ఈ కాలంలో 70 ఏళ్లు బ్రతకడమే కష్టం. 80 దాటితే రెస్ట్ లోకి వెళ్లిపోతుంటారు. కాని మన తెలుగు ఇండస్ట్రీలో 80 దాటిన తరువాత కూడా ఫిట్ గా ఉన్నస్టార్స్ ఉన్నారని మీకు తెలుసా? 90 ఏళ్లు దాటిన స్టార్స్ కూడా ఉన్నారు ఇంతకీ వారి ఆరోగ్య రహస్యం ఏంటి?
ఆహార నీయమాలు పాటిస్తూ.. క్రమశిక్షణతో వ్యాయామం చేస్తూ, లైఫ్ స్టైల్ ను సరిగ్గా మెయింటేన్ చేస్తే ఎంత కాలం అయినా హ్యాపీగా బ్రతికేయవచ్చు అని నిరూపిస్తున్నారు కొంత మంది సినిమా తారలు. 60 ఏళ్లు బ్రకడమే కష్టంగా మారిన ఈ కాలంలో, 80 ఏళ్లకు పైగా, మరీ ముఖ్యంగా చెప్పాలంటే 90 ఏళ్లు దాటినా కూడా ఆరోగ్యంగా ఉన్నారు టాలీవుడ్ నుంచి కొంత మంది స్టార్స్. మురళీ మోహన్ నుంచి షావుకారు జానకి వరకూ 80 ఏళ్లుదాటినా ఫిట్ గా ఉన్న తారలు ఎవరంటే?
26
మురళీ మోహన్
మాగంటి మురళీ మోహన్ సినిమాలు, రాజకీయం, వ్యాపారం, అన్ని రంగాలలో సక్సెస్ అయిన ఈ సెలబ్రిటీ, ఈమధ్య కాలంలో అన్నింటి నుంచి రిటైర్ అయ్యారు. బాధ్యలను పిలలకు అప్పగించి సినిమా ఈవెంట్లు, సినిమా ఫంక్షన్స్ కు వెళ్తూ.. లైఫ్ ను గడిపేస్తున్నారు. 85 ఏళ్ల వయస్సులో కూడా ఇప్పటికీ ఫిట్ గా, ఉండటానికి డైట్ తో పాటు వ్యాయామాలు , సరైన నిద్ర కారణం అంటున్నారు మురళీ మోహన్. ఆయన వైట్ రైస్ తినడంమానేసి దాదాపు 60 ఏళ్లు అవుతంది, నైట్ భోజనం బదులుగా ఒక చపాతి మాత్రమ తింటారు. ఇప్పటికీ ఎటుంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హ్యాపీలైఫ్ ను గడుపుతున్నారు మురళీ మోహాన్.
36
షావుకారు జానకి
హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తల్లిగా, అమ్మమ్మగా, జేజమ్మగా కూడా నటిస్తున్నారు షావుకారు జానకి. ప్రస్తుతం ఆమె వయస్సు 94 ఏళ్లు. వయసు మీదపడటంతో ప్రస్తుతం బయట కనిపించడంలేదు షావుకారు జానకి. ఆమె చెల్లులు కృష్ణకుమారి ఈమధ్య కాలంలోనే మరణించారు. అయితే జానకి మాత్రం తన లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ , క్రమశిక్షణ తో ఉండటం వల్లే ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. తన ఆరోగ్య రహస్యాన్ని ఆమె చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.
హీరోగా,విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రిగా, తాతగా ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో మెప్పించిన నటుడు గిరిబాబు. దాదాపు మూడు తరాల తారలతో కలిసి వెండితెరను పంచుకున్న గిరిబాబు, ప్రస్తుతం 82 ఏళ్ల వయసులో కూడా ఫిట్ గా ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉంటూ, ఫ్యామిలీలో టైమ్ ను గడిపేస్తున్నారు. ఆయన తనయుడు రఘుబాబు టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రఘుబాబు కూడా పెద్దగా సినిమాలు చేయడం లేదు.
56
సింగీతం శ్రీనివాసరావు
టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు డైరెక్ట్ చేశారు సింగీతం శ్రీనివాసరావు. బాలకృష్ణతో భైరవ ద్వీప, ఆదిత్య 786, కమల్ హాసన్ తో విచిత్ర సహోదరులు, పుష్పక విమానం లాంటి సినిమాలు చేసిన ఆయన చాలా అడ్వాన్స్ గా ఆలోచించేవారు. తన సినిమాలులో అడ్వాన్స టెక్నాలజీ స్పస్టంగా కనిపించేది. మయాబజార్ లాంటి సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసిన సింగీతం ప్రస్తుతం 94 ఏళ్ల వయస్సులోను డైరెక్ట్ చేయడానికి రెడీ అంటున్నారు. కానీ సినిమాలకు ఈ మధ్యనే కాస్త దూరంగా జరిగిన ఆయన తన ప్యామిలీతో టైమ్ గడుపుతున్నారు.
66
కాంచన
మూడు తరాలకు పైగా స్టార్స్ తో నటించిన అలనాటి హీరోయిన్లలో షావుకారు జానకి తరువాత ప్లేస్ లో కాంచన ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్స్ తో నటించిన ఆమె.. ఈమధ్య కాలంలో అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ నానమ్మగా నటించారు. 86 ఏళ్ళ వయస్సులో కూడా ఇప్పటిక మంచి పాత్ర ఇస్తే నటిస్తానంటున్నారు కాంచన.
ఇలా చాలామంది స్టార్స్ 80,90 ఏళ్లు దాటిన తరువాత కూడా క్రమశిక్షణకలిగిన లైఫ్ స్టైల్ తో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఏఎన్నార్ కూడా 90 ఏళ్లకు పైగా ఎటుంటి అనారోగ్య సమస్యలు లేకుండా హ్యాపీగా గడిపారు.