కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టాలీవుడ్ లో నటుడిగా ఎన్నో విలక్షణ విలక్షణమైన పాత్రల్లో నటించారు. కమెడియన్ గా, విలన్ గా, హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి నటనలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అభిమానులు మోహన్ బాబుని డైలాగ్ కింగ్ అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. సినీ రంగంలో మోహన్ బాబు నిర్మాతగా కూడా రాణించారు.
సినిమా రంగంలో మాత్రమే కాకుండా విద్యా రంగంలో కూడా మోహన్ బాబు తన ప్రత్యేకత చాటుకున్నారు. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను స్థాపించి వాటిని ఒక పెద్ద సామ్రాజ్యంగా మార్చేశారు. మోహన్ బాబు, సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ పెదరాయుడు చిత్రంలో కలిసి నటించారు. ఒకసారి రజనీకాంత్ మోహన్ బాబుకి ఒక మాట చెప్పారట. ప్రేక్షకులు మన పట్ల విసిగిపోయే ముందే మన రిటైర్ అయిపోవాలి అని చెప్పారట.