తన మాటలను సమర్ధించుకున్న తమ్మారెడ్డి
మంచు విష్ణు హీరోగా నటించిన మైథలాజికల్ మూవీ 'కన్నప్ప.' దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో, భారీ కాస్టింగ్ తో, పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించిన ఈసినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఈక్రమంలో ఈ సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపించిన నేపథ్యంలో, ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చకు దారి తీస్తున్నాయి.
ఈ సినిమాపై తాను చేసిన విమర్శలపై వస్తున్న ప్రతిస్పందనలకు తాజాగా ఆయన సమాధానమిచ్చారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలు సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపించాయి అనే కామెంట్స్ కు ఆయన క్లారిటీ ఇచ్చారు.
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ – “కన్నప్ప సినిమాను నేను ఎనిమిదో రోజున చూసాను. దాని గురించి తొమ్మిదో రోజున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాను. పదవ రోజున ఆ సినిమా చూసిన వారందరికీ నేను చెప్పిన విషయాలు తెలిసే ఉంటాయి. అంత గ్యాప్ తర్వాత మాట్లాడటం వల్ల ఏ నష్టం జరుగుతుంది? అప్పటికే ఆ సినిమా కలెక్షన్స్ డౌన్ అయిపోయాయి, ఇక నావల్ల ఈసినిమాకు జరిగే నష్టం ఏముంటుంది.” అని ఆయన ప్రశ్నించారు.