ఐ బొమ్మ క్లోజ్ అవ్వడంతో సినిమా కలెక్షన్లు పెరిగాయా? స్టార్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : Nov 25, 2025, 08:21 PM IST

iBomma Shutdown Impact : టాలీవుడ్ లో ఐ బొమ్మ సృష్టించిన రచ్చ అంతా ఇంతా కాదు. పైరసీ వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ వేల కోట్లు నష్టపోయింది. ఇక ఎట్టకేలకు ఐబొమ్మ క్లోజ్ అయ్యింది. ఇక సినిమా కలెక్షన్స్ పెరిగాయా? స్టార్ ప్రొడ్యూసర్ కామెంట్స్ ?

PREV
15
పైరసీ వల్ల కోట్లలో నష్టం..

ఫిల్మ్ ఇండస్ట్రీకి పైరసీ వల్ల వేల కోట్ల నష్టం జరుగుతుందన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయంలో సినిమా పెద్దలు చాలా కాలంగా పోరాటం చేస్తూ వస్తున్నారు. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన ఫస్ట్ డేనే పైరసీ సైట్లలో లీక్ కావడం వల్ల వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇక రీసెంట్ కాలంలో పైరసీపై ఫిల్మ్ ఇండస్ట్రీ, పోలీసులు గట్టిగా దృష్టి పెట్టారు. మరీ ముఖ్యంగా ఐబొమ్మ సైట్ ను ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు.. ఆ సైట్ ఓనర్ ఇమ్మడి రవిని ఈమధ్యే అరెస్ట్ చేశారు. రవిని అరెస్ట్ చేయడంతో పాటు ఆ సైట్‌ను కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఐబొమ్మ క్లోజ్ అవ్వడంతో సినిమాల కలెక్సన్లు పెరిగాయా? బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ లాభాలు వస్తున్నాయా? ఈ విషయంపై తాజాగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడారు.

25
రాజు వెడ్స్ రాంబాయి సినిమా కలెక్షన్స్

అఖిల్, తేజస్వి జంటగా రూపొందిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను అందుకుంది. చాలా చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటి వరకు ఈసినిమా 7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ప్రాఫిట్ జోన్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంలో ఈ సినిమాకు థియేట్రికల్ రిలీజ్ ఇచ్చిన నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి మీడియాతో మాట్లాడారు.

35
బన్నీ వాసు కామెంట్స్

బన్నీ వాసు మాట్లాడుతూ, ఈ సినిమా నైజాంలో పెద్ద హిట్ అవుతుందని ముందుగానే నమ్మామని తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, మూడు రోజుల్లోనే నైజాంలో 5 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ప్రస్తుతం కూడా బుకింగ్స్ మంచి స్థాయిలో కొనసాగుతున్నాయని చెప్పారు. మల్టిప్లెక్స్‌ల కంటే సింగిల్ స్క్రీన్స్‌లో బుకింగ్స్ అధికంగా ఉన్నాయని, ఏపీ రాష్ట్రంలో కూడా కలెక్షన్లు మెల్లిగా పెరుగుతున్నాయని చెప్పారు. సినిమా టికెట్ రేటును కేవలం 100 రూపాయలుగా ఉంచడం మంచి ప్రభావం చూపించింది అన్నారు. తక్కువ టికెట్ రేటు ఉన్నందున ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపుతున్నారని వివరించారు. ఇదే సమయంలో ఐబొమ్మ క్లోజ్ అవ్వడం ఈ చిత్రానికి అదనపు ప్లస్ అయిందని చెప్పారు. పైరసీ లేకపోవడంతో థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ పెరిగిందని బన్నీ వాసు వెల్లడించారు.

45
గతంలో తగిలిన దెబ్బలు..

గతంలో ‘తండేల్’ సినిమా సందర్భంగా మూడు రోజులు కలెక్షన్లు బాగున్నప్పటికీ, పైరసీ రావడంతో వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయని బన్నీ వాసు గుర్తుచేశారు. ఈసారి అలాంటిదేమీ జరగకపోవడం, పైరసీ అడ్డుకట్టవేయడం వల్ల.. మంచి క్వాలిటీ సినిమాను థియేటర్లలో జనాలు చూడగలుగుతున్నారు. కలెక్షన్స్ పెరుగుతున్నాయని ఆయన అన్నారు.

55
ఐబొమ్మ సపోర్ట్ చేసేవారికి కౌంటర్లు..

గతంలో జరిగిన ఓ ఈవెంట్లో బన్నీ వాసు మాట్లాడుతూ.. ఐబొమ్మ సపోర్ట్ చేసేవారికి కౌంటర్లు వేశారు. “ఒక తప్పు వల్ల ఇంకొకరికీ బెనిఫిట్ జరిగి వాళ్లు ఆనందంగా ఉన్నారని తెలిసి.. వాళ్లు అలా మాట్లాడుతున్నారు. కానీ రేట్లు పెరిగాయి కాబట్టే పైరసీ చూస్తున్నాం అని చెప్పడం సరైన లాజిక్ కాదు. ఒక వంద సినిమాలు వస్తే రేట్లు ఎక్కువగా ఉన్నవి పాతిక సినిమాలు మాత్రమే. మరి ఆ పాతిక సినిమాలే పైరసీ అవుతున్నాయా? ఆ పాతిక సినిమాల్నే ఐ బొమ్మలో చూస్తున్నారా..? చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్నీ పైరసీ అవుతున్నాయి. వంద రూపాయల టికెట్ ఉన్న సినిమాలు కూడా, 150 రూపాయల టికెట్ ఉన్న సినిమాలు కూడా పైరసీ అవుతున్నాయి. రేట్లు పెంచారు అందుకే పైరసీ చూస్తున్నాం అనడం సరైన మాట కాదు. పైరసీ వల్ల ఇండస్ట్రీకి ఎంత నష్టం జరుగుతుందో ఎవరూ ఆలోచించడం లేదు” అని బన్నీ వాసు అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories