Kumbha Character: దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.
టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చూపించిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. బడ్జెట్ బడా.. టైం ఎక్కువ అయినా.. తన సినిమాలతో అదిరిపోయే కలెక్షన్లు రాబడతాడు జక్కన్న. మరి అలాంటి దర్శకుడు సినిమాలో ఒక్క సీన్ అయినా చాలు.. రెమ్యునరేషన్ తక్కువైనా.. లేకపోయినా కూడా నటించడానికి రెడీ అవుతారు నటీనటులు.
25
విలన్ రోల్స్ ఫేమస్..
మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్.. ఇలా జక్కన్న సినిమా ఏదైనా కూడా విలన్ క్యారెక్టర్లు పవర్‌ఫుల్‌గా ఉంటాయి. హీరోల కంటే అతడి పాత్రకే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' చిత్రంలో అదే రిపీట్ కాబోతోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర పేరు 'కుంభ'.. ఈ రోల్ కోసం రాజమౌళి.. పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ఎంపిక చేశాడని ఇండస్ట్రీ టాక్.
35
విలన్ హీరోనే మించిపోతాడు..
మొదటిగా ఈ రోల్‌లో పృథ్వీరాజ్ సూట్ అవుతాడా..? లేదా.? అనే టాక్ నడిచింది. అయితే ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక.. ఆ అనుమానాలన్నీ కూడా పటాపంచలు అయిపోయాయి. ఆ లుక్ చూసి 'ఈ సినిమాలో విలన్ హీరోనే మించిపోయాడు' అని అందరూ అనుకున్నారు. అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన టాక్ ఇండస్ట్రీలో సాగుతోంది.
పృధ్వీరాజ్ కాదట.. మొదటిగా 'కుంభ' పాత్ర కోసం ఈ మలయాళ హీరోను అనుకోలేదట. ఆ పాత్రకు ఫస్ట్ ఛాయస్‌గా గోపిచంద్‌ను అనుకున్నాడట దర్శకుడు రాజమౌళి. విలన్‌గా గోపీచంద్ చేసి ఉంటే.. ఆ రోల్‌కు కూడా భారీ ఎఫెక్ట్ ఉంటుందని అభిమానుల అభిప్రాయం. కానీ కారణం ఏంటో తెలియదు.. గోపీచంద్ చేతుల్లోనుంచి అది చేజారి.. పృధ్వీరాజ్ సుకుమారన్ తలుపు తట్టింది.
55
వారణాసి టైటిల్ గ్లింప్స్ హిట్..
నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో 'వారణాసి' టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశాడు దర్శకుడు రాజమౌళి. 'గ్లోబ్ ట్రోట్టర్.. టైం ట్రోట్టర్' అంటూ సినిమాపై హైప్ భారీగా పెంచేశాడు రాజమౌళి. అటు మహేష్ బాబు కూడా తన అభిమానులకు ఇంకా బోలెడన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని చెప్పకనే చెప్పాడు.