బాడీగార్డ్ నన్ను అక్కడ అసభ్యంగా తాకాడు.. చేదు అనుభవాన్ని పంచుకున్న టాలీవుడ్ హీరోయిన్..?

First Published | Jun 20, 2024, 7:28 AM IST

తనను కాపాడాల్సిన బాడీగార్డే తాక రాని చోట తనను తాకాడంటూ... చేదు అనుభవాన్ని వెల్లడించింది ఓ టాలీవుడ్ హీరోయిన్. ఇంతకీ ఎవరా హీరోయిన్..? ఏం జరిగింది. 
 

ఎంత స్టార్ స్టేటస్ వచ్చినా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఇబ్బందులు తప్పడంలేదు. ఎటునుంచి ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలియని పరిస్థితి. ఇండస్ట్రీలో ఎదగాలంటే..నెపోటిజమ్, కాస్టింగ్ కౌచ్... ఇతర వేదింపులు తప్పడంలేదు వారికి. ఇవి కాక కింది స్థాయి నుంచి కూడా కొన్న ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలాంటి అనుభవాన్ని వెల్లడించింది ఓ టాలీవుడ్ హీరోయిన్. 

ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ హీరోలు వీళ్లే... తెలుగు హీరోలు ఇందులో ఎవరున్నారంటే..?

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అవికా గోర్..  బాలనటిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె.. చిన్నారి పెళ్లి కూతురు తో సౌత్ లో బాగా ఫేమస్ అయ్యింది. ఆతరువాత చాలా చిన్నవయస్సులోనే హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ.. రాజ్ తరుణ్ జోడీగా ఉయ్యా జంపాల సినిమా చేసింది. కింగ్ నాగర్జున నిర్మాతగా తెరకెక్కిన ఈమూవీ సూపర్ హిట్ అవ్వడంతో వరుస ఆఫర్లు ఆమెను వరించాయి. 

116 కుక్కలకు 45 కోట్ల ఆస్తి రాసిచ్చిన బాలీవుడ్ హీరో..? శ్రీదేవితో ఏఫైర్ నడిపిన ఆ నటుడెవరో తెలుసా..?


విలేజ్ డ్రామా కాన్సెప్ట్‌తో మంచి కుటుంబ కథగా ప్రేక్షకులను మెప్పించింది ఉయ్యాల జంపాల సినిమా. తొలి సినిమాతోనే సైమా బెస్ట్ ఫీమేల్ డెబ్యూట్ అవార్డును అందుకుంది అవికా .ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావా, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో దూసుకుపోతుంది.

ప్రభాస్ ను బోల్డ్ క్యారెక్టర్ లో చూపించబోతున్న డైరెక్టర్..? రెబల్ స్టార్ ప్రయోగం చేస్తున్నారా..?

వరుసగా సినిమాలు అయితే చేసుకుంటూ వెళ్ళింది అవికా గోర్... కాని ఆమెకు చెప్పుకోదగ్గ హిట్లు పెద్దగా రాలేదనె చెప్పాలి. కాస్తో కూస్తో సినిమా చూపిస్త మామ లాంటి సినిమాలు ఆమెను నిలబెట్టాయి కాని.. స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. కాని ఇప్పటికీ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే ఉంది అవికా గోర్. 
 

ఇక ఈ బ్యూటీ తాజాగా తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. ఓ ఈవెంట్‌లో తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితిని చెప్పుకుంది. తన బాడీగార్డ్‌ తనతో చాలా అభ్యంతరకరంగా ప్రవర్తించాడని తెలిపింది అవికా.  ఓసారి ఫారెన్ లో  ఓ ఈవెంట్‌కు తాను హాజరయ్యానని, ఈవెంట్‌కు వెళ్లే ముందు కారు దిగి నడుస్తున్న సమయంలో ఎవరో తతను వెనకనుంచి తాకినట్లు అనిపించిందని... తిరిగి చూస్తే బాడీగార్డ్‌ మాత్రమే ఉన్నాడని చెప్పింది. 

కానీ అప్పడు తాను ఏం మాట్లాడకుండా వెళ్ళానని.. కాని ఆ బాడీగార్డ్  అంతటితో ఆగకుండా స్టేజ్ పైకి వెళ్తున్న సమయంలో కూడా తనను వెనుకనుంచి  అభ్యంతరకరంగా తాకాలని చూశాడట. దాంతో వెంటనే తాను అప్రమత్తం అయ్యి.. అతి చేయి పట్టుకుని ఆపి ఏంటి ఇది అని నిలదీసిందట అవికా.. అతను సారీ చెప్పడంతో అంతటితో ఆ విషయం వదిలేసినట్టు చెప్పుకొచ్చింది బ్యూటీ. 

ఇలా ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా హీరోయిన్లకు ఇబ్బందికర పరిస్థితులు తప్పడంలేదు. ఇక అవికా గోర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక అవికా రీసెంట్ గా అనురాగ్ హీరోగా ఉమాపతి సినిమా చేసింది. ఈమూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆది సాయి కుమార్ తో ఓ మూవీ చేస్తోంది అవికా గోర్. 

Latest Videos

click me!