అది దా సర్ప్రైజ్ సాంగ్ కోసం కేతిక శర్మ తీసుకున్న భారీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Ketika Sharma  Adhi Dha Surprisu  Song: ఈమధ్య కాలంలో వివాదాస్పంద అయి హిట్ అయిన సాంగ్స్ లో అది దా సర్ప్రైజ్ సాంగ్ కూడా ఒకటి. ఈ సాంగ్ తో చాలా పాపులర్ అయ్యింది కేతికా శర్మ. ఇందులో ఆమె వేసిన హాట్ స్టెప్ ఎంతలా పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సాహసం చేయడానికి ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా? 

Ketika Sharma  Adhi Dha Surprisu  Song Dance and Her Massive Paycheck for the Controversial Track in telugu jms

Ketika Sharma  Adhi Dha Surprisu  Songప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా కాని పాట కాని హిట్ అవ్వాలంటే అది వివాదం అవ్వాల్సిందే. ఏదో ఒక కాంట్రవర్సీ నెత్తిన వేసుకుంటేనే అది జనాల్లోకి బాగా వెళ్తోంది.  ఈ విషయాన్ని గట్టిగా పట్టుకుంటున్నారు మేకర్స్. ఏదో ఒక చిన్న పాయింట్ కాస్త కాంట్రవర్సీ అయ్యేలా చూసుకుంటున్నారు. తాజాగా రాబిన్ హుడ్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ముందుగా ఈసినిమా సాంగ్ వివాదం అయ్యింది. 

Also Read:  రజినీకాంత్ ను ప్రాణంగా ప్రేమించిన హీరోయిన్, పెళ్ళి మాత్రం చేసుకోలేకపోయింది? ఎవరో తెలుసా?

Ketika Sharma  Adhi Dha Surprisu  Song Dance and Her Massive Paycheck for the Controversial Track in telugu jms

అది దా సర్ ప్రైజ్ అంటూ డాన్సింగ్ నెంబర్ ను ఆమధ్య రిలీజ్ చేశారు మూవీ టీమ్. అయితే ఈసాంగ్ లోకేతిక శర్మ వేసిన ఓ స్టెప్ పాపులర్ అయ్యింది. అంతే కాదు వివాదాస్పంద కూడా అయ్యింది. సోషల్ మీడియాలో ఎంత దుమారం రేపిందంటే.. విమర్శలతో పాటు వ్యూస్ కూడా గట్టిగానే వచ్చాయి పాటకు. ఇక మహిళా కమీషన్ కూడా ఈ సాంగ్ లో ఉన్న వివాదాస్పద బిట్స్ ను తొలగించాలని ఆదేశించేవరకూ వెళ్లింది సాంగ్. దాంతో ఇటు కేతిక శర్మకు అటు రాబిన్ హుట్ మూవీకి పిచ్చి పిచ్చిగా పబ్లిసిటీ అయిపోయింది. 

Also Read: 1000 రోజులు థియేటర్ లో ఆడిన మాస్ హీరో సినిమా ఏంటో తెలుసా?


ఏది ఏమైనా ఈ పాటలో కేతిక డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  ఈ బ్యూటీ డాన్స్ మాత్రం దంచి కొట్టేసింది. ముఖ్యంగా కుర్రకారులు అయితే ఆమె హాట్ స్టెప్పులకు పిచ్చెక్కిపోయారు. అయితే ఈ పాట కోసం ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుని ఉంటుంది అని పెద్ద చర్చ బయట నడుస్తుంది. ఈక్రమంలో ఈ పాట కోసం కేతిక శర్మ దాదాపు కోటి రూపాయలు తీసుకుందని సమాచారం. అసలే సరైన సినిమాలు లేవు, అవకాశాలు లేక ఇబ్బందిపడుతున్న కేతికకు ఇది గోల్డెన్ ఆఫర్ అనుకోవాలి. అంత రెమ్యునరేషన్ కూడా కేతికకు రావడం విచిత్రమే. 

Also Read: 5 కోట్లు ఖర్చు చేసి 5 సెకండ్ల సీన్ తీసిన దర్శకుడు? సినిమా హిట్టా ఫట్టా?

అందుకే ఆమె ఈ పాటను తన ఇన్ స్ట్రా తో పాటు ఇతర సోషల్ మీడియాపేజ్ లలో కూడా ప్రమోట్ చేస్తుంది. ఇప్పటి వరకు హీరోయిన్ గా కూడా ఈమె ఇంత రెమ్యూనరేషన్ అందుకోలేదట ఈ సాంగ్ వల్ల, దానితో వచ్చిన కాంట్రవర్సీ వల్ల రాబిన్ హుడ్  సినిమా పై హైప్ ఏర్పడింది. ఇక  థియేటర్స్ లో ఈ పాటకు  ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.  చాలా కాలంగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్న నితిన్ కు ఈ సినిమా సాలిడ్ హిట్ అందిస్తుందని నమ్ముతున్నారు.
 

 హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా.. ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. డేవిడ్ వర్నర్ వల్ల కూడా ఈసినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. క్రికెట్ ప్రియుల నుంచి కూడా రాబిన్ హుడ్ సినిమాకు భారీగా రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 28న రిలీజ్ కాబోతోన్న ఈమూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకోవడం కోసం అనుమతిని కూడా ఇచ్చేసారు.

Latest Videos

vuukle one pixel image
click me!