Alekhya Reddy: తారకరత్నతో లవ్‌ స్టోరీ, మొదటిసారి ఓపెన్‌ అయిన అలేఖ్యరెడ్డి.. నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టడంపై ఆవేదన

Published : Mar 10, 2026, 08:03 PM IST

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి బయటకు వచ్చింది. తారకరత్నతో తన లవ్‌ స్టోరీ గురించి, ఫ్యామిలీ బాండింగ్‌ గురించి వెల్లడించింది. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

PREV
15
తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన తారకరత్న

నందమూరి తారకరత్న.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రంతోనే సంచలనం సృష్టించారు. ఆయన క్రేజీ హీరోగా రాణించారు. ఒక్కమూవీతోనే టాలీవుడ్‌ని షేక్‌ చేశాడు. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లకు పోటీగా వారి ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చారనే ప్రచారం జరిగింది. అంతేకాదు మొదటి సినిమా విడుదలయ్యాక ఏకంగా ఒకేరోజు తొమ్మిది సినిమాలను ప్రారంభించారు. ఇలా వార్తల్లో నిలిచిన ఆయన ఆ తర్వాత డౌన్‌ అయ్యారు. హిట్లు, పరాజయాలను ఫేస్‌ చేస్తూ వచ్చారు. క్యారెక్టర్స్ వైపు కూడా టర్న్ తీసుకున్నారు. విలన్‌రోల్స్ కూడా చేశారు.

25
మొదటి భర్తతో విడాకులు తీసుకున్న అలేఖ్యరెడ్డి

గత ఎన్నికలకు ముందు ఆయన రాజకీయంగా యాక్టివ్‌ అయ్యారు. నారా లోకేష్‌ పాదయాత్రలోనూ ఆయన పాల్గొన్నారు. కానీ అదే రోజు ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కోమాలోకి వెళ్లి 2023 ఫిబ్రవరిలో కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా నందమూరి ఫ్యామిలీ, వారి అభిమానులు షాక్‌ అయ్యారు. అలాంటి సమయంలో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అండగా నిలిచింది విజయసాయి రెడ్డి. ఆయన ఆమెకి బాబాయ్‌ అవుతారు. చిన్నప్పట్నుంచి ఆయన ఇంట్లోనే పెరిగింది అలేఖ్యరెడ్డి. ఆమెకి మొదట వేరే వ్యక్తితో పెళ్లి అయ్యింది. ఆయన్నుంచి విడిపోయిన తర్వాత తారకరత్నతో ప్రేమలో పడ్డారు. 

35
సంఘీ టెంపుల్ లో అలేఖ్యరెడ్డిని పెళ్లి చేసుకున్న తారకరత్న

తారకరత్న.. అలేఖ్యరెడ్డిని పెళ్లి చేసుకోవడం నందమూరి ఫ్యామిలీకి ఇష్టం లేదు, అందుకే పెళ్లికి నో చెప్పారు. కానీ అలేఖ్య రెడ్డిపై ఉన్న ప్రేమతో, ఆమె కోసం నిలబడాలని చెప్పి ఆయన పెద్దలను ఎదురించి సంఘీ టెంపుల్‌ లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా  తారకరత్న పేరెంట్స్ దూరం పెట్టారని వెల్లడించింది అలేఖ్య రెడ్డి. మొదటి సారి ఆమె బయటకు వచ్చింది. తాజాగా ఆమె నిఖిల్‌ విజయేంద్ర సింహ(యాంకర్‌ నిఖిల్‌)కి ఇచ్చిన పాడ్‌ కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది.

45
తారకరత్నతో అలేఖ్య రెడ్డి లవ్‌ స్టోరీ

పెళ్లికి ముందే తారకరత్న తెలుసు అని, చాలా సార్లు కలిశామని, తాము మంచి స్నేహితులమని తెలిపింది అలేఖ్య రెడ్డి. దీంతో తమ పేరెంట్స్ కి కూడా తారక రత్న క్లోజ్‌ అని వెల్లడించింది. కొన్నాళ్ల స్నేహం తర్వాత తారకరత్ననే ప్రపోజ్‌ చేశాడట. అయితే అప్పటికే తాను మొదటి భర్త నుంచి విడిపోయిన నేపథ్యంలో తర్వాత ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే క్లారిటీ లేదట. అప్పటికీ తనకు ఎలాంటి ఐడియా లేదని, దీంతో తారక్‌ ప్రపోజ్‌ చేసినప్పుడు తాను నో చెప్పిందట. పేరెంట్స్ తో మాట్లాడాడు అని చెప్పిందట. దీంతో వారితో మాట్లాడిన తర్వాత  అలేఖ్య రెడ్డి కూడా ఓకే చెప్పారు. కానీ తారకరత్న పేరెంట్స్ ఒప్పుకోలేదట. ఇప్పటికీ దూరంగానే ఉన్నట్టు తెలిపింది అలేఖ్య రెడ్డి.

55
ఇప్పటికైనా చేరదీస్తారనే నమ్మకంతో ఉన్నట్టు చెప్పింది అలేఖ్య రెడ్డి

తారకరత్న మరణించిన తర్వాత పిల్లల కోసం అయిన దగ్గరవుతారని అనుకుందట. కానీ కాలేదని తెలిపింది. భవిష్యత్‌లో కలుస్తారని, చేరదీస్తారనే నమ్మకంతో ఉన్నట్టు తెలిపింది అలేఖ్య రెడ్డి. అయితే తన పేరెంట్స్ కూడా దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాను పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నట్టు వెల్లడించింది. తనకు ముగ్గురు పిల్లలు అని, వారిని చూసుకుంటూ హ్యాపీగానే ఉంటున్నట్టు వెల్లడించింది. తారకరత్న పేరెంట్స్ ఇంకా కలవలేకపోయినా, బాలయ్య బాబాయ్‌, షర్మిలా అక్క టచ్‌లోనే ఉన్నారని, విజయసాయి రెడ్డి బాబాయ్‌ తనకు మరో తండ్రి లాంటివారని, వారు బాగా చూసుకుంటారని తెలిపింది అలేఖ్య రెడ్డి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories