ఇదిలా ఉంటే రీమా సేన్ తెలుగుతోపాటు తమిళం, హిందీ సినిమాలు కూడా చేసింది. ఇలా మూడు భాషల్లోకి వెళ్లడంతో ఎందులోనూ స్టేబులిటీ లేకుండా పోయింది. కానీ తెలుగులో బాగానే సినిమాలు చేసింది. `సీమ సింహం`, `అదృష్టం`, `వీడే`, `నీతో వస్తా`, `నీ మనసు నాకు తెలుసు`, `అంజి` సినిమాలు చేసింది. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. మూడేళ్ల తర్వాత `బంగారం`లో మెరిసింది. `యమగోల మళ్లీ మొదలైంది`, `ముగ్గురు` సినిమాల్లో కనిపించింది. కానీ ఆయాసినిమాలు ఆడలేదు. అటు తమిళం, హిందీలోనూ సినిమాలు చేసింది. అక్కడ కూడా బాగానే ఆకట్టుకుంది.