Published : Sep 20, 2025, 02:00 PM ISTUpdated : Sep 20, 2025, 02:01 PM IST
Siddhu Jonnalagadda : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ఫీవర్ తో సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఊగిపోతున్నారు. సినిమా విడుదలపై తన ఉత్సాహాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ విడుదలకు ముందు నుంచే భారీ హైప్ సృష్టిస్తోంది. అభిమానులతో పాటు సినీ తారలకూ ఈ సినిమా క్రేజీగా మారింది. తాజాగా నటుడు సిద్దూ జొన్నలగడ్డని కూడా ఓజీ ఫీవర్ ముంచేస్తోంది.
25
పవన్ కాదు ఆంధీ
డీజే టిల్లు సినిమాతో యూత్‌కి దగ్గరైన సిద్దూ, ఓజీపై తన ఆసక్తిని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశాడు. తన ఎక్స్ (X) అకౌంట్‌లో ఆయన ఇలా రాశాడు. ఓజీ చిత్రంపై ఉన్న హైప్ కి హెల్త్ అప్సెట్ అయ్యేలా ఉంది. 25వ తేదీ వరకు మేము ఉంటామో పోతామో అర్థం కావడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక 25 తర్వాత పరిస్థితి ఏంటో. పవన్ కళ్యాణ్ గారు.. ఆయన పవన్ కాదు ఆంధీ. సుజీత్ అసలు ఈ క్రేజ్ అన్ రియల్ లా ఉంది అని సిద్ధూ జొన్నలగడ్డ పోస్ట్ చేశారు.
35
ఓజీ కోసం ఫ్యాన్స్ తో పాటు సెలెబ్రిటీలు కూడా..
సిద్దూ కామెంట్స్ చూస్తేనే అతని ఉత్సాహం ఎంత ఉందో అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ స్థాయి సినిమాలంటే అభిమానులతో పాటు సినీ ప్రముఖులూ ఆసక్తిగా ఎదురుచూస్తారని మరోసారి రుజువైంది.
ఓజీని సుజీత్ దర్శకత్వంలో DVV ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో, ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీయా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
55
బుకింగ్స్ ఓపెన్
సినిమా బుకింగ్స్ ఇప్పటికే కొన్ని తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ థియేటర్లలో ప్రారంభమయ్యాయి. ఈ నెల సెప్టెంబర్ 25న ఓజీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అంటే ఎప్పుడూ ఉత్సాహమే. కానీ ఓజీ విషయంలో మాత్రం ప్రత్యేకంగా సెలబ్రిటీ స్థాయిలో కూడా క్రేజ్ కనిపిస్తోంది. సిద్దూ జొన్నలగడ్డ రియాక్షన్ ఈ క్రేజ్‌కి మరింత బలం చేకూర్చింది.