డీమన్ పవన్ ఇంట తీవ్ర విషాదం, తండ్రిని కోల్పోయిన బిగ్ బాస్ స్టార్..

Published : Mar 10, 2026, 07:11 PM IST

బిగ్ బాస్ స్టార్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం జరిగింది. పవన్ తండ్రి క్యాన్సర్ తో బాధపడుతూ.. కన్నుమూశారు. ఈ విషయం తెలిసి బుల్లితెర సెలబ్రిటీలు పవన్ ను పరామర్శిస్తున్నారు.

PREV
13
డీమన్ పవన్ ఇంట తీవ్ర విషాదం..

బిగ్ బాస్ సీజన్ 9లో స్టార్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న డీమన్ పవన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డీమన్ పవన్ తండ్రి నోటి క్యాన్సర్ తో బాధపడుతూ కన్నుమూశారు. ఈ విషాద విషయాన్ని పవన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ఆయన ఒక ఎమోషనల్ పోస్టును షేర్ చేశారు.డీమన్ పవన్ తండ్రి కొంతకాలంగా నోటి క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పవన్ ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో వెల్లడించాడు.

23
నోటి కాన్సర్ కారణంగా..

పవన్ ఈ విషయం వెల్లడించిన సమయంలో ఎమోషనల్ అయ్యాడు.. అందరిని ఏడిపించాడు. ఆ సందర్భం ఆడియన్స్ కూడా ఒకింత ఎమోషనల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తండ్రి మరణించడంతో పవన్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్, అభిమానులు , సెలబ్రిటీలు పవన్ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. పవన్ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయనకు  సందేశాలు పంపిస్తున్నారు.

33
సామాన్యుల క్యాటగిరీ నుంచి

డీమన్ పవన్ బిగ్ బాస్ సీజన్ 9లో సామాన్యుల క్యాటగిరీ నుంచి ఎంపికై అగ్నిపరీక్షలో పాల్గొని హౌస్ లోకి ప్రవేశించాడు. తన ఆటతీరు, ధైర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ చివరి వరకు పోటీ కొనసాగించాడు. ఈ సీజన్ లో పవన్ టాప్ 3 వరకు చేరుకుని ప్రత్యేక గుర్తింపు పొందాడు.హౌస్ లో ఉన్న సమయంలో రీతూ చౌదరితో ఆయనకు ఉన్న రిలేషన్ కారణంగా కొన్ని విమర్శలు కూడా ఎదురయ్యాయి. 

అయినప్పటికీ తన ఆటతో ప్రేక్షకులను మెప్పించడంలో పవన్ విజయవంతమయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో రెండు సార్లు కెప్టెన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. ఫైనల్ దశకు చేరుకున్న సమయంలో డీమన్ పవన్ 15 లక్షల రూపాయల సూట్ కేస్ ఆఫర్ ను తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చాడు.

Read more Photos on
click me!

Recommended Stories