Kingdom Review: `కింగ్డమ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. విజయ్‌ దేవరకొండకి సాలిడ్‌ కమ్‌బ్యాక్‌ వచ్చిందా?

Published : Jul 31, 2025, 12:15 PM IST

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన `కింగ్డమ్‌` మూవీ నేడు గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
17
`కింగ్డమ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందిన చిత్రం ``కింగ్డమ్‌`. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. 

చిన్నగా ప్రారంభమైన ఈ మూవీ ఇప్పుడు భారీ బడ్జెట్‌ చిత్రంగా మారింది. దీనిపై ఆడియెన్స్‌ లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంది. విజయ్‌ పాత్రలోని షేడ్స్ ఆశ్చర్యపరుస్తున్నాయి. ట్రైలర్‌లో చూపించని మరో వ్యక్తి ఉండబోతున్నారని తెలుస్తోంది. 

ఇవన్నీ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తున్నాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌, సత్యదేవ్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు గురువారం(జులై 31)న విడుదలైంది. సినిమా ఎలా ఉంది? విజయ్‌కి కమ్‌ బ్యాక్‌ ఇచ్చే మూవీ అవుతుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

DID YOU KNOW ?
విజయ్ బిజినెస్‌
విజయ్‌ దేవరకొండ `రౌడీ వేర్‌` పేరుతో దుస్తుల వ్యాపారం నిర్వహిస్తున్నారు.
27
`కింగ్డమ్‌` మూవీ కథేంటంటే?

సూరి(విజయ్‌ దేవరకొండ) ఒక కానిస్టేబుల్‌. అన్నయ్య శివ(సత్యదేవ్‌) చిన్నప్పుడే తండ్రిని చంపేసి ఇంటి నుంచి పారిపోతారు. అన్నకోసం 18 ఏళ్లుగా వెతుకుతూనే ఉంటాడు సూరి. అన్న పెద్దయ్యాక ఎలా ఉంటారో చిత్రపటం గీయించడానికి కమిషనర్‌ ఆఫీస్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఒక నక్సలైట్‌ని అరెస్ట్ చేసి, అతని తండ్రిని పోలీసులు కొడుతుంటారు.

 దీంతో ఆ వృద్ధుడిని సేవ్‌ చేసే క్రమంలో పోలీస్‌ని కొడతాడు సూరి. నక్సలైట్‌ తప్పించుకుంటాడు. దీంతో సూరిని సస్పెండ్‌ చేయాలని పై ఆఫీసర్లు ఒత్తిడి తెస్తుంటారు. కానీ పెద్ద ఆఫీసర్‌కి సూరి చెప్పిన సమాధానం నచ్చుతుంది. 

అతని లాజిక్‌, ఎంక్వైరీ చేసిన విధానం నచ్చి స్పైగా ట్రైనింగ్‌ ఇస్తారు. శ్రీలంకలో మాఫియాని పట్టించే బాధ్యతలు అప్పగిస్తారు. అక్కడి ట్రైబల్స్ నాయకుడిని పట్టించాలని చెబుతారు. ఆ ట్రైబల్‌ నాయకుడే శివ. వీరంతా స్థానిక గోల్డ్ స్మగ్లర్స్ కింద పనిచేస్తుంటారు. అన్నని కలిసే అవకాశం ఉంటుందని పోలీస్‌ అధికారి చెప్పడంతో సూరి ఆ పని చేసేందుకు ఒప్పుకుంటాడు. 

శ్రీలంక వెళ్లిన సూరి జైల్లో అన్న శివని కలుస్తాడు. దీంతో వారి తెగలో ఒకరిగా ఉండిపోతుంటాడు. అన్నని మార్చి ఇండియాకి తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తుంటాడు. అదే సమయంలో పోలీస్‌లకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తుంటారు. 

ఓ సారి గోల్డ్ ని తీసుకొచ్చే క్రమంలో పోలీస్‌లు వెంబడిస్తారు. తమలోనే ఎవరో ఒకరు ఇన్‌ఫార్మర్‌ ఉన్నారని మురుగన్‌(వెంకటేష్‌ వైపీ) టీమ్‌కి తెలుస్తుంది. మరి ఆ ఇన్‌ఫార్మర్‌ ఎవరు? సూరి కోసం అన్న శివ చేసిన త్యాగం ఏంటి?

 ఇండియా నుంచి పారిపోయిన ఆ ట్రైబల్స్ కొలిచే నాయకుడు ఎవరు? వాళ్లు ఇండియా నుంచి ఎందుకు పారిపోయారు? 70ఏళ్ల(1920) క్రితం ఏం జరిగింది? దానికి దీనికి లింకేంటి? అనేది మిగిలిన సినిమా.

37
`కింగ్డమ్‌` మూవీ విశ్లేషణ

 గతాన్ని చూపించి, దానికి ప్రస్తుతానికి లింక్‌ పెడుతూ, ట్రైబల్‌ తెగ తమ నాయకుడి కోసం 70ఏళ్లుగా వెయిట్‌ చేస్తుండగా, ఆ స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఎలా వచ్చారు? ఆ నాయకుడి జర్నీ ఏంటనేది `కింగ్డమ్‌` మూవీ కథ. 

ఇందులో మరో లేయర్‌ ఉంది. చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన అన్న కోసం తమ్ముడు వెతుకులాట. అన్నని కలుసుకునేందుకు ఎంతటి సాహసానికి దిగాడు? చివరికి అన్నకి ఎలా దగ్గరయ్యాడనేది మరో కథ. ఈ రెండింటిని లింక్‌ చేస్తూ ఈ మూవీని రూపొందించారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. 

ఈ రెండు వేర్వేరు లేయర్లుగా చూస్తే ఇప్పటికే ఇలాంటి కథలు వచ్చాయి. కానీ కలిపి చూసినప్పుడు కొత్తగా ఉంటుంది. అదే ఇందులో ఒక హైలైట్‌ పాయింట్‌. దాన్ని లింక్‌ చేసిన తీరు బాగుంది. సినిమా మొత్తం హైలీ ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. అన్నదమ్ముల బాండింగ్‌ని బలంగా చూపించే ప్రయత్నం చేశారు. 

అదే మెయిన్‌ ఎమోషనల్‌ పాయింట్‌గా చెప్పొచ్చు. ఆ ఎమోషన్స్ ని క్యారీ చేయడంలో టీమ్‌ సక్సెస్‌ అయ్యింది. సినిమాగా చూసినప్పుడు మొదట.. 1920లో శ్రీకాకుళంలో బ్రిటీష్‌ వారు ట్రైబల్స్ ని చంపడంతో వారు శ్రీలంకకి పారిపోవడం చూపించారు. 

అప్పుడే నాయకుడి కోసం వెయిట్‌ చేస్తున్నట్టుగా చూపించి  హైప్‌ పెంచారు. కట్‌ చేస్తే కానిస్టేబుల్‌గా పనిచేసే సూరి పోలీస్‌ ఆఫీసర్‌ని కొట్టడం, ఈ క్రమంలో ఒక నక్సలైట్‌ పారిపోవడం, ఆ సమయంలో సూరిలోని టాలెంట్‌ని చూసిన పెద్ద ఆఫీసర్‌ స్పైగా మార్చి శ్రీలంకకి పంపించడం మెయిన్‌గా చూపించారు. 

మధ్య మధ్యలో సూరి తన అన్నని, చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ని నడిపించారు. ఇదంతా క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది.

47
`కింగ్డమ్‌` మూవీలోని హైలైట్స్

శ్రీలంకకి వెళ్లిన సూరి అన్నని కలవడం, అన్న ఆపదలో ఉనప్పుడు అక్కడ తన టాలెంట్‌ ఉపయోగించి స్మగ్లింగ్‌ నాయకుడి కంట్లో పడటంతో ఆసక్తికరంగా మారుతుంది. అదే సమయంలో పోయిన గోల్డ్ ని తీసుకురావడంతో అక్కడ ట్రైబల్స్ అంతా సూరిని హీరోగా చూస్తుంటారు. 

ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కాస్త ఎమోషనల్‌గా, మరికాస్త హై ఇచ్చేలా ఉంటుంది. సెకండాఫ్‌ అంతా ఫాస్ట్ గా జరిగిపోయినట్టు ఉంది. ఇన్ ఫార్మర్‌ ఎవరు అనేదాని చుట్టూనే సాగుతుంది. క్లైమాక్స్ ఎపిసోడ్‌ మరింత ఎమోషనల్‌గా ఉంటుంది. 

ఎండింగ్‌ భారీగా హైప్‌ ఇచ్చిన విధానం బాగుంది. దీనికి పార్ట్ 2 కూడా ఉండబోతుందని లీడ్‌ ఇచ్చిన తీరు, కొత్త పాత్రల ట్విస్ట్ లు, కొత్త కథకి లీడ్‌ ఇచ్చిన తీరు బాగుంది. ఫస్టాఫ్‌లో పోలీస్‌ స్టేషన్‌ సీన్‌, జైల్లో కొట్టుకునే సీన్‌, అన్నని కలిసే సీన్‌, ఆ తర్వాత శ్రీలంక పోలీసులకు దొరికినప్పుడు వారి నుంచి సేఫ్‌ గా బయటకు వచ్చినప్పుడు వచ్చే సీన్‌ హై ఇచ్చేలా ఉంటాయి. 

ఆయా ఎలివేషన్లు అదిరిపోయాయి. సెకండాఫ్‌లో క్లైమాక్స్ బాగానే ఉంది. కాకపోతే ఇంకా బాగా డీల్‌ చేయోచ్చు. ఎలివేషన్లు, విజయ్‌ దేవరకొండ వన్‌ మ్యాన్‌ షో సినిమాకి పెద్ద అసెట్‌గా చెప్పొచ్చు. 

అన్నదమ్ముల మధ్య ఎమోషన్స్ మరో హైలెట్ గా నిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ మూవీని నడిపించేది అదే. విజయ్‌ నటన, అనిరుధ్‌ బీజీఎం సినిమాని నిలబెట్టాయి. శ్రీలంకలో యాక్షన్‌ సీన్లు మరో హైలైట్‌గా నిలిచాయి.

57
`కింగ్డమ్‌` మూవీ మైనస్‌లు

మైనస్‌ల విషయానికి వస్తే, కథలోని లూప్స్ పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. లాజికల్‌గా వర్కౌట్‌ చేయలేదు. చాలా చిన్న చిన్న మిస్టేక్స్ వదిలేశారు. కథలో క్లారిటీ మిస్‌ అయ్యింది. అన్నదమ్ముల ఎమోషన్స్ తో ట్రైబల్‌ నాయకుడు ఎపిసోడ్‌ని లింక్‌ చేసే విషయంలో మరింత క్లారిటీ తీసుకోవాల్సింది. 

దర్శకుడు కథనాన్ని నడిపించే విషయంలో కొంత తడబాటు కనిపిస్తుంది. బలమైన విలన్‌ని పెట్టలేకపోయారు. సత్యదేవ్‌ పాత్రని సరిగా వాడుకోలేకపోయారు. కథ మొత్తం సీరియస్‌గా సాగుతుంది. కాస్త రిలీఫ్‌ ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌ సీన్లు పెడితే బాగుండేది. అలాగే హీరోయిన్‌తో రొమాంటిక్‌ సాంగ్‌ని కూడా కట్‌ చేశారు.

 మరోవైపు డైలాగ్‌ల పరంగానూ వీక్‌గా ఉంది. కథకి తగ్గ బలమైన డైలాగ్‌లు లేవు. చాలా లాజిక్స్ మిస్‌ అయ్యాయి. క్లైమాక్స్ యాక్షన్‌ సీన్‌లో విజయ్‌ ని దూరంగా పెట్టడం కూడా కన్విన్సింగ్‌ గా లేదు. అంతా అయిపోయాక ఆయన వెళ్లి యాక్షన్‌లోకి దిగడం అంతగా కనెక్టింగ్‌గా లేదు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుని కథనాన్ని మరింత బాగా నడిపిస్తే సినిమా వేరే లెవల్‌లో ఉండేది.

67
`కింగ్డమ్‌` మూవీ ఆర్టిస్ట్ ల నటన

సూరి పాత్రలో విజయ్‌ దేవరకొండ అదరగొట్టాడు. తన కెరీర్‌ బెస్ట్ ఇచ్చారు. నటుడిగా ఆయనకు వందకు వంద మార్కులు పడతాయి. ఇంకా చెప్పాలంటే ఆయనే సినిమాని నిలబెట్టాడు. డిఫరెంట్‌ షేడ్స్ లో ఆకట్టుకున్నారు. ఎమోషనల్‌ సీన్లలో రెచ్చిపోయాడు. 

శివ పాత్రలో సత్య దేవ్‌ సైతం బాగా చేశాడు. ఎమోషన్స్ పరంగానూ మెప్పించారు. భాగ్యశ్రీ బోర్సే డాక్టర్‌గా కనిపించింది. ఆమె పాత్ర పరిమితంగానే ఉంటుంది. నెగటివ్‌ రోల్‌లో వెంకటేష్‌ వైపీ బాగా చేశారు. ఈ మూవీ ఆయనకు మంచి గుర్తింపు తెస్తుంది. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

77
`కింగ్డమ్‌` మూవీ టెక్నీషియన్ల పనితీరు

సినిమాకి అనిరుధ్‌ మ్యూజిక్‌ ప్రాణం. హైలైట్‌ కూడా. సాంగ్స్ బాగున్నాయి. బీజీఎం అదిరిపోయింది. క్లైమాక్స్‌ సాంగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. తన బీజీఎంతో మామూలు సీన్లకి ఎలివేట్‌ చేశారు.

సినిమాటోగ్రాఫర్లు జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్  కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా, గ్రాండియర్‌గా ఉంది. ఎడిటర్‌ నవీన్‌ నూలి ఎడిటింగ్‌ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ఎంచుకున్న పాయింట్‌ బాగానే ఉన్నా, సినిమాలో బలమైన కథని చూపించలేదు. కథనాన్ని బాగా రాసుకోలేకపోయారు. 

డైలాగ్‌ పరంగానూ కొంత లోటు కనిపిస్తుంది. డైరెక్షన్‌ పరంగా ఆయన ఇంకా బాగా చేయాల్సింది. మాస్‌, యాక్షన్‌, ఎమోషన్స్, ఎలివేషన్లపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. అక్కడ సక్సెస్‌ అయ్యారు. 

కానీ కథ విషయంలో, సినిమాని నడిపించే విషయంలో ఆయన క్లారిటీ మిస్‌ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఎమోషనల్‌ యాక్షన్‌ మూవీని తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఇది ఎబౌ యావరేజ్‌ మూవీ.

ఫైనల్‌గాః విజయ్‌ దేవరకొండ నటన కోసం, అనిరుధ్‌ బీజీఎం కోసం, బ్రదర్స్ సెంటిమెంట్‌, యాక్షన్స్ కోసం చూడగలిగే మూవీ.

రేటింగ్‌ః 3/5

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories