ప్రియమణి కి 7 కోట్లు, ఫ్యామిలీ మ్యాన్ 3 స్టార్స్ లో.. ఎక్కువ రెమ్యూనరేషన్ ఎవరికి?

Published : Nov 25, 2025, 09:54 PM IST

Family Man 3 Cast Salary : ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3: 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' నవంబర్ 21న విడుదలైంది, మంచి రెస్పాన్స్ ను కూడా సాధిస్తోంది. ఇక  ఈ వెబ్ సిరీస్ సీజన్  3  కోసం యాక్టర్స్ తీసుకున్న  రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా?  అత్యధిక రెమ్యూనరేషన్ ఎవరిది? 

PREV
18
ఫ్యామిలీ మ్యాన్ 3 స్టార్స్ రెమ్యూనరేషన్

ఓటీటీ ఆడియన్స్ ఎంతో  ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3' నవంబర్ 21, 2025న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. మనోజ్ బాజ్‌పేయితో పాటు ప్రియమణి, జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ సీజన్ 3లో నటించారు. ఈ సిరీస్ కోసం నటులు తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

28
మనోజ్ బాజ్‌పేయి

'ది ఫ్యామిలీ మ్యాన్ 3' సిరీస్ హీరో మనోజ్ బాజ్‌పేయి రెమ్యూనరేషన్‌ ఈసారి భారీగా పెరిగింది. బిగ్ టీవీ రిపోర్ట్  ప్రకారం, మనోజ్ ఒక్కో ఎపిసోడ్‌కు 2.25 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లైఫ్ రిపోర్ట్  ప్రకారం, మొత్తం సిరీస్‌కు మనోజ్ 20.25 కోట్ల నుండి 22.50 కోట్ల వరకు సంపాదించినట్లు  తెలుస్తోంది. 

38
ప్రియమణి

ప్రియమణి 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 1 నుండి మనోజ్ బాజ్‌పేయి భార్యగా నటిస్తోంది. మనోజ్‌తో పాటు, ప్రియమణి సుచిత్ర తివారీ పాత్రలో నటించింది. 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3' కోసం ఆమె 7 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

48
జైదీప్ అహ్లావత్

ఈసారి, జైదీప్ అహ్లావత్ కూడా ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. తన పాత్ర కోసం సుమారు 9 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

58
నిమ్రత్

ది ఫ్యామిలీ మ్యాన్ 3' సిరీస్ లో  నిమ్రత్ 'మీరా ఆస్టన్' అనే మహిళా విలన్ పాత్రను పోషించింది. ఈ వెబ్ సిరీస్ కోసం నిమ్రత్ 8 నుండి 9 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

68
దర్శన్

'మేజర్ సమీర్' అనే విలన్ పాత్రలో మళ్లీ కనిపించనున్న దర్శన్, అతను కూడా  నిమ్రత్  మాదిరిగానే 9 కోట్లు  రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. 

78
షరీబ్ హష్మీ

అభిమానుల ఇష్టమైన 'జేకే తల్పాడే' పాత్రను షరీబ్ హష్మీ పోషించాడు. దీనికోసం షరీబ్ 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అతను నాలుగో సీజన్‌లో కూడా కనిపించబోతున్నాడు.

88
ఆశ్లేషా ఠాకూర్

సీజన్ 1 నుండి మనోజ్, ప్రియమణిల కూతురు 'ధృతి తివారీ' పాత్రలో నటిస్తుంది ఆశ్లేషా ఠాకూర్. ఈసిజన్ కు ఆమె 4 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories