బేబీబంప్‌తో `కల్కి` ఈవెంట్‌లో దీపికా.. ప్రభాస్‌ చేసిన పనికి అమితాబ్‌ బచ్చన్‌ క్రేజీ టీజింగ్‌

First Published Jun 19, 2024, 8:33 PM IST

దీపికా పదుకొనె `కల్కి` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ముంబయి ఈవెంట్‌లో ఆమె బేబీ బంప్‌తో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రభాస్‌ చేసిన పని వైరల్‌గా మారింది. 
 

`కల్కి 2898ఏడీ` సినిమా ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్‌. `భైరవ థీమ్‌ సాంగ్‌ని విడుదల చేశారు. దీంతోపాటు `కల్కి` కథ ఎలా పుట్టిందో వివరించాడు దర్శకుడు నాగ్‌. మరోవైపు ముంబయిలో ఈ రోజు సాయంత్రం ఈవెంట్‌ నిర్వహించారు. హీరో రానా హోస్ట్ చేశారు. ఇందులో ప్రభాస్‌తోపాటు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, నిర్మాత అశ్వినీదత్‌ పాల్గొన్నారు. 
 

ఇందులో దీపికా పదుకొనె బేబీ బంప్‌తో పాల్గొనడం విశేషం. ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయం తలెసిందే. అయితే సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె బేబీ బంప్‌ కనిపించేలా వచ్చింది. బ్లాక్‌ టైట్‌ ఫిట్‌ ధరించింది. దీంతో బేబీ బంప్‌ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రెగ్నెంట్‌ అయ్యాక ఆమె తొలి సారి బయటకు వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఎగబడి ఫోటోలు తీసుకున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సందర్భంగా దీపికా పదుకొనె మాట్లాడుతూ, సినిమాకి పనిచేయడం అద్భుతమైన అనుభూతినిచ్చిందని చెప్పింది. నాగ్‌ అశ్విన్‌ అద్భుతమైన ఐడియాతో తనకు వద్దకు వచ్చాడని, అది విని వండర్‌ అయినట్టు చెప్పింది దీపికా పదుకొనె. అద్భుతమైన లెర్నింగ్‌ ఎక్స్ పీరియెన్స్ అని చెప్పింది. కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. నాగి హెడ్‌లో మ్యాజిక్‌ జరిగింది. అది సినిమాగా ఇలా మీ ముందుకు రాబోతుందని దీపికా పదుకొనె. 
 

అనంతరం చిట్‌ చాట్‌లో ప్రభాస్‌ గురించి చెప్పింది. ఆయనపై ప్రశంసలు కురిపించింది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనన్ని రోజులు ప్రభాస్‌ ఇంటినుంచే ఫుడ్‌ వచ్చేందని, అద్భుతమైన వంటకాలను తినిపించాడని, క్యాటరింగ్‌లా రోజూ ఆయన ఇంటి నుంచి ఫుడ్‌ వస్తుంటే హ్యాపీగా అనిపించిందని, అదొక బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ అని చెప్పింది దీపికా పదుకొనె. 
 

ఇదిలా ఉంటే స్టేజ్‌పై నుంచి దీపికా కిందకు దిగుతుంటే.. ప్రభాస్‌ లేచి ఆమెని పట్టుకుని రావడం విశేషం. దీపికా ప్రెగ్నెంట్‌ గా ఉన్న నేపథ్యంలో ప్రభాస్‌ లేచి ఆమె చేయి పట్టుకుని తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ చేసే ఫన్‌ మామూలు కాదు. దీపికాని ప్రభాస్‌ పట్టుకుంటే, ప్రభాస్ ని అమితాబ్‌ బచ్చన్‌ పట్టుకుని ఫన్‌ క్రియేట్‌ చేశాడు. తాను దీపికాను పట్టుకుంటాను అని పోటీ పడ్డాడు, ఈ సందర్భంగా ప్రభాస్‌ని టీజ్‌ చేశాడు అమితాబ్‌.‌. దీంతో ఈవెంట్‌ మొత్తం నవ్వులు విరిసాయి. ఈవెంట్‌లోనే ఈ దృశ్యం హైలైట్‌గా నిలిచింది. 

ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనెతోపాటు ప్రభాస్‌ పాల్గొని ఈ సినిమా అనుభవాన్ని వెల్లడించారు. ఒక కొత్త ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చినట్టు తెలిపారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు సినిమా కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే మూడు లోకాల్లో సాగుతుందని తెలిపారు. వీడియోలో నాగ్‌ అశ్విన్‌ కూడా ఆ మూడు లోకాల గురించి తెలియజేశాడు. అవేంటో వివరించారు. ఇక ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. 
 

Latest Videos

click me!