Rajendra Prasad: కత్తి కాంతారావు జాతీయ పురస్కారం నటకిరీటి రాజేంద్రప్రసాద్‌కి వరించింది. ఈ క్రమంలో తాజాగా ఆయన తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఇటీవల కాలంలో ఎక్కువగా వివాదాల్లో నిలుస్తున్నారు. ఆయన ఇతర నటులపై, నటీమణులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేరాఫ్ గా మారిపోతున్నారు. ఆ మధ్య అలీపై వల్గర్ కామెంట్ చేశారు. అలాగే అంతకు ముందు `పుష్ప` సినిమా విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చుట్టూ వివాదం నడిచింది. ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు. అనంతరం కొన్నాళ్లపాటు ఆయన సైలెంట్‌గా ఉన్నారు. వివాదాలకు దూరమయ్యారు. కానీ పద్మ అవార్డులపై ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పద్మ అవార్డు వరించింది.
25
రాజేంద్రప్రసాద్‌కి కత్తి కాంతారావు జాతీయ అవార్డు
నటకిరీటి రాజేంద్రప్రసాద్‌కి ఇటీవలే పద్మశ్రీ పురస్కారం వరించింది. కేంద్రప్రభుత్వం ఆయన్ని ఈ అత్యన్నత పురస్కారంతో గౌరవించింది. తాజాగా కత్తి కాంతారావు జాతీయ అవార్డు దక్కింది. తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో కళా ప్రపూర్ణ కత్తి కాంతారావు జాతీయ పురస్కారం వరించింది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారం రాజేంద్రప్రసాద్‌కి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేశారు.
35
ఎంజీఆర్‌పై రాజేంద్రప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు
కత్తి కాంతారావు గొప్పతనం తెలియజేస్తూ, ఎంజీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కత్తి కాంతారావు కత్తి యుద్ధాలకు కేరాఫ్. జానపద చిత్రాలతో విశేష ఆదరణ పొందారు. స్టార్‌గా రాణించారు. కత్తి యుద్ధాలతో కూడిన సినిమాలు చేయాలంటే మొదట వినిపించే పేరు కాంతారావుదే. ఆయన్ని చూసి ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటులు కూడా వెనకడుగు వేసేవారట. అదే భయం తమిళ హీరోల్లోనూ ఉండేదట. ఈ విషయాలను ప్రస్తావిస్తూ రాజేంద్రప్రసాద్ క్రేజీ కామెంట్ చేశారు. కత్తి కాంతారావుని చూస్తే ఎంజీఆర్‌కి కూడా `ఉ..` పడేదంటూ వ్యాఖ్యానించారు.
`కాంతారావు పేరు చెబితే అమ్మ బాబోయ్ అని వణికిపోయేవాడు ఎంజీఆర్. ఆయన జానపదాలు చూసి వాడెవడురా బాబోయ్, ఇండియన్ సినిమాని లేపుకెళ్లిపోతున్నాడు అని భయపోయాడు ఎంజీఆర్` అని కామెంట్ చేశారు. ఇంకా మాట్లాడుతూ, ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు దీటుగా కాంతారావు రాణించారని, అదే సమయంలో వాళ్లతోనూ కలసి సినిమా చేశారని తెలిపారు. వారికి తమ్ముడు రోల్స్, బామ్మర్థి రోల్స్ ఇలా ఇంపార్టెంట్ ఏదున్నా కాంతారావుగారే కనిపించేవారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో మొదటి హీరో కాంతారావు అని వెల్లడించారు రాజేంద్రప్రసాద్. అయితే కాంతారావు గొప్పతనం చెప్పడం అభినందనీయమే, కానీ మరో హీరోని కించపరిచేలా వ్యాఖ్యానించడం షాకిస్తోంది. దీంతో మళ్లీ రాజేంద్రప్రసాద్‌పై ట్రోల్స్ ఊపందుకున్నాయి. మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
55
తెలంగాణ తొలి హీరో కత్తి కాంతారావు
కాంతారావు.. తెలంగాణ నుంచి సినిమాల్లోకి వచ్చి హీరోగా రాణించారు. స్టార్ హీరోగా ఎదిగారు. నలభై ఏళ్ల సినిమా కెరీర్‌లో 400లకుపైగా చిత్రాల్లో నటించారు. జానపద చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు. `నిర్ధోశి`గా కెరీర్‌ని ప్రారంభించారు. ప్రారంభంలో క్యారెక్టర్స్ చేసిన ఆయన ఆ తర్వాత హీరోగా మెప్పించారు. వందకుపైగా చిత్రాల్లో హీరోగా నటించారు. సావిత్రితో కలిసి నటించిన `చివరికి మిగిలేది`లో హీరోగా నటించారు. కాంతారావు చివర్లో ఆర్థిక ఇబ్బందులు పడ్డారని అంటుంటారు. ఆయన 2009లో మార్చి 22న కన్నుమూశారు.