బిగ్ బాస్ లో అడుగుపెట్టనన్న స్టార్ నటుడు
బిగ్ బాస్ హిందీ 18 సీజన్లు కంప్లీట్ చేసుకుని త్వరలో 19వ సీజన్ స్టార్ట్ అవ్వబోతోంది. ఈక్రమంలో ఈ షోలో పాల్గొనబోతున్నారంటూ పలువురి లిస్ట్ బయటకు వచ్చింది. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ నటుడు రామ్ కపూర్ పేరు కూడా వినిపించింది. దాంతో ఈ విషయంలో ఆయన స్పందించారు.
తాజాగా రామ్ కపూర్ ఈ షోపై సంచలన కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ పై తన స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ "బిగ్ బాస్ హిందీ సీజన్ 19లో నేను పాల్గొనబోతున్నా అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. నాకు 20 కోట్లు ఆఫర్ చేసినా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళను. అది నా వ్యక్తిగత నిర్ణయం. నేను బిగ్ బాస్ షోను ద్వేషించను. అది సక్సెస్ ఫుల్ రియాలిటీ షో అన్నారు.
రామ్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ రియాల్టీషో నా మనస్తత్వానికి సరిపడదు. నేను నటుడిని, నటుడిగా నేను ప్రేక్షకులను అలరిస్తాను. రియాలిటీ షోల ద్వారా నా టాలెంట్ బయటకు రాదు," అంటూ రామ్ కపూర్ వ్యాఖ్యానించారు.రామ్ కపూర్ వ్యాఖ్యలు బిగ్ బాస్ మీద చర్చను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలో పలువురు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొంటున్నారు.