24 ఏళ్ళ కెరీర్ లో రాజమౌళి జీర్ణించుకోలేకపోయిన బాధ అదొక్కటే, దిక్కుతోచని పరిస్థితిలో..
రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదిగిన తర్వాత జీర్ణించుకోలేని సంఘటన కెరీర్ పరంగా ఎదురైందట. ఓ ఇంటర్వ్యూలో జక్కన్న ఆ సంఘటన గురించి చెప్పారు.
రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదిగిన తర్వాత జీర్ణించుకోలేని సంఘటన కెరీర్ పరంగా ఎదురైందట. ఓ ఇంటర్వ్యూలో జక్కన్న ఆ సంఘటన గురించి చెప్పారు.
దర్శకధీరుడు రాజమౌళికి తన 24 ఏళ్ళ కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. బిగినింగ్ లో ఎవరికైనా నిలదొక్కుకోవడానికి కష్టాలు ఎదురవుతాయి. అందరికీ అది సహజమే. కానీ రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదిగిన తర్వాత జీర్ణించుకోలేని సంఘటన కెరీర్ పరంగా ఎదురైందట. ఓ ఇంటర్వ్యూలో జక్కన్న ఆ సంఘటన గురించి చెప్పారు.
మీ కెరీర్ లో అత్యంత బాధాకరమైన సంఘటన, లోయెస్ట్ మూమెంట్ ఏది అని ప్రశ్నించగా రాజమౌళి సమాధానం ఇచ్చారు. రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. సింహాద్రి చిత్రంతో విషయం ఉన్న మాస్ డైరెక్టర్ అని ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత యమదొంగ,ఈగ, మగధీర చిత్రాలు రాజమౌళిని టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా నిలబెట్టాయి.
ఆ టైంలో రాజమౌళి చాలా పెద్ద రిస్క్ చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో బాహుబలి చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించారు. అప్పటి వరకు టాలీవుడ్ వాళ్ళు కలలో కూడా ఊహించలేని భారీ బడ్జెట్ లో బాహుబలి చిత్రాన్ని రాజమౌళి రూపొందించారు. ప్రభాస్ కి టాలీవుడ్ లో క్రేజ్ ఉంది కానీ పాన్ ఇండియా స్థాయిలో చాలా మందికి అతడు ఎవరో కూడా తెలియదు. అలాంటి హీరోతో వందల కోట్ల బడ్జెట్ సినిమా అంటే ఎంత రిస్క్ అనేది ఊహించుకోవచ్చు.
విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసి మంచి బజ్ క్రియేట్ చేసి బాహుబలి 1 చిత్రాన్ని రిలీజ్ చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం జూలై 10, 2015న విడుదలయింది. ప్రపంచం మొత్తం ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది.. ఒక్క తెలుగులో తప్ప. సినిమాకి దెబ్బ పడడానికి అదొక్కటి చాలు. ఎందుకంటే బడ్జెట్ లో మేజర్ పార్ట్ రికవరీ కావాలంటే బాహుబలి 1 తెలుగులో సూపర్ హిట్ కావాలి. తొలి షో నుంచే తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 1కి బ్యాడ్ టాక్ మొదలైంది.
నిర్మాత శోభు యార్లగడ్డ కేవలం తనని నమ్ముకుని అంత బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు బాహుబలి 1 ఫ్లాప్ అయితే బాహుబలి 2 రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియదు. పెట్టిన డబ్బు మొత్తం వృధా.. అంతా కొలాప్స్ అయినట్లు తనకి అనిపించింది అని రాజమౌళి తెలిపారు. ఫస్ట్ డే మొత్తం అలాంటి టాకే కొనసాగింది. ఏం చేయాలి, శోభుని ఎలా ఆదుకోవాలి.. అసలు తనకి ఏమి అర్థం కాలేదు అని రాజమౌళి అన్నారు. కానీ సెకండ్ డే నుంచి తన టెన్షన్ మొత్తం పోయింది అని రాజమౌళి తెలిపారు. సెకండ్ డే మొదలైన పాజిటివ్ టాక్ అలాగే స్టడీగా కొనసాగింది అని రాజమౌళి తెలిపారు.