South Indian Actresses: ప్రముఖ భారతీయ నటీమణుల జాబితాను ఓర్మాక్స్ మీడియా ప్రతి నెలా విడుదల చేస్తుంది. ఆ క్రమంలో ఆగస్టు నెలకు సంబంధించిన టాప్ 10 నటీమణుల జాబితా ఇప్పుడు విడుదల చేసింది.
ఓర్మాక్స్ మీడియా ప్రముఖ నటీమణుల జాబితాలో సౌత్ నటి సమంత మళ్లీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. బాలీవుడ్ నటి అలియా భట్‌ను వెనక్కి నెట్టి ఆమె ముందుకు దూసుకెళ్లింది. టాప్ 10లో సౌత్ హీరోయిన్ల హవానే ఎక్కువగా ఉంది.
25
నయనతార
నయనతార ఆరో స్థానంలో నిలిచింది. ఏడో స్థానంలో రష్మిక మందన్న, ఆ తర్వాత సాయి పల్లవి ఉన్నారు. వరుస విజయాలు సాయి పల్లవిని టాప్‌లోకి తెచ్చాయి. ఆమె నటించిన 'అమరన్' ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు వసూలు చేసింది.
35
సాయి పల్లవి
ఆ తర్వాత, సాయి పల్లవి నటించిన తెలుగు సినిమా 'తండేల్' కూడా పెద్ద విజయం సాధించింది. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. సాయి పల్లవి తర్వాత కియారా అద్వానీ, శ్రీలీల ఉన్నారు.
ఈ జాబితాలో ఏడు స్థానాలను సౌత్ నటీమణులే దక్కించుకున్నారు. పాన్-ఇండియా సినిమాలతో సౌత్ హీరోయిన్లకు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను ఈ జాబితా చూపిస్తుంది.
55
వెనుకబడ్డ బాలీవుడ్ హీరోయిన్లు
టాప్ 10 లో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్లకు మాత్రమే చోటు దక్కింది. అలియా భట్ రెండవ స్థానం, దీపికా పదుకొణె 5వ స్థానం, కియారా అద్వానీ 9వ స్థానం దక్కించుకున్నారు. 10వ స్థానంలో సౌత్ హీరోయిన్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల నిలిచింది.