chiranjeevi
ఎంతో మంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కూడా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. కెరీర్ లో ఎన్నో కష్టాలు అనుభవించారు. సూపర్ హిట్ సినిమాలు చేశారు. ప్లాప్ లు ఫేస్ చేశారు. అంతే కాదు సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా ఆయన సరసన నటించిన ఎంతో మంది స్టార్ హీరోయిన్ల స్టార్ డమ్ కూడా వచ్చింది. రాధిక, విజయశాంతిలతో ఎక్కువ సినిమాలు నటించారు చిరంజీవి. నగ్మ, రోజా, మాధవి, రంభ, రమ్యకృష్ణ లాంటి సీనియర్ హీరోయిన్ ల నుంచి తమన్నా, కాజల్ వరకూ. ఎంతో మంది హీరోయిన్లు ఆయన సరసన నటించి మెప్పించారు.
Also Read: రజినీకాంత్ ను ప్రాణంగా ప్రేమించిన హీరోయిన్, పెళ్ళి మాత్రం చేసుకోలేకపోయింది? ఎవరో తెలుసా?
చిరంజీవితో సినిమా అంటే ఎగిరి గంతేస్తుంటారు హీరోయిన్లు. ఆయన కూడా హీరోయిన్లతో చాలా క్లోజ్ గా ఉంటారు.ఫ్రెడ్షిప్ చేస్తుంటారు. 90స్ హీరోయిన్ల తో కలసి చాలా సందర్భాలలో చిరంజీవి డాన్స్ లు కూడా వేశారు. తన ఇంట్లో పార్టీలు ఏర్పాటు చేసి వారికి మంచి ట్రీట్ లు కూడా ఇస్తుంటారు.
వీరికి ఓ క్లాబ్ కూడా ఉంది. ఇక ఇలా హీరోయిన్లతో చాలా హ్యాపీగా చనువగా ఉంటారు చిరంజీవి. అయితే తన కెరీర్ లో ఏ హీరోయిన్ తో ఎటువంటి వివాదం లేకుండా.. చాలా జాగ్రత్తగా ఉన్నారు మెగాస్టార్. కొంత మంది హీరోయిన్ల దగ్గర మాత్రం చాలా చనువుగా ఉండేవారట.
రాధిక, సుహాసిని, రాధ, విజయశాంతి లాంటి హీరోయిన్లు మెగాస్టార్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీరంతా ఉన్నా.. మెగాస్టార్ తో ప్రత్యేకంగా అనుబంధం ఉన్న హీరోయిన్ మాత్రం వేరే ఉన్నారట. ఆమె ఎవరో కాదు దివంగత నటి సౌందర్య.
Also Read: 5 కోట్లు ఖర్చు చేసి 5 సెకండ్ల సీన్ తీసిన దర్శకుడు? సినిమా హిట్టా ఫట్టా?
రాధిక, విజయశాంతి, రాధ, సుహాసిని.. వీరు చిరుతో ఎంత క్లోజ్ గా ఉన్నా.. ఆయన మాత్రం సౌందర్యను ప్రత్యేకంగా చూసేవారట. ఆమె పద్దతులంటే ఆయనకు చాలా ఇష్టమట. అందుకే సౌందర్యను తన ఇంట్లో మనిషిలా చూసుకునేవారట. అందుకే సౌందర్యను మాత్రమే చిరు సౌ..అని ముద్దుగా పిలుచుకునేవారట. ఆమె కూడా చిరంజీవి ఆప్యయంగా పలకరించేవారని తెలుస్తోంది. చిరు సతీమణి సురేఖతో కూడా సౌందర్య చాలా ఆప్యాయంగా ఉండేవారు.
Also Read: 1000 రోజులు థియేటర్ లో ఆడిన మాస్ హీరో సినిమా ఏంటో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో సావిత్రి తరువాత అలాంటి పద్దతులు కలిగిన నటిగా సౌందర్యకు పేరుంది. ఫ్యాషన్ షోలతో, పొట్టి డ్రెస్ లు స్టార్ట్ అయిన ఆ రోజుల్లో కూడా చీరకట్టుతో స్టార్ హీరోయన్ గా ఎదిగింది సౌందర్య. తన నటనతో మెప్పించి.. ఫ్యామిలీ ఆడియన్స్ చేత శభాష్ అనిపిచుకుంది సౌందర్య. చాలా చిన్న వయస్సులో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
టాలీవుడ్ తో పాటు, కోలీవుడ్ , బాలీవుడ్ సినిమాల్లో కూడా హీరోయిన్ గా రాణించింది సౌందర్య. తెలుగులోచిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య బాబు , శ్రీకాంత్. జగపతి బాబు సినిమాలో నటించిన సౌందర్య. తమిళంలో రజినీకాంత్, విజయ్ కాంత్, అజిత్ లాంటి స్టార్ల సరసనమెరిసింది. సౌత్ లో తిరుగు లేని ఇమేజ్ ను సాధించిన సౌందర్య.. చాలా చిన్న వయస్సులోనే మరణించింది.