనకు ఉన్న అనారోగ్య సమస్య గురించి ఓ సందర్భంలో వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచాడు. 

ఈ మధ్య కాలంలో  సందీప్ కిషన్ నటించిన సినిమాల్లో మజాకా  ఒకటి. ఈ సినిమా కూడా సందీప్ కు నిరాశే మిగిల్చింది. ఈక్రంమలో ఈసినిమా రిలీజ్ కు ముందు జరిగిన ప్రమోషన్స్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, ముఖ్యంగా తన అనారోగ్యం గురించి సీక్రేట్స్ ను ఆయన వెల్లడించారు. 

35

సందీప్ కిషన్ మాట్లాడుతూ..  తనకు తీవ్రంగా సైనస్ సమస్య ఉందని  వెల్లడించాడు. ఈ  ఇబ్బంది కారణంగా ప్రతిరోజూ నిద్రపోవడానికి కూడా గ్యాప్‌గా తీసుకోవలసి వస్తుంది. అప్పుడప్పుడు కారావాన్ లోనే నిద్రపోతాను, పని నుంచి కాస్త టైమ్ దొరికితే చాలు రెస్ట్ తీసుకుంటాను. అప్పుడప్పుడు ముక్కు నుంచి లోపలి భాగం వరకూ బ్లాక్ అవుతుంది. ముక్కుండి వెనకభాగం వరకు క్లోజ్ అయిన ఫీల్ వస్తుంది” దాని వల్ల నరకం చూడాల్సి వస్తుంది. 

45

ఈ సమస్య కారణంగా ఉదయాన్నే లేవగానే ఎవరితో కూడా మాట్లాడను, నా ఫ్యామిలీ మెంబర్స తో కూడా మాట్లాడను.. లేవగానే ముందు వేడిగా టీ తాగుతాను, మెడిటేషన్ మ్యూజిక్ వింటా, స్తోత్రాలు వింటా, ఆ త‌ర్వాతే ఇంట్లో వారితో మాట్లాడుతా. ఇది పాటించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ప్రశాంతంగా ఉండగలుగుతున్నా అని సందీప్ కిషన్ వెల్లడించారు.ఒత్తిడులను ఎదుర్కొంటానికి ఇది ఒక మార్గం అని ఆయన పేర్కొన్నారు.

55

అయితే, సైనస్ సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి.. ఇది తగ్గించుకోవడం కోసం సర్జరీకి వెళ్లాలి. కాని అది చేసినపుడు ముక్కు మారిపోతుందని, ముఖ కూడా రూపురేఖలు  మారిపోతాయనిి అందుకే సర్జరీకి వెళ్లడంలేదు అన్నారు సందీప్ కిషన్. కాని ఎప్పటికైనా సర్జరీ తప్పదంటున్నారు. ఇక  ఈ విషయం తెలిసి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.  ఆరోగ్యంకంటే ఏది ముఖ్యం కాదు అని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories